ETV Bharat / business

Tata Waiting Period October 2023 : టాటా కారు బుక్ చేశారా?.. డెలివరీకి ఇంకా ఎంత కాలం వెయిట్ చేయాలంటే.. - Tata Safari waiting period

Tata Waiting Period October 2023 : మీరు టాటా కార్లను బాగా ఇష్టపడతారా? కొత్తగా ఓ టాటా బ్రాండెడ్ కారు కొనాలని ఆశపడుతున్నారా? అయితే ఇది మీ కోసమే. ఈ ఆర్టికల్​లో టాటా కార్​ డెలివరీ - వెయిటింగ్ పీరియడ్ గురించిన వివరాలు ఉన్నాయి. వీటి ఆధారంగా కాస్త ముందుగానే.. మీకు నచ్చిన టాటా కారును బుక్​ చేసుకుంటే.. అనుకున్న సమయానికి డెలివరీ అవుతుంది. పూర్తి వివరాలు మీ కోసం.

Tata cars Waiting Period details
Tata Waiting Period October 2023
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 23, 2023, 1:32 PM IST

Tata Waiting Period October 2023 : దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్.. తమ కస్టమర్లకు సరికొత్త కార్లను అందించడంలో కాస్త జాప్యం చేస్తోంది. కరోనా సంక్షోభం తరువాత టాటా కంపెనీకి చెందిన గ్లోబల్ సప్లై చెయిన్​ బాగా దెబ్బతింది. దీనితో సకాలంలో కస్టమర్లకు కార్లను అందించడం కాస్త కష్టంగా మారింది. అయితే టాటా మోటార్స్ మాత్రం డిమాండ్​కు తగిన విధంగా తమ కార్ల ఉత్పత్తిని పెంచడానికి తీవ్రంగా కృషి చేస్తోంది.

వెయిట్ చేయాల్సిందే!
ప్రస్తుతం దేశంలో కార్లకు బాగా డిమాండ్ పెరుగుతోంది. అందుకే పలు ఆటోమొబైల్ కంపెనీలు తమ సరికొత్త కార్లను ఎప్పటికప్పుడు.. కస్టమర్లకు అందుబాటులోకి తెస్తున్నాయి. అయితే నమ్మకానికి, క్వాలిటీకి పెట్టింది పేరైన టాటా మోటార్స్ మాత్రం.. వినియోగదారులకు తమ కార్లను అందించడంలో కాస్త జాప్యం చేస్తోంది. సప్లై చెయిన్ దెబ్బతినడమే ఇందుకు కారణమని చెప్పకతప్పదు.

వెయిటింగ్ పీరియడ్ ఎంతంటే?

Tata Nexon : టాటా మోటార్స్ ఇటీవల విడుదల చేసిన టాటా నెక్సాన్​.. డెలివరీ కావాలంటే కనీసం 6-8 వారాలు పడుతుంది. అయితే నెక్సాన్ కారు​ వేరియంట్​, కలర్ ఛాయిస్​ను అనుసరించి ఈ వెయిటింగ్ పీరియడ్​ మారుతుంది.

Tata Nexon
టాటా నెక్సాన్​

Tata Punch CNG : టాటా పంచ్​ సీఎన్​జీని ఎవరైనా బుక్ చేసుకుంటే.. కారు డెలివరీ కావడానికి కనీసం 12 వారాల సమయం పడుతోంది. టాటా పోర్టిఫోలియోలో అత్యంత ఎక్కువ వెయిటింగ్ పీరియడ్ ఉన్న కారు ఇదే.

tata punch cng
టాటా పంచ్ సీఎన్​జీ
S.Noటాటా కార్ మోడల్​ వెయిటింగ్ పీరియడ్​
1నెక్సాన్ ఫేస్​లిఫ్ట్​ 6-8 వారాలు
2పంచ్ పెట్రోల్గరిష్ఠంగా 4 వారాలు
3పంచ్ సీఎన్​జీ12 వారాలు
4ఆల్ట్రోజ్​ సీఎన్​జీగరిష్ఠంగా 4 వారాలు
5ఆల్ట్రోజ్​ డీజిల్​గరిష్ఠంగా 6 వారాలు
6టియాగో పెట్రోల్గరిష్ఠంగా 4 వారాలు
7టియాగో సీఎన్​జీ గరిష్ఠంగా 8 వారాలు
8హారియర్ (ప్రీ-ఫేస్​లిఫ్ట్)4-6 వారాలు
9సఫారీ (ప్రీ-ఫేస్​లిఫ్ట్​)4-6 వారాలు

పై పట్టికను జాగ్రత్తగా పరిశీలించినట్లైతే.. ఆల్ట్రోజ్ సీఎన్​జీ, పంచ్ పెట్రోల్​, టియాగో పెట్రోల్​ కార్ల వెయిటింగ్ పీరియడ్ గరిష్ఠంగా 4 వారాలు ఉంటే.. టియాగో సీఎన్​జీ వెయిటింగ్ పీరియడ్ మాత్రం గరిష్ఠంగా 8 వారాలు ఉంది.

tata altroz cng
టాటా ఆల్ట్రోజ్​ సీఎన్​జీ
tata punch
టాటా పంచ్​
tata Tiago Petrol
టాటా టియాగో పెట్రోల్
tata Tiago CNG
టాటా టియాగో సీఎన్​జీ

ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. టాటా ఆల్ట్రోజ్​ పెట్రోల్, సీఎన్​జీ వేరియంట్ల కంటే.. ఆల్ట్రోజ్ డీజిల్ వేరియంట్ వెయిటింగ్ పీరియడ్ (6 వారాలు) ఎక్కువగా ఉంది. అందువల్ల మీరు అనుకున్న సమయానికి కారు డెలివరీ కావాలంటే.. కాస్త ముందుగానే టాటా కార్లను బుక్ చేసుకోవడం ఉత్తమం.

tata altroz cng
టాటా ఆల్ట్రోజ్​ సీఎన్​జీ
tata altroz diesel
టాటా ఆల్ట్రోజ్ డీజిల్​

నోట్​ : ఈ ఆర్టికల్​లో చెప్పిన వెయిటింగ్ పీరియడ్ వివరాలు కాస్త అటుఇటుగా ఉండవచ్చు. మీరు ఉంటున్న ప్రాంతం, మీరు ఎంచుకున్న వేరియంట్​, కలర్ ఛాయిస్​, స్టాక్ లభ్యత మొదలైన అంశాల ఆధారంగా.. కారు డెలివరీకి పట్టే సమయం మారుతూ ఉంటుంది. ఈ విషయాన్ని మీరు గమనించాలి.

tata Harrier
టాటా హారియర్​
tata safari
టాటా సఫారీ

Upcoming Cars In 2024 : అదిరిపోయే ఫీచర్స్​.. సూపర్ మైలేజ్​తో.. కొత్త ఏడాదిలో 24 నయా కార్స్​ లాంఛ్​!

Tata Safari Petrol Version : 'టాటా' కొత్త ప్లాన్​.. సఫారీ, హారియర్​లో 'పెట్రోల్'​ ఇంజిన్.. ధరలు తగ్గుతాయా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.