ETV Bharat / business

వారాంతంలో దూసుకెళ్తున్న సూచీలు.. సెన్సెక్స్​ 1300 ప్లస్​ - sensex profits

stocks
స్టాక్​ మార్కెట్లు
author img

By

Published : May 20, 2022, 9:36 AM IST

Updated : May 20, 2022, 1:47 PM IST

13:30 May 20

గత రెండు రోజులుగా డీలా పడిన స్టాక్​మార్కెట్లు వారాంతంలో జోరును ప్రదర్శిస్తున్నాయి. 1000 పాయింట్ల లాభంతో ప్రారంభమైన సెన్సెక్స్​ ఇప్పుడు మరో 300 పాయింట్లు ఎగబాకింది. 1304 పాయింట్ల లాభంతో 54,096 వద్ద కొనసాగుతోంది. మరోవైపు నిఫ్టీ.. 392 పాయింట్ల లాభంతో 16,202కు చేరింది.

మెటల్​, ఫార్మా, పీఎస్​యూ బ్యాంక్​, రియల్​ ఎస్టేట్​ రంగాలకు చెందిన సూచీలు లాభాలను నమోదు చేయడం మార్కెట్​పై ప్రభావం చూపింది. ఈ సూచీల్లో 3 శాతం పెరుగుదల నమోదైంది. డాక్టర్​ రెడ్డీస్​, నెస్లే, టాటా మోటార్స్​ టాప్​ గెయినర్స్​గా ఉన్నాయి.

09:26 May 20

లాభాల్లో దూసుకెళ్తున్న స్టాక్​మార్కెట్లు

భారతీయ స్టాక్​మార్కెట్​ సూచీలు లాభాలతో ప్రారంభమయ్యాయి. గురువారం సెషన్​లో తీవ్ర నష్టాలను నమోదు చేసి 1400కుపైగా పాయింట్లను కోల్పోయిన సెన్సెక్స్​ శుక్రవారం సెషన్​లో తిరిగి పుంజుకుంది. 53,513తో ప్రారంభమైన సెన్సెక్స్ 1112​ పాయింట్లు పెరిగి 53,905కు చేరింది. మరోవైపు నిఫ్టీ కూడా లాభాలబాట పట్టింది. 347 పాయింట్లు పెరిగి 16,156 వద్ద కొనసాగుతోంది.

Last Updated : May 20, 2022, 1:47 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.