Stock Market Today : సోమవారం దేశీయ స్టాక్‌మార్కెట్లు సరికొత్త రికార్డ్ లాభాలతో ప్రారంభమయ్యాయి. బీఎస్ఈ మొదటిసారిగా 65,000 పాయింట్లు మార్కు దాటగా, ఎన్ఎస్ఈ కూడా ఆల్‌టైమ్ హై రికార్డు 19,318 పాయింట్లు నమోదు చేసింది. విదేశీ పెట్టుబడులు పెరుగుతుండడం సహా అంతర్జాతీయ మార్కెట్లు కూడా బుల్లిష్ ట్రెండ్‌లో కొనసాగుతుండడమే ఇందుకు కారణం.
బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 458 పాయింట్లు లాభపడి 65,176 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 126 పాయింట్లు వృద్ధి చెంది 19,315 పాయింట్లు వద్ద ట్రేడ్ అవుతోంది.
- లాభాల్లో కొనసాగుతున్న షేర్లు : హెచ్డీఎఫ్సీ, హెచ్డీఎఫ్సీ బ్యాంకు, టాటాస్టీల్, ఎన్టీపీసీ, ఐసీఐసీఐ బ్యాంకు, ఎస్బీఐ బ్యాంకు, రిలయన్స్
- నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్‌లు : పవర్‌గ్రిడ్, మారుతి సుజుకి, యాక్సిస్ బ్యాంకు, సన్‌ఫార్మా, టైటాన్, ఇన్ఫోసిస్
అంతర్జాతీయ మార్కెట్లు
Global Market Trends : శుక్రవారం యూఎస్ మార్కెట్లు మంచి లాభాలతో ముగిశాయి. సోమవారం సియోల్, టోక్యో, షాంగై, హాంగ్‌కాంగ్ మొదలైన ఆసియా మార్కెట్లు కూడా మంచి లాభాలతో ప్రారంభమయ్యాయి. ఇవన్నీ కూడా ఇండియన్ స్టాక్ మార్కెట్‌పై సానుకూల ప్రభావాన్ని చూపించాయి.
విదేశీ పెట్టుబడుల వెల్లువ
FIIs investment in India : భారతదేశంలోని విదేశీ పెట్టుబడుల వెల్లువ కొనసాగుతోంది. శుక్రవారం విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు రూ.6,397.13 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లు కొనుగోలు చేసినట్లు ఎక్స్ఛేంజ్ డేటా స్పష్టం చేస్తోంది. అదే విధంగా జూన్ నెలలో రూ.47,148 కోట్ల మేర ఇండియాలో ఫారిన్ పోర్టుఫోలియో ఇన్వెస్ట్మెంట్స్ జరిగాయి.
జీఎస్టీ కలెక్షన్లు
GST Collections in June 2023 : దేశంలో పరోక్ష పన్నుల విధానమైన జీఎస్టీ ప్రారంభించిన తరువాత టాక్స్ కలెక్షన్లు బాగా ఊపందుకున్నాయి. జూన్ నెలలో జీఎస్టీ కలెక్షన్లు 12 శాతం మేర వృద్ధి చెంది, మొత్తంగా రూ.1.61 లక్షల కోట్లకు చేరుకున్నాయని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇది కూడా మదుపర్ల సెంటిమెంట్‌ను బలపరిచింది. ఫలితంగా దేశీయ స్టాక్‌మార్కెట్లు గత నాలుగు రోజులుగా మంచి లాభాలతో దూసుకుపోతున్నాయి. ఇదే ట్రెండ్ సోమవారం కూడా కొనసాగుతోంది.
"యూఎస్ ఆర్థిక వ్యవస్థ ఎవరూ ఊహించని విధంగా పుంచుకుంది. మొదటి త్రైమాసికంలో యూఎస్ జీడీపీ వృద్ధి అంచనాలకు మించి రాణించింది. దీనితో త్వరలో అమెరికా ఆర్థిక మాంద్యంలోకి వెళ్తుందన్న అంచనాలు తప్పు అయ్యాయి. ఫలితంగా.. యూఎస్ ఫెడరల్ రిజర్వ్ 500 బీపీ రేటు పెంచినప్పటికీ.. దాని ప్రభావం స్టాక్ మార్కెట్లు మీద పడలేదు."
- వీకే విజయ్‌కుమార్, చీఫ్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజిస్ట్, జియోజిత్ ఫైనాన్సియల్ సర్వీసెస్