ETV Bharat / business

హెచ్​డీఎఫ్​సీ డీల్​తో బుల్​ జోరు.. సెన్సెక్స్​ 1300 ప్లస్​ - సెన్సెక్స్​

stock market: దేశంలోని అతిపెద్ద హౌసింగ్​ ఫైనాన్స్​ కంపెనీ హెచ్​డీఎఫ్​సీ లిమిటెడ్​.. దేశంలోని మరో అతిపెద్ద ప్రైవేటు రంగ రుణదాత హెచ్​డీఎఫ్​సీ బ్యాంకుతో విలీనం ఒప్పందం మార్కెట్లలో జోష్​ నింపింది. ఆయా షేర్లు భారీగా పుంజుకోవటం సహా ఉక్రెయిన్​ రష్యా యుద్ధంలో సానుకూలతలతో సెన్సెక్స్​ మళ్లీ 60వేల మార్క్​ను అధిగమించింది. సెన్సెక్స్​ 1300లకుపైగా పాయింట్ల లాభంతో ముగిసింది.

stock market closing
స్టాక్​ మార్కెట్​
author img

By

Published : Apr 4, 2022, 3:50 PM IST

stock market: అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ పవనాలు ఉన్నప్పటికీ దేశీయ సూచీలు భారీ లాభాల్లో ముగిశాయి. రష్యా- ఉక్రెయిన్​ యుద్ధంలో సానుకూలత, హెచ్​డీఎఫ్​సీ, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​ విలీన ప్రకటన వెలువడటం వల్ల ఆయా షేర్లు దూసుకెళ్లటమూ కలిసొచ్చింది. ఈ నేపథ్యంలో మదుపరులు కొనుగోళ్లకు మొగ్గు చూపటం వల్ల తిరిగి 60వేల బెంచ్​ మార్క్​ను దాటింది సెన్సెక్స్​.

ముంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజీ సూచీ సెన్సెక్స్​.. 1335 పాయింట్ల వృద్ధితో 60,612 వద్ద స్థిరపడింది. 59,764 పాయింట్ల వద్ద ఈ వారం సెషన్​ను ప్రారంభించిన సెన్సెక్స్​ ఒక దశలో 60,845 పాయింట్ల గరిష్ఠాన్ని తాకింది. చివరకు 60,612 వద్ద ముగిసింది.

జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజీ సూచీ నిఫ్టీ... 383 పాయింట్ల లాభంతో 18,053 పాయింట్ల వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో 17,809 పాయింట్ల వద్ద ప్రారంభమైన సూచీ.. ఒక దశలో 18,115 పాయింట్ల గరిష్ఠాన్ని తాకింది. చివరకు 18,053 వద్ద స్థిరపడింది.

లాభనష్టాల్లోనివి: హెచ్​డీఎఫ్​సీ బ్యాంకు, హెడ్​డీఎఫ్​సీలు సుమారు 10 శాతం మేర లాభపడ్డాయి. అదానీ పోర్ట్స్​ 4శాతం, హెడ్​డీఎఫ్​సీ లైఫ్ 3.83శాతం, కొటక్​ మహీంద్రా బ్యాంకు 3.23 శాతం వృద్ధి చెందాయి. మరోవైపు.. ఇన్ఫోసిస్​ ఒక శాతానికిపైగా నష్టపోయింది. టైటాన్​ కంపెనీ, జెఎస్​ డబ్ల్యూ స్టీల్​లు నష్టాలను మూటగట్టుకున్నాయి. ​

ఇదీ చూడండి: హెచ్​డీఎఫ్​సీ ట్విన్స్ విలీనం.. దేశ కార్పొరేట్ చరిత్రలోనే అతిపెద్దది!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.