ETV Bharat / business

మార్కెట్లపై 'అమెరికా' దెబ్బ.. సెన్సెక్స్ 566 పాయింట్లు డౌన్ - ADB India Growth Rate

Stock Markets: అంతర్జాతీయ ప్రతికూలతలతో స్టాక్​ మార్కెట్లు బుధవారం నష్టాలను చవిచూశాయి. సెన్సెక్స్​ 566 పాయింట్లు కోల్పోగా.. నిఫ్టీ 150 పాయింట్లు క్షీణించింది. మరోవైపు 2022-23 ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థిక వ్యవస్థ 7.5శాతం వృద్ధి నమోదు చేయవచ్చని ఆసియా అభివృద్ధి బ్యాంకు అంచనా వేసింది.

Stock Market news
Stock Market news
author img

By

Published : Apr 6, 2022, 3:41 PM IST

Stock Market news: భారతీయ స్టాక్ మార్కెట్లు బుధవారం నష్టాలతో ముగిశాయి. అంతర్జాతీయ ప్రతికూలతల మధ్య బ్యాంకింగ్, ఆర్థిక రంగాల షేర్లు కుదేలవడం నష్టాలకు ప్రధాన కారణం. స్టాక్ మార్కెట్లు బుధవారం సాగిన తీరుపై మరిన్ని వివరాలు...

  • బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్ 566 పాయింట్లు కోల్పోయి 59,610 వద్ద స్థిరపడింది.
  • జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 150 పాయింట్లు క్షీణించి 17,808 వద్ద ముగిసింది.
  • హెచ్​డీఎఫ్​సీ ట్విన్స్​, కొటక్ మహీంద్రా బ్యాంక్, విప్రో, ఎం అండ్ ఎం, యాక్సిస్ బ్యాంక్ షేర్లు నష్టపోయాయి.
  • ఎన్​టీపీసీ, టాటా స్టీల్, ఎల్​ అండ్​ టీ, అల్ట్రా టెక్ సిమెంట్ షేర్లు లాభపడ్డాయి.
  • అంతర్జాతీయ మార్కెట్లు నష్టాలు చవిచూశాయి. రష్యాపై అమెరికా మరిన్ని ఆంక్షలు విధించడం, వడ్డీ రేట్లు పెంపు ఖాయమనేలా ఫెడరల్ రిజర్వ్ అధికారి ఒకరు చేసిన వ్యాఖ్యలు ఇందుకు కారణం.
  • లండన్, ఫ్రాంక్​ఫర్ట్ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. టోక్యో, హాంగ్​కాంగ్​ మార్కెట్లు నష్టాలు చవిచూశాయి. షాంఘై సూచీ ఫ్లాట్​గా ట్రేడయింది.
  • ముడి చమురు ధర బ్యారెల్​కు డాలరుపైగా పెరిగి 103.15 డాలర్లకు చేరింది.

భారత దేశ ప్రగతి పయనమిలా..: మరోవైపు.. 2022-23 ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థిక వ్యవస్థ 7.5శాతం వృద్ధి నమోదు చేయవచ్చని ఆసియా అభివృద్ధి బ్యాంకు(ఏడీబీ) అంచనా వేసింది. ఆ తర్వాత ఆర్థిక సంవత్సరానికి వృద్ధిరేటు 8శాతానికి చేరవచ్చని లెక్కగట్టింది. దక్షిణాసియా ఆర్థిక వ్యవస్థలన్నీ కలిసి 2022లో 7శాతం, 2023లో 7.4శాతం వృద్ధి సాధించవచ్చని అంచనా వేసింది ఏడీబీ.

ఇదీ చదవండి: స్వల్పంగా తగ్గిన బంగారం ధర.. ఏపీ, తెలంగాణలో ఎంతంటే?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.