ETV Bharat / business

What Is Top Up Health Insurance Policy : హెల్త్ ఇన్సూరెన్స్​ టాపప్‌తో మరింత ధీమా.. ఈ లాభాలు తెలుసా? - టాప్ అప్ హెల్త్ ఇన్సూరెన్స్ ఎలా పని చేస్తుంది

What Is Top Up Health Insurance Policy : మారుతున్న మనుషుల జీవనశైలితో తరచూ ఆరోగ్య సమస్యలు ఎదురవతున్నాయి. దీంతో ఆరోగ్య సంరక్షణ ఖర్చులు కూడా పెరిగిపోతున్నాయి. కారణంగా ఒకటే ఆరోగ్య బీమా పాలసీ సరిపోవట్లేదు. అలాగని ఒకటి కంటే ఎక్కువ ఆరోగ్య బీమా పాలసీలు తీసుకునేందుకు.. అందరికీ వీలుకాదు. ఇలాంటి సమయాల్లోనే టాపప్​ పాలసీలు ప్రయోజనకరంగా ఉంటాయి. ఇంతకీ ఏమిటీ టాపప్‌ పాలసీలు? వాటితో ప్రయోజనాలేంటి ఇప్పుడు తెలుసుకుందాం.

what-is-top-up-health-insurance-policy-and-top-up-health-insurance-benefit
టాప్ అప్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 29, 2023, 4:38 PM IST

What Is Top Up Health Insurance Policy : ఆరోగ్య సంరక్షణ ఖర్చులు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. కుటుంబంలో ఒక్కరు అనారోగ్యం పాలైనా.. ఆర్థిక లక్ష్యాలన్నీ తారుమారైపోతున్నాయి. ఈ తరుణంలోనే ఆరోగ్య బీమా తప్పనిసరి అవసరంగా మారింది. ఇది వైద్య అవసరాలకు ఆర్థికంగా అండగా నిలుస్తుంది. చాలామంది ఒకటే పాలసీ తీసుకొని, తమకు తగినంత రక్షణ ఉందని భావిస్తుంటారు. మరోవైపు అధిక ప్రీమియాలూ పాలసీదారులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ఇలాంటి సమయాల్లోనే ప్రాథమిక ఆరోగ్య బీమాకు టాపప్‌ చేయించుకోవడం మంచిది.

ఉదాహరణకు.. సంజయ్‌ అనే వ్యక్తి.. కుటుంబం మొత్తానికీ వర్తించేలా 5 లక్షల రూపాయల ఆరోగ్య బీమా పాలసీని తీసుకున్నారు. ఇది తన కుటుంబ ఆరోగ్య బీమాకు సరిపోతుందనే నమ్మకంతోనే ఉన్నారు. సంజయ్‌ అనుకోకుండా ఆస్పత్రిలో చేరాల్సి వచ్చింది. చికిత్స కోసం 9 లక్షల రూపాయల వరకు ఖర్చయ్యింది. రూ.5లక్షలు ఆరోగ్య బీమా చెల్లించగా.. మిగతా నాలుగు లక్షల రూపాయలు జేబు నుంచి చెల్లించాల్సి వచ్చింది. పిల్లల ఉన్నత చదువుల కోసం దాచిన సొమ్మునంతా అతడి ఆస్పత్రి ఖర్చుల కోసం ఉపయోగించారు.

ముందుగానే ఆరోగ్య అత్యవసర పరిస్థితిని ఎవరూ ఊహించలేరు. ఖర్చు ఎంతవుతుందన్నదీ అంచనా వేయలేరు. కాబట్టి, వీలైనంత అధిక మొత్తానికి సెక్యూరిటీ ఉండటమే ఎప్పుడూ దీనికి పరిష్కారం. అలా అని పెద్ద మొత్తంలో బీమా పాలసీ తీసుకుంటే ప్రీమియం భారంగా మారే అవకాశం ఉంది. ఇటువంటి సమయంలోనే టాపప్‌ ప్లాన్‌లు అవసరం అవుతాయి.

ఏమిటి టాపప్‌ ప్లాన్లు?
ప్రాథమిక ఆరోగ్య బీమా పాలసీకి అదనంగా కొనుగోలు చేసేందుకు వీలున్న ఒక అనుబంధ పాలసీలను టాపప్‌ ప్లాన్లుగా చెప్పొచ్చు. ప్రాథమిక పాలసీ ఖర్చయిన తర్వాతే.. ఈ టాపప్‌ పాలసీలు మిగిలిన మొత్తాన్ని భరిస్తాయి.

ఉదాహరణకు సంజయ్‌నే తీసుకుంటే.. అతడికి రూ.5లక్షల ప్రాథమిక పాలసీ.. మరో రూ.5 లక్షల టాపప్‌ పాలసీ ఉందనుకుందాం. మొదటగా ప్రాథమిక పాలసీ రూ.5లక్షలు ఆసుపత్రి బిల్లు చెల్లిస్తుంది. ఆ తర్వాత మిగిలిన నాలుగు లక్షల రూపాయలను టాపప్‌ పాలసీ ఇస్తుంది. టాపప్‌ తీసుకునే సమయంలోనే.. ఎంత మొత్తం తర్వాత వర్తించాలన్నది ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. సాధారణ ఆరోగ్య బీమా పాలసీలతో పోలిస్తే టాపప్‌లకు తక్కువ ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. ఒకే సంస్థ నుంచి ఆరోగ్య బీమా పాలసీని, దాంతోపాటు టాపప్‌ పాలసీని తీసుకోవచ్చు. లేదా రెండు పాలసీల కోసం వేర్వేరు బీమా సంస్థలనూ ఎంపిక చేసుకోవచ్చు.

ఎలా పని చేస్తాయి?
How Does Top Up Health Insurance Work : నిర్ణీత పరిమితికి మించి వైద్య ఖర్చులు అయినప్పుడే ఆ బిల్లులను టాపప్‌ పాలసీలు భరిస్తాయి. ఉదాహరణకు రూ.5లక్షల తర్వాతే టాపప్‌ పాలసీ వర్తించేలా తీసుకోవచ్చు. లేదా రూ.10లక్షల ఖర్చు తర్వాత వర్తించేలానూ ఎంపిక చేసుకోవచ్చు. ఆస్పత్రి బిల్లులు ఈ పరిమితికి మించినప్పుడు మాత్రమే టాపప్‌ ప్లాన్‌ వైద్య ఖర్చులను తిరిగి చెల్లిస్తుంది.

ఎంత మేరకు..
Insurance Top Up Plan : టాపప్‌ ప్లాన్లను రూ.50వేల నుంచి రూ.15 లక్షల వరకు తీసుకునే అవకాశం ఉంది. రూ.30వేల నుంచి రూ.5లక్షల వరకు పరిమితి దాటిన అనంతరం టాపప్​ ప్లాన్ వర్తించేలా ఎంచుకోవచ్చు. బీమా సంస్థలను బట్టి ఈ మొత్తాలు మారేందుకు అవకాశం ఉంటుంది. సాధారణ బీమా పాలసీతో పోలిస్తే టాపప్‌ ప్రీమియం చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి, ప్రీమియానికి చెల్లించే మొత్తం ఆదా చేసుకునే అవకాశం ఉంది. రూ.5 లక్షల మినహాయింపుతో రూ.10 లక్షల టాపప్‌ పాలసీని తీసుకోవడం ఇప్పుడున్న పరిస్థితుల్లో టాలా అవసరం. దీనికి బీమా సంస్థలను బట్టి, 5వేల వరకు ప్రీమియం ఉండే అవకాశం ఉంది. పూర్తి వివరాలకు బీమా సంస్థలను సంప్రదించండి.

లాభాలేమిటి?
Top Up Health Insurance Benefits : టాపప్‌ ప్లాన్లను తీసుకునేందుకు ప్రత్యేకంగా వైద్య పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉండదు. ఆరోగ్య బీమా పాలసీ ఉన్న సంస్థ నుంచి లేదా, ఇతర సంస్థ నుంచి తీసుకున్నా ఇబ్బందేమీ కాదు. టాపప్‌ పాలసీలు ఆసుపత్రిలో అయిన ఖర్చులతోపాటు, అంబులెన్స్‌, అవయవ దాత ఖర్చులు, రెండో వైద్య అభిప్రాయం తదితర ఖర్చులకు కూడా వర్తిస్తుంది.
ప్రాథమిక ఆరోగ్య పాలసీ మొత్తం పూర్తయిన సమయంలో టాపప్‌ ప్లాన్‌లు అదనపు రక్షణను అందిస్తాయి. ప్రాథమిక ఆరోగ్య పాలసీని తీసుకున్న తర్వాత, మీ అవసరాన్ని బట్టి టాపప్‌ పాలసీని ఎంపిక చేసుకోవడం ఎప్పుడూ శ్రేయస్కరం.

How To Add Nominee To EPF Account Online : ఈపీఎఫ్ ఖాతాకు నామినీని యాడ్​ చేయాలా?.. ఈ సింపుల్ స్టెప్స్​ ఫాలో అవ్వండి!

How to Change Name in LIC Policy : మీకు ఎల్​ఐసీలో పాలసీ ఉందా?.. అయితే మీరు ఈ విషయం తెలుసుకోవాల్సిందే.!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.