Have to pay Service Charge in Restaurants ? : మనం ఎక్కడైనా హోటల్స్, రెస్టారెంట్స్, బార్లకు వెళ్లినప్పుడు అక్కడ తిన్నందుకు, తాగినందుకు కాకుండా అదనంగా సర్వీస్ చేసినందుకు కొందరు సర్వీస్ ఛార్జ్ వసూలు చేస్తుంటారు. ఇదే విషయమై.. ఇటీవల ఉత్తరప్రదేశ్ నోయిడాలోని ఒక రెస్టారెంట్లో పెద్ద గొడవ జరిగిన సంగతి తెలిసిందే. దీంతో.. దేశవ్యాప్తంగా దీనిపై పెద్ద చర్చే నడిచింది. దాంతో.. రెస్టారెంట్లలో సర్వీస్ ఛార్జ్ కచ్చితంగా ఇవ్వాలా? చెల్లించకపోతే ఏమవుతుంది ? అనే సందేహం చాలా మందిలో వ్యక్తమైంది. దీనిపై స్పందించిన కేంద్రం క్లారిటీ ఇచ్చింది.
Restaurants Service Charge Issue : నొయిడా లొల్లి అనంతరం.. కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ రంగంలోకి దిగింది. సర్వీస్ అంశంపై క్లారిటీ ఇస్తూ.. ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది. దాని ప్రకారం.. సర్వీస్ ఛార్జీని చెల్లించాలని వినియోగదారుడిని రెస్టారెంట్లు బలవంతం చేయకూడదు. సర్వీస్ ఛార్జ్ చెల్లించాలా వద్దా? అనేది కస్టమర్ల ఇష్టానికి సంబంధించిన విషయమని స్పష్టం చేసింది.
Service Charge in Hotels : తమకు అందిన సేవలకు సంతృప్తి చెంది.. వినియోగదారులు నచ్చినంత సర్వీస్ ఛార్జ్ చెల్లించొచ్చు. లేదనుకుంటే.. చెల్లించాల్సిన అవసరం లేదు. అంతేకానీ.. సర్వీస్ ఛార్జ్ చెల్లించాలని వినియోగదారుడిని బలవంతపెట్టే అధికారం లేదని స్పష్టంగా పేర్కొంది. ఏప్రిల్ 12, 2023న దిల్లీ హైకోర్టు(Delhi High Court) కూడా ఇదే విషయాన్ని చెప్పింది.
ఇకపై మీరు సర్వీస్ ఛార్జ్ కట్టాల్సిన పనిలేదు : కేంద్ర ప్రభుత్వ వినియోగదారుల మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ ప్రకారం చూస్తే.. మీరు సర్వీస్ ఛార్జ్ చెల్లించకూడదని అనుకుంటే.. మీపై ఎలాంటి చర్యలూ ఉండవు. ఎలాంటి జరిమానా కూడా ఉండదు. ఎవరైనా సర్వీస్ ఛార్జీలు అడిగితే.. ఎన్సీహెచ్(నేషనల్ కన్జ్యూమర్ హెల్ప్‌లైన్)కు ఫిర్యాదు చేసే వెసులుబాటును కూడా వినియోగదారుల శాఖ కల్పించింది.
హోటల్స్, రెస్టారెంట్స్ సర్వీస్ ఛార్జ్ విధించడంపై బ్యాన్
What is Service Charge :
సర్వీస్ ఛార్జ్ అంటే ఏమిటి?
ఆర్డర్ చేసిన ఆహారం, పానీయాల ధరలకు వర్తించే పన్నులు రెస్టారెంట్ బిల్లులో ఎక్కువ భాగం ఉంటాయి. తినుబండారాల ద్వారా వీటికి అదనంగా 5-10% సేవా రుసుము బిల్లుకు జోడిస్తారు. వినియోగదారులు దీని గురించి ఆందోళనలు చేయడం ప్రారంభించడంతో సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (CCPA) రెస్టారెంట్లలో సేవా రుసుములకు వ్యతిరేకంగా మార్గదర్శకాలను జారీ చేసింది.
CCPA Guidelines on Service Charge :
సర్వీస్ ఛార్జీల కోసం కేంద్రం జారీ చేసిన మార్గదర్శకాలివే..
- హోటల్‌లు లేదా రెస్టారెంట్‌లలో ఆహార బిల్లుకు ఆటోమేటిక్ లేదా డిఫాల్ట్‌గా సర్వీస్ ఛార్జ్ యాడ్ చేయకూడదు.
- సేవా రుసుము వసూలు చేయడానికి వారు ఏ ఇతర పేరును ఉపయోగించరాదు.
- హోటళ్లు లేదా రెస్టారెంట్ల ద్వారా ఏ కస్టమర్ సర్వీస్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
- సర్వీస్ ఛార్జ్‌ను చెల్లించడం ఆప్షనల్ అని కస్టమర్ పూర్తిగా తెలుసుకోవాలి.
- వినియోగదారుడి నుంచి సేవా రుసుమును వసూలు చేయడానికి, దానిని ఆహార బిల్లుకు జోడించడానికి.. చివరి మొత్తానికి పన్నులను జోడించడానికి వారికి అనుమతి లేదు.
How to Complaint on Restaurants Service Charge in Telugu :
సర్వీస్ ఛార్జ్ చెల్లించమని రెస్టారెంట్ బలవంతం చేస్తే ఏమి చేయాలంటే..
- రెస్టారెంట్ లేదా హోటల్‌లో ఫైనల్ బిల్లు నుంచి సేవా రుసుమును తీసివేయమని మీరు అడగవచ్చు.
- నేషనల్ కన్స్యూమర్ హెల్ప్‌లైన్(NCH)తో రెస్టారెంట్‌పై ఫిర్యాదు చేయడానికి 1915కి కాల్ చేయండి లేదా NCH మొబైల్ యాప్‌ని ఉపయోగించవచ్చు.
- అటువంటి అన్యాయమైన ఉల్లంఘనలను నివేదించడానికి, వినియోగదారుల కమిషన్‌ను సంప్రదించవచ్చు.
- అదేవిధంగా సంబంధిత జిల్లా కలెక్టర్‌కు నేరపూరిత వ్యాపారంపై చర్య తీసుకోవాలని ఫిర్యాదు చేయవచ్చు.
- అలాగే మీరు com-ccpa@nic.inకి ఈ-మెయిల్ పంపడం ద్వారా నేరుగా CCPAకి ఫిర్యాదును సమర్పించవచ్చు.