భారీ లాభాల్లో: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ముందుకు పయనిస్తున్నాయి. సెన్సెక్స్ ఏకంగా 950 పాయింట్లకుపైగా పెరిగి.. 52 వేల 560 ఎగువన కొనసాగుతోంది. నిఫ్టీ దాదాపు 300 పాయింట్ల లాభంతో.. 15 వేల 650 వద్ద ఉంది. లాభాలకు కారణాలను ఓసారి చూస్తే..
- అంతర్జాతీయ సానుకూలతలకు తోడు.. విశ్లేషకుల సానుకూల వ్యాఖ్యానాల నేపథ్యంలో మార్కెట్లు ఇటీవలి వరుస పతనాల నుంచి బయటపడుతున్నట్లు తెలుస్తోంది.
- కొద్ది రోజులుగా వరుస నష్టాల నేపథ్యంలో.. చాలా వరకు షేర్లు కనిష్ఠాలకు చేరాయి. తక్కువ ధరల వద్ద షేర్ల కొనుగోలుకు మదుపరులు మొగ్గుచూపుతున్నారు.
- ఆసియా, ఐరోపా మార్కెట్లు మంచి లాభాలను నమోదు చేయడం దేశీయ సూచీలపైనా ప్రభావం చూపిస్తోంది.
- ప్రపంచవ్యాప్తంగా క్రూడాయిల్ ధరలు కొద్దిరోజులుగా భారీగా తగ్గుతుండటం బుల్లిష్ మార్కెట్కు మరో ప్రధాన కారణమని వ్యాపార నిపుణులు విశ్లేషిస్తున్నారు.