ETV Bharat / business

ఫ్రెషర్స్​కు విప్రో షాక్.. ఆఫర్​ లెటర్​లోని జీతం లెక్కల్లో మార్పు.. నచ్చితేనే చేరండని మెయిల్​ - విప్రో లేటెస్ట్ న్యూస్​

ఆర్థిక మాంద్యం భయాలతో కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తున్న క్రమంలో ప్రముఖ సాఫ్ట్​వేర్​ సంస్థ విప్రో కొత్తగా ఎంపికైన ఫ్రెషర్స్​కు షాక్ ఇచ్చింది. ఏడాదికి ఇస్తామన్న వేతనాన్ని రూ.6.5 లక్షల నుంచి రూ. 3.5 లక్షలకు తగ్గించింది. ఇందుకు అంగీకరిస్తే ఉద్యోగంలో చేరవచ్చని మెయిల్ చేసింది.

wipro salary cut for freshers
wipro salary cut for freshers
author img

By

Published : Feb 22, 2023, 2:30 PM IST

ఇటీవలే ఉద్యోగాలకు ఎంపికైన ఫ్రెషర్స్​కు ప్రముఖ సాఫ్ట్​​వేర్​ సంస్థ విప్రో షాక్ ఇచ్చింది. ఉద్యోగ ప్రకటనలో ఏడాదికి రూ. 6.5 లక్షల జీతంగా చెప్పిన సంస్థ.. దానిని రూ.3.5 లక్షలకు కుదించింది. ఆర్థిక మాంద్యం, డిమాండ్​ లేమి కారణాలతో వేతనాన్ని తగ్గించినట్లు.. ఉద్యోగులకు మెయిల్ పెట్టింది. ఈ వేతనానికి పనిచేసే ఆసక్తి ఉన్నవారు ఫిబ్రవరి 20 లోపే అంగీకరించాలని పేర్కొన్నట్లు ఆలస్యంగా తెలిసింది.

విప్రో సంస్థ ఉద్యోగులను నియమించుకునేందుకు ఎలీట్​, టర్బో అనే రెండు రకాల పరీక్షలను నిర్వహిస్తోంది. ఇందులో ఎలీట్​కు ఎంపికైన వారికి ఏడాదికి రూ. 3.5 లక్షలు.. టర్బోకు ఎంపికైన వారికి రూ. 6.5 లక్షలు వేతనంగా నిర్ణయించింది. ఇందులో భాగంగానే 2022లో ఈ పరీక్షను పూర్తి చేసిన వారిని విప్రో ఉద్యోగులుగా ఎంపిక చేసింది. కాగా వారికి నియామక పత్రాలు ఇవ్వకుండా గతేడాది ఆగస్టు నుంచి వాయిదా వేస్తూ వస్తోంది. తాజాగా తక్కువ వేతనానికి అంగీకరిస్తే ఉద్యోగంలో చేరవచ్చని మెయిల్ చేసింది.

మరో 2,000 మంది ఉద్యోగులు తొలగింపు
ఆర్థిక మాంద్యం భయాలతో కంపెనీల్లో ఉద్యోగుల తొలగింపుల పర్వం కొనసాగుతూనే ఉంది. తాజాగా కంపెనీలకు ఉద్యోగుల తొలగింపు ప్రణాళికను అందించే ప్రముఖ కన్సల్టెన్సీ సంస్థ మెకిన్సీ అండ్‌ కంపెనీ కూడా స్వయంగా తమ సిబ్బందిని తగ్గించుకునే యోచనలో ఉంది. దాదాపు 2,000 మంది ఉద్యోగులను తొలగించేందుకు మెకిన్సీ సిద్ధం అవుతున్నట్లు ఆ కంపెనీ వర్గాలు వెల్లడించాయి.

తమ క్లయింట్లతో నేరుగా సంబంధం ఉండని సహాయక సిబ్బందిని తొలగించే యోచనలో మెకిన్సీ ఉందని ఆ సంస్థ ఉన్నతోద్యోగులు తెలిపారు. గత దశాబ్ద కాలంలో కంపెనీలో ఉద్యోగుల సంఖ్య గణనీయంగా పెరిగిందని.. ఆర్థికంగా అనిశ్చితి కొనసాగుతున్న నేపథ్యంలో సిబ్బందిని పునర్‌ వ్యవస్థీకరించాలని మెకిన్సీ యోచిస్తున్నట్లు వివరించారు. వచ్చే 2-3 వారాల్లో తొలగింపుల ప్రణాళికను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. 2012లో మెకిన్సీలో 17,000 మంది ఉద్యోగులు ఉండగా.. ఇప్పుడు 45,000 పెరిగినట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి.

ఇవీ చదవండి : ఉద్యోగులకు TCS బంపర్​ ఆఫర్​.. తొలగించకుండా సూపర్​ ట్రైనింగ్​ ఇస్తుందట!

ట్విట్టర్​తో డబ్బు సంపాదించేందుకు రెండు ఈజీ మార్గాలు.. మస్క్ బంపర్ ఆఫర్!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.