ETV Bharat / city

దసరా నాటికి ఇళ్ల నిర్మాణ పనులు పూర్తవ్వాలి: ఇంద్రకరణ్​రెడ్డి

నిర్మల్ నియోజకవర్గంలో చేపట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణంపై నిర్మల్​ కలెక్టరేట్​లో మంత్రి ఇంద్రకరణ్​రెడ్డి సమీక్ష నిర్వహించారు. దసరా నాటికీ గృహప్రవేశాలు చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

దసరా నాటికి ఇళ్ల నిర్మాణ పనులు పూర్తవ్వాలి: ఇంద్రకరణ్​రెడ్డి
దసరా నాటికి ఇళ్ల నిర్మాణ పనులు పూర్తవ్వాలి: ఇంద్రకరణ్​రెడ్డి
author img

By

Published : Aug 29, 2020, 9:42 PM IST

నిర్మల్ నియోజకవర్గంలో చేపట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేసి దసరా నాటికి పూర్తి చేయాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అధికారులను ఆదేశించారు. శనివారం సాయంత్రం కలెక్టరేట్​లోని సమావేశమందిరంలో కలెక్టర్ ముషార్రఫ్ ఫారూఖీతో సమీక్ష నిర్వహించారు.

నియోజకవర్గానికి మొత్తం 3,761 ఇళ్లు మంజూరు కాగా.. అందులో పట్టణంలోని బంగాల్ పేట్, నాగనాయిపేట్​లలో 1,460, గ్రామీణ ప్రాంతాల్లో 2,301 కేటాయించినట్లు కలెక్టర్ వివరించారు. ఇప్పటివరకు 2,716 ఇళ్లకు టెండర్లు పూర్తి కాగా, 29 గ్రామాల్లో 1,256 ఇళ్లకు పరిపాలన అనుమతులు పొందాయన్నారు. ఆర్​అండ్​బీ, పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన మొత్తం ఇళ్ల టెండర్లు వెంటనే పూర్తి కావాలని మంత్రి ఆదేశించారు.

సిమెంట్, ఇసుక, ఇనుము సకాలంలో అందేలా చర్యలు చేపట్టాలని సూచించారు. పనుల వివరాలను ఎప్పటికప్పుడు ఆన్​లైన్​లో నమోదు చేయాలన్నారు. ఇప్పటికే పూర్తైన డబుల్ బెడ్​రూమ్ ఇళ్లు కాలనీలలో మిషన్ భగీరథ తాగునీరు, విద్యుత్ సరఫరా, రోడ్లు, మురుగుకాలువల నిర్మాణ పనులను సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో త్వరగతిన పూర్తి చేసి దసరా నాటికీ గృహప్రవేశాలు చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ఇవీ చూడండి: మారటోరియం గడువు డిసెంబర్​ 31వరకు పొడిగించండి: నామ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.