ETV Bharat / business

'బీబీసీ లెక్కల్లో తేడాలు.. కీలక ఆధారాలు లభ్యం'.. ఐటీ శాఖ ప్రకటన

author img

By

Published : Feb 17, 2023, 6:17 PM IST

Updated : Feb 17, 2023, 9:00 PM IST

బీబీసీ వార్తా సంస్థ కార్యాలయాల్లో మూడు రోజుల తనిఖీల అనంతరం.. ప్రత్యక్ష పన్నుల కేంద్ర సంస్థ ఓ ప్రకటన విడుదల చేసింది. బీబీసీ చూపుతున్న ఆదాయం, లాభాల్లో తేడాలున్నాయని తెలిపింది. సంస్థలోని కీలక ఉద్యోగుల స్టేట్‌మెంట్‌లను రికార్డ్ చేసుకున్నామని వెల్లడించింది.

tax-raids-at-bbc-offices-in-india
బీబీసీ ఐటీ సోదాలు

బీబీసీ వార్తా సంస్థ చూపుతున్న ఆదాయం, లాభాల్లో తేడాలున్నాయని ప్రత్యక్ష పన్నుల కేంద్ర సంస్థ(సీబీడీటీ) తెలిపింది. ఆదాయపు పన్ను శాఖ, ఐటీ అధికారులు.. బీబీసీ ఉద్యోగులు ఇచ్చిన వివరాలు, డిజిటల్ అధారాలు, పత్రాల ద్వారా కీలకమైన ఆధారాలను వెలికితీశాయని పేర్కొంది. డాక్యుమెంటేషన్‌ బదిలీ ధరలకు సంబంధించి అనేక వ్యత్యాసాలు, అసమానతలు ఉన్నాయని వెల్లడించింది.

"ఆదాయ పన్ను చట్టం-1961, సెక్షన్​ 133ఏను అనుసరించి బీబీసీ కార్యాలయాలపై దాడులు జరిపాం. ఈ సెక్షన్​ ప్రకారం తమ పరిధిలో ఉన్న వ్యాపార, స్వచ్ఛంద సంస్థల కార్యాలయాల్లోకి వెళ్లే అధికారం మాకు ఉంటుంది. అందులో పుస్తకాలు, ఖాతాలు, డాక్యుమెంట్లు మేం పరిశీలించవచ్చు.

-- ఆదాయపు పన్ను శాఖ అధికారి

సంస్థలోని కీలక ఉద్యోగుల స్టేట్‌మెంట్‌లను రికార్డ్ చేసుకున్నామని ఆదాయ పన్ను అధికారులు తెలిపారు. ఫైనాన్స్, కంటెంట్ డెవలప్‌మెంట్, ఇతర ఉద్యోగుల స్టేట్​మెంట్లను కూడా రికార్డ్​ చేసినట్లు వెల్లడించారు. దీంతో ఈ విదేశీ సంస్థ.. భారతీయ సంస్థల నుంచి రీయింబర్స్​మెంట్​ పొందిదని అన్నారు.
అంతకుముందు దిల్లీ, ముంబయిలోని తమ ఆఫీసుల్లో ఆదాయ పన్ను అధికారులు తనిఖీలకు చేస్తున్నారని తెలిపిన బీబీసీ.. అందుకు పూర్తిగా సహరిస్తామని బుధవారం తెలిపింది. ఫిబ్రవరి 14 నుంచి దాదాపు 60 గంటలపాటు బీబీసీ కార్యాలయాల్లో సర్వే జరిపారు ఆదాయపు పన్ను శాఖ అధికారులు. ఎలక్ట్రానిక్‌ రూపంలో, దస్త్రాల్లో ఉన్న ఆర్థిక వ్యవహారాల సమాచారాన్ని సేకరించారు.

Last Updated : Feb 17, 2023, 9:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.