ETV Bharat / business

బుల్​ జోరు.. మార్కెట్లకు భారీ లాభాలు.. సెన్సెక్స్​ 934 ప్లస్​ - స్టాక్​ మార్కెట్ వార్తలు

స్టాక్​ మార్కెట్లు భారీ లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్​ 934 పాయింట్లు, నిఫ్టీ 289 పాయింట్లు వృద్ధి చెందాయి. అంతర్జాతీయంగా సానుకూల పరిస్థితులు, మదుపర్లు కొనుగోళ్లపై ఆసక్తి చూపడం మార్కెట్లను పాజిటివ్​గా ప్రభావితం చేసింది.

stock market news
స్టాక్ మార్కెట్​
author img

By

Published : Jun 21, 2022, 3:39 PM IST

Stock markets: స్టాక్ మార్కెట్లు మంగళవారం భారీ లాభాలను నమోదు చేశాయి. బొంబాయి స్టాక్ ఎక్ఛేంజీ- సెన్సెన్స్​ 934 పాయింట్లు వృద్ధి చెంది 52,532కి చేరింది. నేషనల్ స్టాక్ ఎక్ఛేంజీ- నిఫ్టీ 289 పాయింట్లు మెరుగుపడి 15,639 వద్ద స్థిరపడింది. అంతర్జాతీయంగా సానుకూల పరిస్థితులు, ఆసియా, ఐరోపా మార్కెట్లు లాభాల్లో ఉండటం దేశీయ మార్కెట్లను ప్రభావితం చేసింది. సోమవారం మార్కెట్లు కనిష్ఠాలను తాకడం వల్ల మదుపర్లు కొనుగోళ్లకు మొగ్గుచూపడం కూడా కలిసొచ్చింది. అలాగే అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు దిగివస్తుండటం, విశ్లేషకుల సానుకూల వ్యాఖ్యలు, మ్యూచువల్ ఫండ్​​ ఇన్వెస్టర్లు విదేశీ సంస్థల్లో పెట్టుబడులు పెట్టడాన్ని సెబీ పునరుద్ధరించడం వంటి కారణాలు మార్కెట్లలో జోష్ నింపాయి. దీంతో బుల్​ రంకెలేసి భారీ లాభాలను ఆర్జించింది. దాదాపు అన్ని రంగాల షేర్లు వృద్ధి నమోదు చేశాయి.

టైటాన్​, ఎస్​బీఐఎన్, టీసీఎస్, టాటా స్టీల్, విప్రో, హెచ్​సీఎల్​ టెక్ షేర్లు రెండున్నర శాతానికిపైగా లాభపడ్డాయి. భారతీ ఎయిర్​టెల్​, హెచ్​డీఎప్​సీ, ఎన్​టీపీసీ షేర్లు కూడా వృద్ధి చెందాయి.
నెస్లీ ఇండియా, అపోలో హాస్పిటల్స్ షేర్లు మాత్రం అతి స్వల్పంగా 0.25శాతం వరకు నష్టపోయాయి.

ఇదీ చదవండి: స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఏపీ, తెలంగాణాల్లో ఎంతంటే?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.