ETV Bharat / business

హెల్త్ ఇన్సూరెన్స్​లో "నో క్లెయిమ్ బోనస్" గురించి తెలుసా? - లేదంటే మీకు చాలా నష్టం!

author img

By ETV Bharat Telugu Team

Published : Jan 7, 2024, 10:28 AM IST

Health Insurance No Claim Bonus : మీకు ఏదైనా బీమా సంస్థలో హెల్త్ ఇన్సూరెన్స్ ఉందా? సదరు బీమా సంస్థ అందించే "నో క్లెయిమ్ బోనస్" గురించి మీకు తెలుసా? చాలా మందికి దీని గురించి తెలియక ఆర్థికంగా నష్టపోతుంటారు. మరి.. ఏంటీ "నో క్లెయిమ్ బోనస్"? దాని ద్వారా ఎలాంటి బెనిఫిట్స్ పొందవచ్చు? అనే వివరాలు ఇప్పుడు చూద్దాం.

Health Insurance No Claim Bonus
Health Insurance No Claim Bonus

Health Insurance No Claim Bonus Benefits : సాధారణంగా ఆరోగ్య బీమా పాలసీని క్లెయిమ్ చేసుకున్నప్పుడు.. సదరు బీమా సంస్థ వైద్య ఖర్చులు చెల్లిస్తుంది. అయితే.. క్లెయిమ్ చేసుకోనప్పుడు సదరు బీమా సంస్థ 'నో క్లెయిమ్ బోనస్' రూపంలో కొన్ని ప్రయోజనాలు అందిస్తుంది! హెల్త్ ఇన్సూరెన్స్(Health Insurance)​లో పేర్కొన్న నిర్దిష్ట నిబంధనలు, షరతుల ఆధారంగా నో క్లెయిమ్ బోనస్ (ఎన్​సీబీ) అందుతుంది. అవేంటి? అన్నది ఇప్పుడు చూద్దాం.

ఎన్​సీబీ పొందేందుకు ప్రధాన నిబంధన ఏమిటంటే.. గత ఏడాది పాలసీని వినియోగించుకోకపోతేనే ఈ బెనిఫిట్ లభిస్తుంది. పాలసీదారు హెల్దీగా ఉండి ఆసుపత్రికి వెళ్లకుండా ఉన్నందుకు.. క్లెయిమ్​ ద్వారా బీమా సంస్థ డబ్బు ఖర్చు చేయించకుండా ఉన్నందుకు రివార్డ్ అన్నమాట!

నో క్లెయిమ్ బోనస్ రకాలు : నో క్లెయిమ్ బోనస్ అందించడం ఆరోగ్య బీమా రంగంలో సర్వసాధారణం. ప్రైవేట్ రంగ, ప్రభుత్వ రంగ బీమా కంపెనీలు అర్హత కలిగిన పాలసీదారులకు NCBని అందిస్తాయి. అయితే ఈ ఎన్​సీబీలు రెండు రకాలు..

ప్రీమియంపై డిస్కౌంట్‌ : ఈ రకమైన నో క్లెయిమ్ బోనస్ పాలసీ రెన్యూవల్ సమయంలో చెల్లించవలసిన బీమా సంస్థలు ప్రీమియంపై తగ్గింపును అందిస్తాయి. కవరేజీలో మాత్రం ఎటువంటి మార్పూ ఉండదు. ఉదాహరణకు మీరు రూ. 5,00,000 బీమా పాలసీని కలిగి ఉన్నారనుకుందాం. గతేడాది మీరు క్లెయిమ్ చేయనందుకుగానూ మీరు చెల్లించాల్సిన ప్రీమియంలో 10% డిస్కౌంట్ ఆఫర్​ ను బీమా కంపెనీ అందించింది అనుకుందాం. అప్పుడు మీరు చెల్లించే వార్షిక ప్రీమియం రూ.10,000 అయితే.. 10% డిస్కౌంట్ పొందారు కాబట్టి.. ఈ ఏడాది రూ. 9,000 చెల్లిస్తే సరిపోతుంది.

కుమ్యులేటీవ్ బోన‌స్‌ : ఈ రకమైన నో క్లెయిమ్ బోనస్ కింద ప్రీమియం తగ్గింపు ఆఫర్ ఉండదు. బీమా క్లెయిమ్ కెపాసిటీ పెరుగుతుంది. ఉదాహ‌ర‌ణ‌కు.. మీకు 10 శాతం నో-క్లెయిమ్ బోన‌స్ వచ్చిందనుకుందాం. మీ పాలసీ వార్షిక ప్రీమియం రూ.10 వేలు, క‌వ‌రేజీ రూ.5 ల‌క్ష‌లుగా ఉందనుకుందాం. మీరు గతేడాది పాల‌సీ క్లెయిమ్ చేయలేదు కాబట్టి బోన‌స్ కింద ఇచ్చే 10 శాతం క‌లిపి.. త‌ర్వాతి సంవ‌త్స‌రం క‌వ‌రేజీ 5ల‌క్ష‌ల 50వేల రూపాయలకు పెరుగుతుంది. రెండో ఏడాది కూడా క్లెయిమ్‌ చేసుకోకపోతే క‌వ‌రేజీ రూ.6 ల‌క్ష‌ల‌కు పెరుగుతుంది. ఇలా.. కవరేజీ పెరుగుతుంది. ప్రీమియంపై డిస్కౌంట్ ఉండదు.

బెస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్​ పాలసీ తీసుకోవాలా? ఈ సింపుల్ టిప్స్ పాటించండి!

ఎన్​సీబీ లక్షణాలు :

  • భారతీయ బీమా కంపెనీలు అందించే నో క్లెయిమ్ బోనస్ సగటున 5 నుంచి 20% మధ్యలో ఉంటుంది.
  • మీరు వేరే ఆరోగ్య బీమా కంపెనీకి మారాలనుకుంటే.. మీ అక్యుములేటెడ్ నో క్లెయిమ్ బోనస్ యాక్టివ్‌గా ఉంటుంది.
  • ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీ విషయంలో కుటుంబ సభ్యులెవరైనా బీమా మొత్తంలో క్లెయిమ్ బోనస్ మొత్తాన్ని పొందలేరు.

ఎన్​సీబీ ప్రయోజనాలు :

  • ఎన్​సీబీ ద్వారా కలిగే అతి ముఖ్యమైన ప్రయోజనం ఏమిటంటే.. ప్లాన్ రెన్యూవల్ టైమ్​లో ప్రీమియం తగ్గి డబ్బు ఆదా అవుతుంది.
  • లేదంటే.. బీమా కవరేజ్ పెరుగుతుంది. ఈ రెండు కూడా ఒక విధంగా పొదుపు మార్గాలుగా చెప్పుకోవచ్చు.

హెల్త్ ఇన్సూరెన్స్ పోర్టబిలిటీ - ఈ విషయాలు తెలుసా?

Family Floater Health Insurance Plan : ఈ హెల్త్ పాలసీ చూశారా..? పుట్టిన పిల్లలకు కవరేజీ నుంచి మరెన్నో బెనిఫిట్స్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.