శుక్రవారం దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ముగిశాయి. ఆటో, టెక్, టెలికాం షేర్లు మంచి లాభాలను నమోదుచేశాయి. అంతర్జాతీయ మార్కెట్లు లాభాల్లో ట్రేడ్ కావడం, విదేశీ పెట్టుబడులు పెరగడం, దేశీయ వృద్ధి అంచనాలు ఆశాజనకంగా ఉండడం వల్ల.. దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా 11వ రోజు కూడా భారీ లాభాలను మూటగట్టుకున్నాయి.
బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 319 పాయింట్లు లాభపడి 67,838 వద్ద ముగిసింది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ ప్రస్తుతం 89 పాయింట్లు వృద్ధి చెంది 20,192 వద్ద స్థిరపడింది.
- లాభపడిన షేర్స్ : ఎం అండ్ ఎం, భారతీ ఎయిర్టెల్, టాటా మోటార్స్, టెక్ మహీంద్రా, హెచ్‌సీఎల్ టెక్, విప్రో, టీసీఎస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, మారుతి సుజుకి, ఇన్ఫోసిస్, రిలయన్స్
- నష్టపోయిన స్టాక్స్ : ఏసియన్ పెయింట్స్, బజాజ్ ఫిన్సెర్వ్, ఎన్టీపీసీ, ఐటీసీ, టైటాన్, కోటక్‌బ్యాంక్, పవర్‌గ్రిడ్, ఎల్ అండ్ టీ
ఆసియా మార్కెట్లు
ఆసియా మార్కెట్లలో సియోల్, టోక్యో, హాంకాంగ్ మార్కెట్లు మంచి లాభాలతో స్థిరపడ్డాయి. షాంఘై స్టాక్ మార్కెట్ మాత్రం నష్టాలతో ముగిసింది.
గ్లోబల్ మార్కెట్స్
ప్రస్తుతం యూరోపియన్ ఈక్విటీలు మంచి లాభాలతో ట్రేడవుతున్నాయి. యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ కీలక వడ్డీ రేట్ల పెంపును వాయిదా వేయడమే ఇందుకు కారణం. కాగా, గురువారం యూఎస్ మార్కెట్లు లాభాలతో ముగిసిన విషయం తెలిసిందే.