సమ్మక్క-సారక్క జాతరతో పాటు, జనసంచారం కలిగిన ప్రాంతాల్లో చోరీకి పాల్పడిన ముగ్గురిని అరెస్టు చేసినట్లు మంచిర్యాల డీసీపీ ఉదయ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ జిల్లా బేత్మ తాలుకాకు చెందిన.. రచవల్ సోలంకి, షారుఖ్ సింగ్ రారోడ్, జానెమన్ సోలం గత రెండు నెలలుగా దొంగతనాలు చేస్తున్నారు. సీసీసీ, శ్రీరాంపూర్, గోదావరి ఖనిలో జనసంచారం కలిగిన స్థలాల్లో ప్రజల జేబులు, మహిళల హ్యాండ్ బ్యాగ్, చరవాణులు దొంగిలించారు.
రూ.2.50 లక్షలు స్వాధీనం..
సీసీసీలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద పోలీసులు వాహన తనిఖీలు చేస్తుండగా నిందితులు అనుమానాస్పదంగా కనిపించారు. వారిని అదుపులోకి తీసుకొని విచారించగా దొంగతనం చేసినట్లు అంగీకరించారు. నిందితుల నుంచి రూ.2.50 లక్షల నగదు, ఐదు చరవాణులు స్వాధీనం చేసుకొని రిమాండ్‌కు తరలించారు.
ఇవీ చూడండి: ఆ భయానక అల్లర్లకు సాక్ష్యం ఈ డ్రైవర్