Leopards Commotion: నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం బీరవెల్లి గ్రామ శివారులో చిరుత పులుల సంచారం అలజడి రేపుతోంది. అర్ధరాత్రి పొలానికి కాపలాగా ఉన్న రైతు మూడు చిరుతలను చూసి ఆందోళన చెందాడు.
వెంటనే గ్రామస్థులను అప్రమత్తం చేయడంతో దాదాపు 40 మంది అక్కడికి చేరుకొని అరిచారు. దీంతో ఆ చిరుత పులులు అటవీ ప్రాంతం వైపు పారిపోయాయి. ప్రస్తుతం అవి వెళ్లినప్పటికీ మళ్లీ ఎప్పుడు వస్తాయోనని జనంలో ఆందోళన నెలకొంది. మళ్లీ పంటపొలాల దగ్గర కాపలా ఉన్న వారిపై దాడి చేస్తే పరిస్థితి ఏంటని రైతులు భయాందోళనలకు గురవుతున్నారు.