Vi MiFi Wifi Plans : వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్న వారికి అతి తక్కువ ధరతో కూడిన వైఫై ప్లాన్స్‌ను అందిస్తోంది ప్రముఖ టెలికాం సంస్థ వొడాఫోన్-ఐడియా(Vi). వీఐ మైఫై(Vi MiFi) పేరుతో ఓ డివైజ్‌ను కూడా అందిస్తోంది. దీనితో మీకు సూపర్ ఫాస్ట్ ఇంటర్నెట్ సౌకర్యం లభిస్తుంది.
మైఫై డివైజ్
దేశంలోనే మూడో అతిపెద్ద టెలికాం ఆపరేటర్‌గా కొనసాగుతున్న వొడాఫోన్-ఐడియా Vi MiFi పేరుతో ఓ చక్కటి Wi-Fi డివైజ్‌ను మార్కెట్లోకి తెచ్చింది. ఇది పోర్టబుల్ వైఫై రూటర్‌లా పనిచేస్తుంది. దీనితో ఒకేసారి అనేక డివైజ్‌లకు కనెక్ట్ కావచ్చు. అంతేకాదు దీనితో మీ స్మార్ట్‌ఫోన్‌ను సులువుగా హాట్స్పాట్లా మార్చుకోవచ్చు. మీ ఫోన్ బ్యాటరీని వాడకుండా ఓ నిర్దష్టమైన వేగాన్ని అందించే ఈ డివైజ్ ఇంటి వద్దనే ఉంటూ పనిచేసే ఉద్యోగులకు ఎంతగానో ఉపయోగపడుతుంది. Vi MiFi డివైజ్ దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ఆన్లైన్ ప్లాట్‌ఫామ్‌లతో పాటు, వొడాఫోన్ ఐడియా రిటైల్ అవుట్లెట్లలో కూడా అందుబాటులో ఉంటుంది.
Vi MiFi డివైజ్ ప్లాన్ల వివరాలు
Vi MiFi Plans and Features :
- రూ.399- ప్రతినెల 50GB డేటా
- రూ.499- ప్రతినెల 90GB డేటా
- రెండు ప్లాన్స్ ద్వారా మొత్తం 200GB వరకు డేటా రోల్‌ఓవర్‌ను పొందవచ్చు
- ప్లాన్ లిమిట్ కంటే ఎక్కువ GB లేదా డేటా వాడితే, ఒక్కో జీబీకి అదనంగా రూ.20 చెల్లించాల్సి ఉంటుంది.
Vi MiFi ఫీచర్స్
- ఒకేసారి 10 డివైజ్‌లను కనెక్ట్ చేసుకోవచ్చు
- 6 గంటల బ్యాటరీ లైఫ్. అయితే ఈ బ్యాటరీ లైఫ్ అనేది మీ వాడకంపైనా ఆధారపడి ఉంటుంది.
- 150 Mbps సూపర్ ఫాస్ట్ స్పీడ్‌తో ఇంటర్నెట్ ఫెసిలిటీ
ఈ నెలవారీ ప్లాన్స్ మాత్రమే కాకుండా, మరో రెండు రకాల డేటా ప్యాక్స్ కూడా ఉన్నాయి. అవి:
- రూ.100 ప్లాన్ - 20 GB డేటా
- రూ.200 ప్లాన్ - 50 GB డేటా
నోట్ : ఈ Vi MiFi రూటర్ కావాలంటే రూ.2000ను చెల్లించాల్సి ఉంటుంది.
ఓటీటీ లవర్స్ కోసం స్పెషల్ ప్లాన్
వొడాఫోన్ ఐడియా ఓటీటీ లవర్స్ కోసం ప్రత్యేకంగా రూ.202 ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్ ద్వారా వినియోగదారులు 13+ ఓటీటీ ఛానల్స్ చూడవచ్చు. వీఐ కస్టమర్లకు మాత్రమే ఈ ప్లాన్ ప్రయోజనాలు అందుతాయి. ఈ ప్లాన్ ద్వారా సర్వీస్ వ్యాలిడిటీ, వాయిస్ కాలింగ్, డేటా లాంటివి లభించవు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ కేవలం ఒక నెల మాత్రమే.
మొబైల్ యాప్‌లో వీఐ 'వీ మూవీస్ అండ్ టీవీ ప్రో' సబ్స్క్రిప్షన్ నెలపాటు ఉంటుంది. ఎలాంటి అదనపు ఖర్చులు లేకుండా 13 ఓటీటీ ఛానల్స్ కంటెంట్‌ను అస్వాదించవచ్చు. ఈ రూ.202 ప్లాన్ కొనుగోలు చేసిన వినియోగదారులు సోనీలివ్, జీ5, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్, సన్NXT, హంగామా లాంటి 13 ఓటీటీ ఛానల్స్ కంటెంట్‌ను చూడవచ్చు.
జియో న్యూ ఇయర్ ఆఫర్ - ఆ ప్లాన్‌పై ఏకంగా 24 డేస్ ఎక్స్ట్రా వ్యాలిడిటీ!
పొరపాటున మీ అకౌంట్లోకి డబ్బులు క్రెడిట్ అయ్యాయా? ఈ విషయాలు తెలుసుకోవడం మస్ట్