ETV Bharat / business

Tata Punch CNG : స్టన్నింగ్​ ఫీచర్లతో వచ్చిన టాటా పంచ్ సీఎన్​జీ​​​​.. ధర ఎంతంటే? - లేటెస్ట్ టాటా కార్స్​

Tata Punch CNG Launch : టాటా మోటార్స్ మరో సరికొత్త కారును భారతమార్కెట్లో విడుదల చేసింది. టాటా పంచ్​ సీఎన్​జీ పేరుతో తీసుకొచ్చిన ఈ కారులో అదిరిపోయే ఫీచర్స్ ఉన్నాయి. దీని పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Tata Punch CNG features
Tata Punch CNG
author img

By

Published : Aug 5, 2023, 1:08 PM IST

Tata Punch CNG Launch in India : ప్రముఖ ఆటోమొబైల్​ కంపెనీ టాటా మోటార్స్..​ శుక్రవారం తన మైక్రో ఎస్​యూవీ మోడల్​ 'పంచ్​ సీఎన్​జీ' (Tata Punch CNG) వేరియంట్​ను భారత మార్కెట్లో విడుదల చేసింది.

ఈ టాటా పంచ్​ సీఎన్​జీ.. ప్యూర్​, అడ్వెంచర్​, అడ్వెంచర్​ రిథమ్​, అకంప్లిష్డ్​, అకంప్లిష్డ్​ డాజిల్​ అనే 5 ట్రిమ్స్​ వేరియంట్లలో అందుబాటులో ఉంది. ALFA ఆర్కిటెక్చర్​ను ఆదర్శంగా తీసుకొని తయారు చేసిన టాటా పంచ్​ సీఎన్​జీకి.. 5 స్టార్​ గ్లోబల్​ ఎన్​సీఏపీ అడల్ట్​ సేఫ్టీ రేటింగ్​ కూడా వచ్చింది.

టాటా పంచ్​ స్పెసిఫికేషన్స్​
Tata Punch CNG Specifications : టాటా మోటార్స్​.. ఈ మైక్రో ఎస్​యూవీ కారులో ట్విన్​ సిలిండర్​ టెక్నాలజీని పొందుపరిచింది. దీనిలో ఫ్యూయెల్​ నింపే సమయంలో ఇంజిన్​ కటాఫ్​ అయ్యే విధంగా మైక్రో స్విచ్​ ఫెసిలిటీ కల్పించింది. దీనితోపాటు థర్మల్​ ఇన్సిడెంట్​ ప్రొటెక్షన్​ అందిస్తున్నారు. ఏదైనా అనుకోని ప్రమాదం సంభవించి గ్యాస్​ లీకైతే.. ఈ థర్మల్ ఇన్సిడెంట్​ ప్రొటెక్షన్..​ ఇంజిన్​కు సీఎన్​జీ సరఫరాను నిలిపివేస్తుంది. ఫలితంగా లీకైన గ్యాస్​ గాల్లోకి వెళ్లిపోతుంది. కనుక తీవ్రమైన అగ్ని ప్రమాదం సంభవించకుండా ఈ టెక్నాలజీ కాపాడుతుందని టాటా మోటార్స్ చెబుతోంది.

టాటా పంచ్​ ఫీచర్స్​
Tata Punch CNG Features : టాటా పంచ్​ సీఎన్​జీలో ఎలక్ట్రిక్​ సన్​ రూఫ్​ అందిస్తున్నారు. దీనిని వాయిస్​ కమాండ్​తో కంట్రోల్ చేయవచ్చు. ఈ కారులో 7 అంగుళాల ఇన్ఫోటైన్​మెంట్​ సిస్టమ్​, ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్​ కార్​ప్లే సపోర్ట్ ఉన్నాయి.

టాటా పంచ్​ సీఎన్​జీలో.. రైయిన్​ సెన్సింగ్​ వైపర్స్​, అడ్జెస్టబుల్​ డ్రైవర్​ సీట్​ ఉన్నాయి. అలాగే దీనిలో ఆటోమేటిక్​ ప్రొజెక్టర్​ హెడ్​ల్యాంప్స్​, ఎల్​ఈడీ డీఆర్​ఎల్స్​, 16 అంగుళాల డైమండ్​ కట్​ అల్లాయ్​ వీల్స్ కూడా ఉన్నాయి.

టాటా పంచ్​ ఇంజిన్​ స్పెక్స్​
Tata Punch CNG Engine Specs : టాటా పంచ్​లో 1.2 లీటర్​ రెవోట్రాన్​ పెట్రోల్ ఇంజిన్​ ఉంది. ఇది 72 బీహెచ్​పీ పవర్,​ 103 ఎన్​ఎం టార్క్​ను జనరేట్ చేస్తుంది.

టాటా పంచ్​ సీఎన్​జీ ధర
Tata Punch CNG Price : టాటా పంచ్​ సీఎన్​జీ ప్రారంభ ధర దిల్లీలో రూ.7.10 లక్షలుగా (ఎక్స్​షోరూం ధర) ఉంది. దీని హై-ఎండ్​ వేరియంట్​ ధర దిల్లీలో రూ.9.68 లక్షలు (ఎక్స్​షోరూం ధర)గా ఉంది.

టాటా.. మోడల్స్​!
Tata latest car models : టాటా పంచ్​లో తీసుకొచ్చిన ట్విన్ సిలిండర్​ టెక్నాలజీని.. టియాగో, టిగోర్ మోడల్​ కార్లలోనూ వినియోగించినట్లు టాటా మోటార్స్ తెలిపింది. టియాగో సీఎన్​జీ ధర రూ.6.55 లక్షల నుంచి రూ.8.1 లక్షలుగా ఉంది. టిగోర్​ సీఎన్​జీ ధర రూ.7.8 లక్షల నుంచి రూ.8.95 లక్షల మధ్య ఉంటుంది. వీటి వల్ల తమ కంపెనీ సీఎన్​జీ లైనప్​ మరింత బలోపేతం అవుతుందని టాటా కంపెనీ పాసింజర్​ వెహికల్​ మార్కెటింగ్ హెడ్​ వినయ్​పంత్ ఆశాభావం వ్యక్తం చేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.