రాష్ట్రంలో విద్యుత్ కార్మికుల ఉద్యోగ భద్రత కోసం అవసరమైతే మరో ఉద్యమానికైనా సిద్ధమేనని ఐఎన్‌టీయూసీ అనుబంధ విద్యుత్ ఉద్యోగుల యూనియన్ రాష్ట్ర జనరల్ సెక్రటరీ శ్రీధర్ అన్నారు. ఆదిలాబాద్‌లో ఏర్పాటు చేసిన ఉమ్మడి జిల్లా విద్యుత్ ఉద్యోగుల సర్వసభ్య సమావేశంలో పాల్గొని ప్రసంగించారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కాంట్రాక్ట్ కార్మికులను ఉద్యోగులుగా గుర్తించారే తప్ప... సమాన వేతనాలు ఇవ్వడం లేదని ఆరోపించారు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా ఫలితంలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యోగుల ప్రయోజనాల కోసం ఉద్యమానికీ వెనకాడబోమని హెచ్చరించారు.