ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలు ధర్నా చేపట్టారు. వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలంటూ నినాదాలు చేశారు. అంగన్‌వాడీ కేంద్రాలను పాఠశాలలో విలీనం చేసే ఆలోచనను వెనక్కి తీసుకోవాలని, ప్రైవేటు ఎజెన్సీలకు అప్పగించే యత్నాలు మానుకోవాలని డిమాండ్ చేశారు.
పేదలకు పౌష్టికాహారంతో పాటు ఆట, పాటలతో కూడిన విద్యను అందిస్తున్న అంగన్‌వాడీ కేంద్రాలను నిర్వీర్యం చేసే చర్యలను తాము ఒప్పుకోమని, అవసరమైతే ఆందోళనలు మరింత ఉద్ధృతం చేస్తామని అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాల సంఘం జిల్లా కార్యదర్శి సునీత స్పష్టం చేశారు.
ధర్నాకు ఆయా మండలాల నుంచి అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలు భారీగా తరలివచ్చారు. వారికి సీఐటీయూ నాయకులు రాజేందర్, లింగాల చిన్నన్న సంఘీభావం ప్రకటించారు. మొదట సుందరయ్యభవన్ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ చేపట్టారు.
ఇదీ చదవండి: అంగన్‌వాడీ కేంద్రం నిర్మాణానికి 'ప్లాస్టిక్ ఇటుకలు'