ETV Bharat / business

వారాంతంలో భారీ నష్టాల నుంచి తేరుకొని.. చివరకు ఫ్లాట్​గా మార్కెట్లు

stock-market-live-updates
stock-market-live-updates
author img

By

Published : Jul 1, 2022, 9:59 AM IST

Updated : Jul 1, 2022, 3:40 PM IST

15:34 July 01

భారీ నష్టాల నుంచి కోలుకొని.. దేశీయ స్టాక్​ మార్కెట్​ సూచీలు వారాంతంలో ఫ్లాట్​గా ముగిశాయి. ఓ దశలో భారీ నష్టాల్లో కదలాడిన సెన్సెక్స్​, నిఫ్టీ చివరకు కోలుకున్నాయి. ఇంట్రాడేలో దాదాపు 1000 పాయింట్లు పడిపోయిన సెన్సెక్స్​ ఆఖర్లో.. మళ్లీ పాజిటివ్​లోకి వచ్చి చివరకు స్వల్ప నష్టాల్లో ముగిశాయి. బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్​ 111 పాయింట్లు కోల్పోయి.. 52 వేల 908 వద్ద సెషన్​ను ముగించింది. జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 28 పాయింట్ల నష్టంతో 15 వేల 752 వద్ద స్థిరపడింది. ఎఫ్​ఎంసీజీ, రియాల్టీ రంగం షేర్లు వృద్ధి చెందాయి. ఆయిల్​ అండ్​ గ్యాస్​ షేర్లు పతనమయ్యాయి.

ఐటీసీ, బజాజ్​ ఫినాన్స్​, బజాజ్​ ఫిన్​సర్వ్​, సిప్లా, బ్రిటానియా షేర్లు అధికంగా లాభపడ్డాయి. ఓఎన్​జీసీ, రిలయన్స్​, పవర్​గ్రిడ్​ కార్పొరేషన్​, బజాజ్​ ఆటో, భారతీ ఎయిర్​ టెల్​ ఎక్కువగా నష్టపోయాయి. ఓఎన్​జీసీ 13 శాతం, రిలయన్స్​ 7 శాతానికిపైగా పడిపోవడం గమనార్హం. పెట్రోల్, డీజిల్‌ ఎగుమతులపై ట్యాక్స్​ను పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఈ షేర్లు నష్టపోయాయి.

09:50 July 01

నష్టాల్లో స్టాక్​ మార్కెట్లు.. సెన్సెక్స్​ 600 పాయింట్లు డౌన్​

Stock Market Updates: దేశీయ స్టాక్‌ మార్కెట్లు శుక్రవారం భారీ నష్టాల్లో ట్రేడవుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల పవనాలతో దేశీయ సూచీలు భారీగా పతనమయ్యాయి. బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజీ.. సెన్సెక్స్‌ 695 పాయింట్లు నష్టపోయి 52 వేల 320 వద్ద కొనసాగుతోంది. నేషనల్​ స్టాక్​ ఎక్స్ఛేంజీ నిఫ్టీ 202 పాయింట్ల నష్టంతో 15 వేల 570 దగ్గర ట్రేడ్‌ అవుతోంది. టెక్‌ మహీంద్రా, టీసీఎస్‌, ఏషియన్‌ పెయింట్స్‌, విప్రో, ఇన్ఫీ, పవర్‌గ్రిడ్‌ షేర్లు లాభాల్లో ఉండగా.. నెస్లే ఇండియా, యాక్సిస్‌ బ్యాంక్‌, భారతీ ఎయిర్‌టెల్, టైటాన్, మారుతీ షేర్లు నష్టాల్లో ఉన్నాయి.

Last Updated : Jul 1, 2022, 3:40 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.