ETV Bharat / business

ట్రెండింగ్​లో ఉన్న టాప్​ 5 స్కూటీస్ ఇవే - ఈ పండక్కి ఒకటి తెచ్చేయండి! - బెస్ట్ 5 స్కూటీస్

Best 125cc Scooters 2023 : ఈ దివాళీకి కొత్త స్కూటీ కొనాలని అనుకుంటున్నారా? అయితే.. ఇది మీకోసమే. ప్రస్తుతం మార్కెట్​లో ఉన్న 5 బెస్ట్ 125సీసీ పవర్ ప్యాక్ స్కూటీలను మీకు పరిచయం చేస్తున్నాం. మరి.. వాటిపై ఓ లుక్కేయండి.

Best 125cc Scooters 2023
Best 125cc Scooters 2023
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 4, 2023, 10:53 AM IST

Top 5 Power Pack 125cc Scooters 2023 : ప్రస్తుతం దేశంలో స్కూటీలకు మంచి ఆదరణ లభిస్తోంది. గేర్ సిస్టమ్ లేని ద్విచక్రవాహనాలను.. మహిళలు, పురుషులు అనే తేడా లేకుండా.. అందరూ ఇష్టపడుతున్నారు. దీంతో.. ఇండియన్ టూవీలర్ మార్కెట్​లో స్కూటీలకు డిమాండ్ ఏర్పడుతోంది. ముఖ్యంగా చాలా మంది 125సీసీ బైక్​లను తీసుకొవడానికి ఆసక్తి చూపుతున్నారట. ఇలాంటి ఓ స్కూటీని మీరు తీసుకోవాలనుకుంటే.. ట్రెండింగ్​లో ఉన్న టాప్ 5 స్టైలిష్ 125సీసీ పవర్ ప్యాక్​ స్కూటర్​లను మీకు పరిచయం చేస్తున్నాం. వాటిపై ఓ లుక్కేయండి.

TVS Ntorq 125(టీవీఎస్ ఎన్​టార్క్ 125) : దివాళీ సేల్​లో భాగంగా కొత్త స్కూటర్ కొనాలనుకునే వారికి 'టీవీఎస్ మోటార్' కంపెనీకి చెందిన Ntorq 125 ఉత్తమ ఎంపిక. దిల్లీ ఎక్స్ షోరూం వద్ద టీవీఎస్ ఎన్​టార్క్ 125 స్కూటర్ బేస్ మోడల్ ధర రూ. 85,000గా ఉండగా.. టాప్ వేరియంట్ ధర రూ. 1.05 లక్షలుగా ఉంది. మంచి స్టైలిష్ డిజైన్​తో లేటెస్ట్ ఫీచర్స్ కలిగిన ఈ స్కూటర్​ను 125సీసీ ఇంజిన్​తో రూపొందించారు. ఇది 10.6 Nm పీక్ టార్క్‌తో 9.25 bhp శక్తిని ఉత్పత్తి చేస్తుంది. 0-60 kmph నుంచి 8.9 సెకన్లలో వేగవంతం అవుతుంది. దీని గరిష్ఠ వేగం 95 kmph. అలాగే ఈ స్కూటర్ ఇన్‌కమింగ్ కాల్, SMS అలర్ట్‌లు, నావిగేషన్ సహాయం, ఫోన్ సిగ్నల్, బ్యాటరీ డిస్‌ప్లే, చివరిగా పార్క్ చేసిన ప్రదేశం లాంటి మొదలైన కనెక్ట్ చేయబడిన ఫీచర్‌లను కలిగి ఉంది. ఇది స్ట్రీట్, రేస్ అనే బహుళ రైడ్ మోడ్‌లతో కూడా వస్తుంది. ప్రస్తుతం టీవీఎస్ Ntorq ఆరు వేరియంట్లలో అందుబాటులో ఉంది.

Aprilia SR 125(ఏప్రిలియా SR 125) : 125సీసీ స్కూటీల్లో.. ఏప్రిలియా ఎస్​ఆర్ 125 కూడా బెస్ట్ ఆప్షనే. దీనిలో 125సీసీ సామర్థ్యం కలిగిన ఎయిర్ కూల్డ్ ఇంజిన్ ఉంది. ఈ స్కూటర్ 7300 ఆర్​పీఎమ్ వద్ద 9.97bhp పవర్, 5500 ఆర్​పీఎమ్ వద్ద 10.33Nm టార్క్​ను జనరేట్ చేస్తుంది. ఇది సింగిల్ వేరియంట్​లో నాలుగు రంగులలో అందుబాటులో ఉంది. ఈ స్కూటీ 220 mm ఫ్రంట్ డిస్క్ బ్రేక్, వెనుక 140 mm డ్రమ్ బ్రేక్‌తో వస్తుంది. ఇండియన్ మార్కెట్​లో ఉన్న అత్యంత ఖరీదైన స్కూటర్లలో ఏప్రిలియా SR 125 ఒకటని చెప్పుకోవచ్చు. ఎక్స్ షోరూమ్​ వద్ద దీని ధర రూ. 1.24 లక్షలతో ప్రారంభమవుతుంది.

Suzuki Avenis (సుజుకి అవెనిస్) : ప్రస్తుతం మార్కెట్లో ఉన్న మరో బెస్ట్ 125సీసీ స్కూటీ సుజుకి అవెనిస్. ఇది స్టాండర్డ్, రేస్ ఎడిషన్ అనే రెండు ట్రిమ్‌లలో అందుబాటులో ఉంది. దీనిలో బర్గ్‌మాన్ స్ట్రీట్‌, యాక్సెస్ 125 స్కూటీలలో అమర్చిన 124.3సీసీ, ఎయిర్​ కూల్డ్ ఇంజిన్​నే అమర్చారు. ఈ స్కూటర్ 6750ఆర్​పీఎమ్ వద్ద 8.58 bhp పవర్, 5500 ఆర్​పీఎమ్ వద్ద 10Nm టార్క్​ను ఉత్పత్తి చేస్తుంది. దిల్లీ ఎక్స్ షోరూమ్ దీని ధర రూ. 92,000 నుంచి ప్రారంభమవుతుంది. అలాగే ఇందులో USB పోర్ట్‌తో సహా కొన్ని ప్రాక్టికల్ ఫీచర్లు ఉన్నాయి.

Best Scooters Under 1 Lakh : అమ్మాయిలకు సూట్​ అయ్యే బెస్ట్​ స్కూటీస్​ ఇవే.. ధర రూ.1 లక్షలోపే.. ఫీచర్స్​ అదుర్స్​!

Hero Maestro Edge 125 (హీరో మాస్ట్రో ఎడ్జ్ 125) : Maestro Edge అనేది హీరో నుంచి ప్రీమియం 125cc స్కూటర్. ఇది 125cc ఇంజిన్‌తో వస్తుంది. ఈ ఇంజిన్ 9 bhp పవర్​ను,104 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ స్కూటర్ పూర్తి డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌తో పాటు, కనెక్ట్ చేయబడిన టెలిమాటిక్స్ సూట్‌తో వస్తుంది. టర్న్-బై-టర్న్ నావిగేషన్, లైవ్ ట్రాకింగ్, జియో-ఫెన్సింగ్, లొకేషన్ అలర్ట్‌లు, రైడింగ్ అనాలిసిస్ రిపోర్ట్‌ వంటి అనేక ఫీచర్లను ఇది అందిస్తుంది. Maestro Edge 125 స్కూటర్​.. Cast + Drum, Cast + Disc, Cast + Disc + Connected అనే మూడు వేరియంట్‌లలో ఉంది. ఇది మార్కెట్​లో రూ. 81,716 నుంచి రూ. 90,586 వరకు(ఎక్స్-షోరూమ్ ఢిల్లీ) అందుబాటులో ఉంది.

Honda Dio 125 (హోండా డియో 125) : యువతను లక్ష్యంగా చేసుకుని మార్కెట్లోకి విడుదల చేసిన డియో యాక్టివా 125 స్పోర్టీ లుక్ హోండా డియో 125. ఈ స్కూటర్‌లో 124సీసీ ఇంజన్ ఉంది. ఇది 8.1 bhp పవర్, 10.4 ఎన్ఎమ్ గరిష్ఠ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. అలాగే ఈ స్కూటీ ఐడ్లింగ్ స్టాప్ సిస్టమ్‌, స్మార్ట్ కీతో వస్తుంది. స్మార్ట్ కీతో స్కూటర్‌ను రిమోట్‌గా గుర్తించడం, దాన్ని అన్‌లాక్ చేయడం, స్టార్ట్ చేయడం వంటి ఫీచర్లను అందిస్తుంది. ఇవే కాకుండా డియో 125(Honda Dio) ఫ్రంట్ గ్లోవ్ బాక్స్, ఎక్స్‌టర్నల్ ఫ్యూయల్ లీడ్, ఇంటిగ్రేటెడ్ పాస్ స్విచ్ వంటి ప్రాక్టికల్ ఫీచర్‌లను కలిగి ఉంది. దీని ధర రూ. 83,400 నుంచి రూ. 91,300లుగా దిల్లీ ఎక్స్-షోరూమ్ వద్ద ఉంది.

Best 5 Bikes for College Students : కాలేజీ విద్యార్థుల కోసం.. అదిరిపోయే ఫీచర్లతో, తక్కువ ధరలో.. బెస్ట్ 5 బైక్స్.!

Top 5 Most Affordable Petrol Scooters : బెస్ట్​ ఫీచర్స్​తో.. స్కూటీ కొనాలనుకుంటున్నారా?.. అయితే వీటిపై ఓ లుక్కేయండి.!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.