Ant Nests in Nirmal: చెట్లమీద గూళ్లు అనగానే ఏవో పక్షులు అల్లి ఉంటాయని భావిస్తాం. కానీ ఈ చీమలు ఆకులనే ఆవాసంగా చేసుకొని గూళ్లు కట్టుకుని అందరినీ ఆశ్చర్య చకితులను చేస్తున్నాయి. ఈ అబ్బురపరిచే దృశ్యాలు నిర్మల్ జిల్లాలో కనిపించాయి.
వర్షాలు, గాలులకు చెక్కుచెదరవు..
చీమలు పుట్టలు పెడతాయని అందరికీ తెలుసు. చెట్లపై నివసించే కోగుల రకం చీమలు (ఈకోపిలా జాతికి చెందినవి) మాత్రం గూళ్లు కట్టుకుంటాయి. ఇవి తాము విసర్జించే జిగట లాంటి రసాయనంతో ఆకులను దగ్గరగా చేర్చి అతికిస్తూ గూడుగా మలుస్తాయని నిర్మల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల జంతుశాస్త్ర అధ్యాపకుడు మహ్మద్ ఖలీమ్ తెలిపారు. ఆ గూళ్లు వర్షాలు, ఎండ, గాలులకు కూడా చెక్కుచెదరవని, వాటిలో రాణీ చీమలు నివాసం ఉండి.. సంతానాన్ని వృద్ధి చేస్తాయని ఆయన చెప్పారు. కూలీ చీమలు వాటికి కాపలా కాస్తాయని.. ఇవి తమ మనుగడ కోసం గూళ్లను ఏర్పాటు చేసుకుంటాయని వివరించారు.
ఇదీ చదవండి:Irani chai: నేటి నుంచి ‘ఇరానీ చాయ్’ ధర రూ.5 పెంపు..