Stock Market Close Today 27th December 2023 : దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం భారీ లాభాలు సాధించి, ఆల్టైమ్ హై క్లోజింగ్ నమోదు చేశాయి. చరిత్రలో తొలిసారి బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 72,000 మార్కుకు ఎగువన ముగిసింది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 21,654 వద్ద స్థిరపడి సరికొత్త రికార్డు సృష్టించింది.
- బుధవారం బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 71,492 వద్ద మంచి లాభాలతో ప్రారంభమైంది. ఒకానొక దశలో 72,119 వద్ద జీవనకాల గరిష్ఠాలను తాకింది. చివరికి 72,038 వద్ద రికార్డు స్థాయి ముగింపును నమోదు చేసింది.
- జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ బుధవారం ఉదయం 21,497 వద్ద ప్రారంభమైంది. తరువాత 21,673 వద్ద జీవనకాల గరిష్ఠాలను నమోదు చేసింది. చివరికి 21,654 వద్ద ఆల్-టైమ్ హైరికార్డ్తో ముగిసింది.
అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు రావడం, దేశ స్థూల ఆర్థిక వృద్ధి అంచనాలు పెరగడం కూడా ఇందుకు కారణం. వీటితోపాటు మెటల్, కమోడిటీ, ఆటో, బ్యాంకింగ్ షేర్లు లాభాల పంట పండించడం వల్ల దేశీయ స్టాక్ మార్కెట్లు రికార్డు స్థాయి ముగింపును నమోదు చేశాయి.
- లాభపడిన షేర్లు : ఆల్ట్రాటెక్ సిమెంట్, జేఎస్డబ్ల్యూ సిమెంట్, టాటా మోటర్స్, భారతీ ఎయిర్టెల్, ఎల్ అండ్ టీ, ఎస్బీఐ, ఇన్ఫోసిస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్
- నష్టపోయిన షేర్లు : ఎన్టీపీసీ, టెక్ మహీంద్రా
ఆసియా, యూరోపియన్ మార్కెట్లు
Asian Stock Markets Today 27th December 2023 : బుధవారం సియోల్, టోక్యో, షాంఘై, హాంకాంగ్ మొదలైన ఆసియా మార్కెట్లు ఉన్న మంచి లాభాలతో ముగిశాయి. యూరోపియన్ మార్కెట్లు కూడా చాలా వరకు లాభాల్లోనూ కొనసాగుతున్నాయి.
శాంటా క్లాజ్ ర్యాలీ
US Stock Markets Today 27th December 2023 : మంగళవారం యూఎస్ మార్కెట్లు భారీ లాభాలతో ముగిశాయి. అంతర్జాతీయ ద్రవ్యోల్బణ అంచనాలు తగ్గుముఖం పట్టడం సహా యూఎస్ ఫెడరల్ రిజర్వ్ కీలక వడ్డీ రేట్లు తగ్గించవచ్చనే అంచనాలతో యూఎస్ మార్కెట్లలో శాంటా క్లాజ్ ర్యాలీ నడిచింది.
ముడి చమురు ధరలు
Crude Oil Prices Today 27th December 2023 : అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు 0.21 శాతం మేర తగ్గాయి. ప్రస్తుతం బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర 80.90 డాలర్లుగా ఉంది.
సెకండ్ హ్యాండ్ కారు కొనాలా? ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!
SBI కస్టమర్లకు గుడ్ న్యూస్ - 'అమృత్ కలశ్' గడువు పెంపు - ఎఫ్డీల వడ్డీ రేట్లు కూడా!