ETV Bharat / business

భారీ లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు - రాణించిన ఐటీ, మెటల్ షేర్స్​​ - asian market news

Stock Market Today January 17th 2024 : దేశీయ స్టాక్​ మార్కెట్లు శుక్రవారం భారీ లాభాలతో ముగిశాయి. ఐటీ, మెటల్​​, బ్యాంకింగ్ స్టాక్స్ రాణించడం, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు రావడమే ఇందుకు కారణం.

Share Market Today January 17th 2024
Stock Market Today January 17th 2024
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 19, 2024, 9:50 AM IST

Updated : Jan 19, 2024, 4:51 PM IST

3.36 PM : శుక్రవారం దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ముగిశాయి. దీనితో వరుస మూడు రోజుల నష్టాలకు బ్రేక్ పడింది. ఇవాళ బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్​ 496 పాయింట్లు లాభపడి 71,683 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 160 పాయింట్లు వృద్ధి చెంది 21,622 వద్ద ముగిసింది.

  • లాభపడిన స్టాక్స్ : భారతీ ఎయిర్​టెల్​, ఎన్​టీపీసీ, టెక్​ మహీంద్రా, టాటాస్టీల్​, టైటాన్, యాక్సిస్ బ్యాంక్​, ఎల్​ అండ్​ టీ, ఐటీసీ
  • నష్టపోయిన షేర్లు : ఇండస్​ఇండ్​ బ్యాంక్​, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​, కోటక్ బ్యాంక్​, ఎస్​బీఐ

గ్లోబల్ మార్కెట్లు
ఆసియా మార్కెట్లలో సియోల్​, టోక్యోలు లాభాలతో స్థిరపడ్డాయి. షాంఘై, హాంకాంగ్ నష్టాలతో ముగిశాయి. గురువారం యూఎస్ మార్కెట్లు లాభాలతో ముగిసిన విషయం తెలిసిందే.

ముడిచమురు ధర
అంతర్జాతీయ మార్కెట్​లో ముడిచమురు ధరలు 0.63 శాతం మేర పెరిగాయి. ప్రస్తుతం బ్యారెల్​ క్రూడ్​ ఆయిల్ ధర 79.60 డాలర్లుగా ఉంది.

1.15 PM : ప్రస్తుతం బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్​ 554 పాయింట్లు లాభపడి 71,741 వద్ద ట్రేడ్​ అవుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ ప్రస్తుతం 165 పాయింట్లు వృద్ధి చెంది 21,628 వద్ద కొనసాగుతోంది.

12.20 PM : ప్రస్తుతం బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్​ 432 పాయింట్లు లాభపడి 71,619 వద్ద ట్రేడ్​ అవుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ ప్రస్తుతం 122 పాయింట్లు వృద్ధి చెంది 21,585 వద్ద కొనసాగుతోంది.

Stock Market Today January 17th 2024 : వరుస మూడు రోజుల నష్టాల తరువాత, శుక్రవారం దేశీయ స్టాక్ మార్కెట్లు పుంజుకుని భారీ లాభాలతో దూసుకుపోతున్నాయి. ఐటీ, మెటల్​, బ్యాంకింగ్ స్టాక్స్ అన్నీ రాణిస్తుండడం, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు వస్తుండడమే ఇందుకు కారణం.

ప్రస్తుతం బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్​ 579 పాయింట్లు లాభపడి 71,766 వద్ద ట్రేడ్​ అవుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ ప్రస్తుతం 169 పాయింట్లు వృద్ధి చెంది 21,631 వద్ద కొనసాగుతోంది.

  • లాభాల్లో కొనసాగుతున్న స్టాక్స్​ : టైటాన్​, యాక్సిస్ బ్యాంక్​, ఎన్​టీపీసీ, టెక్ మహీంద్రా, ఐసీఐసీఐ బ్యాంక్​, భారతీ ఎయిర్​టెల్​, టీసీఎస్​
  • నష్టాల్లో ట్రేడవుతున్న షేర్స్​ : ఇండస్​ఇండ్​ బ్యాంక్​, రిలయన్స్​, పవర్​గ్రిడ్​, సన్​ఫార్మా, హిందూస్థాన్ యూనిలీవర్​, హెచ్​సీఎల్ టెక్​

అంతర్జాతీయ మార్కెట్లు
International Markets News : ఆసియా మార్కెట్లలో సియోల్​, టోక్యో లాభాలతో ట్రేడ్​ అవుతున్నాయి. మరోవైపు షాంఘై, హాంకాంగ్​లు నష్టాలతో కొనసాగుతున్నాయి. గురువారం యూఎస్ మార్కెట్లు మంచి లాభాలతో ముగిసిన విషయం తెలిసిందే.

విదేశీ పెట్టుబడులు
FIIs Investments In India : ఎక్స్ఛేంజీల డేటా ప్రకారం, విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు గురువారం రూ.9,901 కోట్ల విలువైన ఈక్విటీలను ఆఫ్​లోడ్ చేశారు.

నేడే త్రైమాసిక ఫలితాల వెల్లడి
ఈ రోజు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, హెచ్‌యూఎల్‌, అల్ట్రాటెక్‌, హిందుస్థాన్‌ జింక్‌, సెంట్రల్‌ బ్యాంక్‌, పేటీఎం, ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌ లాంటి ప్రముఖ సంస్థలు తమ త్రైమాసిక ఫలితాలను ప్రకటించనున్నాయి. అందుకే ఈ క్వార్టర్లీ రిజల్ట్స్​పై మదుపర్లు ప్రత్యేకంగా దృష్టిసారిస్తున్నారు.

రూపాయి విలువ
Rupee Open 19th January 2024 : అంతర్జాతీయ మార్కెట్​లో రూపాయి విలువ 2 పైసలు తగ్గింది. ప్రస్తుతం డాలర్​తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.83.15గా ఉంది.

ముడిచమురు ధర
Crude Oil Prices 19th January 2024 : అంతర్జాతీయ మార్కెట్​లో ముడిచమురు ధరలు 0.27 శాతం మేర తగ్గాయి. ప్రస్తుతం బ్యారెల్​ క్రూడ్​ ఆయిల్ ధర 78.89 డాలర్లుగా ఉంది.

బ్యాంకు రుణాలపై ఎన్నో ఛార్జీలు- ఏ లోన్​పై ఎంత వేస్తారో తెలుసా?

క్రమంగా దిగివస్తున్న బంగారం, వెండి ధరలు - ఏపీ, తెలంగాణాల్లో ఎంతంటే?

Last Updated : Jan 19, 2024, 4:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.