Stock Market Today 11th December 2023 : సోమవారం దేశీయ స్టాక్ మార్కెట్లు మంచి లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ మొదటిసారిగా 70,000 లెవెల్‌ను క్రాస్ చేసింది. నిఫ్టీ 21,019 పాయింట్లతో ఆల్ టైమ్ హై రికార్డ్‌ను నమోదు చేసింది. ఇంకా బుల్ రన్ కొనసాగుతూనే ఉంది.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కీలక వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచడం, ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి జీడీపీ వృద్ధి అంచనాలను 6.5 శాతం నుంచి 7 శాతానికి పెంచడం.. దేశీయ స్టాక్ మార్కెట్లకు మంచి ఊపునిచ్చింది.
బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ ప్రస్తుతం 161 పాయింట్లు లాభపడి 69,987 వద్ద ట్రేడ్ అవుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ ప్రస్తుతం 37 పాయింట్లు వృద్ధి చెంది 21,006 వద్ద కొనసాగుతోంది.
లాభాల్లో కొనసాగుతున్న స్టాక్స్ : హెచ్‌సీఎల్ టెక్, ఇండస్ఇండ్ బ్యాంక్, కోటక్ బ్యాంక్, టాటా మోటార్స్, ఎస్బీఐ, టీసీఎస్, ఐటీసీ
నష్టాల్లో ట్రేడవుతున్న షేర్స్ : ఏసియన్ పెయింట్స్, సన్‌ఫార్మా, యాక్సిస్ బ్యాంక్, విప్రో, మారుతి సుజుకి, ఐసీఐసీఐ బ్యాంక్
పెట్టుబడులు పెరుగుతున్నాయి!
భారతదేశంలో విదేశీ సంస్థాగత పెట్టుబడులతోపాటు, దేశీయ సంస్థాగత పెట్టుబడులు కూడా పెరుగుతున్నాయి. ఇది కూడా స్టాక్ మార్కెట్లపై మంచి సానుకూల ప్రభావం చూపుతోంది.
అంతర్జాతీయ మార్కెట్లు
శుక్రవారం యూఎస్, యూరోపియన్ మార్కెట్లు మంచి లాభాలతో ముగిశాయి. ప్రస్తుతం ఆసియా మార్కెట్లు మిక్స్డ్ ట్రెండ్‌లో నడుస్తున్నాయి. జపాన్ స్టాక్ మార్కెట్ నిక్కీ లాభాల్లో కొనసాగుతుండగా, హాంకాంగ్‌కు చెందిన హాంగ్ సెంగ్ భారీ నష్టాలతో ట్రేడవుతోంది. కోస్పీ, షాంఘై కాంపోజిట్ కూడా స్వల్ప నష్టాల్లోనే కొనసాగుతున్నాయి.
రూపాయి విలువ
Rupee Open 11th December 2023 : అంతర్జాతీయ మార్కెట్లో రూపాయి విలువ 1 పైసా పెరిగింది. ప్రస్తుతం డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.83.39గా ఉంది.
ముడిచమురు ధర
Crude Oil Prices 11th December 2023 : అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు 0.02 శాతం మేర పెరిగాయి. ప్రస్తుతం బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర 75.95 డాలర్లుగా ఉంది.
స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు - ఏపీ, తెలంగాణల్లో ఎంతంటే?
రూ.5,999కే ఇండిగో ఎయిర్‌లైన్స్ హాలీడే ప్యాకేజ్ - ఫారిన్ టూర్స్‌కు కూడా!