ETV Bharat / business

Second Hand Bikes Purchase : సెకండ్​ హ్యాండ్ బైక్ కొంటున్నారా?.. అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!

Second Hand Bikes Purchase : కొత్త బైక్ కోసం వేలు, లక్షల రూపాయలు వెచ్చించలేని వారికి సెకండ్ హ్యాండ్ బైక్స్ మంచి ఎంపికనే చెప్పాలి. అయితే ఇలాంటి వాహనాలు కొనేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. మరి అవేంటో ఇప్పుడు చూద్దాం.

Second Hand Bikes Purchase In Telugu
Things To Keep In Mind While Buying Second Hand Bikes In Telugu
author img

By

Published : Aug 15, 2023, 4:06 PM IST

Second Hand Bikes Purchase : మన దేశంలో ఎక్కువగా అమ్ముడుపోయే వాహనాల్లో బైక్స్ శాతం ఎక్కువ. ముఖ్యంగా మధ్య తరగతి ప్రజలు తమ రోజువారీ కార్యకలాపాలకు వీటినే ఎక్కువగా ఉపయోగిస్తారు. ఆఫీసులకు వెళ్లాలన్నా, ఎక్కడైనా బయటకు పోవాలన్నా వారికి బైక్సే ఆధారం. బస్సులు, రైళ్లు, ఆటోలు లాంటి ఇతర రవాణా సర్వీసులు ఉన్నా.. చాలా మంది బైక్​లు, స్కూటీలు లాంటి సొంత వాహనాలపైనే ఎక్కువగా ఆధారపడతారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం బైక్స్ ధరలు బాగా పెరిగిపోయాయి. ఒక కొత్త బైక్ కొనాలంటే కనీసం లక్ష రూపాయల వరకు డబ్బును చేతిలో పెట్టుకోవాల్సిందే.

ఇటీవలీ కాలంలో చాలా మంది తమకు నచ్చిన బైక్స్​ను కొనుగోలు చేసేందుకు ఫైనాన్స్​ ఆప్షన్​ను ఎంచుకుంటున్నారు. మరికొందరు మాత్రం ఒకేసారి డబ్బులు చెల్లించి వాహనాలను సొంతం చేసుకుంటున్నారు. అయితే అంత డబ్బులు పెట్టలేని వాళ్లు సెకండ్ హ్యాండ్ బైక్స్ ( Second Hand Bikes )​ వైపు మొగ్గుచూపుతున్నారు. పలు ఆన్​లైన్ వెబ్​సైట్​లు, యాప్స్ సెకండ్ హ్యాండ్ బైక్స్​ను తక్కువ ధరకే అమ్మకానికి పెడుతున్నాయి. అయితే వాడిన బైక్​లను తీసుకోవడం మంచిదేనా? సెకండ్ హ్యాండ్ బైక్ కొనేటప్పుడు దృష్టిలో ఉంచుకోవాల్సిన అంశాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

లాభాలు..
Second Hand Bike Sale : సెకండ్ హ్యాండ్ బైక్స్ తీసుకోవడం వల్ల ఖర్చులు కలిసి వస్తాయి. మార్కెట్​లో కొత్త బైక్​ల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఈ సమయంలో ఇప్పటికే వాడిన బైక్​లను తక్కువ ధరలో దక్కించుకుంటే డబ్బులు మిగిలే అవకాశాలు ఉన్నాయి. కొత్త బైక్ కొంటే ఏడాది తర్వాత దాని విలువ 20 శాతం వరకు తగ్గుతుంది. అదే పాత బైకులను మళ్లీ అమ్మినా మంచి ధరే పలుకుతుంది.

నష్టాలు..
Two Wheeler Second Hand : సెకండ్ హ్యాండ్ బైక్స్ ( Can We Take Second Hand Bikes ) ​లో చాలా వరకు డ్యామేజ్ అయినవి లేదా రిపేర్ చేయించినవే ఉంటాయి. వీటి వల్ల వెహికిల్ పెర్ఫార్మెన్స్​పై ప్రభావం పడుతుంది. గతంలో జరిగిన ప్రమాదాల్లో బైక్ ఫ్రేమ్ లాంటివి ఏవైనా పాడైతే.. అవి బండిని హ్యాండిల్ చేయడం పైనా అలాగే బండి స్థిరత్వం మీదా ప్రభావం చూపిస్తాయి. సెకండ్ హ్యాండ్​ బైక్ ఇంజిన్ ఫెయిలైతే ఇక అంతే సంగతులు. ఇంజిన్ రిపేర్​కు చాలా ఖర్చవుతుంది.

వీటిని మర్చిపోవద్దు..
Two Wheeler Buying Guide : సెకండ్ హ్యాండ్ బైక్ కొనేటప్పుడు దాన్ని పూర్తిగా గమనించాలి. బండి టైర్ల కండీషన్ ఎలా ఉంది? బ్రేకులు బాగా పనిచేస్తున్నాయా? లాంటివి ఒకటికి రెండుసార్లు చెక్ చేయాలి. బ్రేకులు పనిచేయట్లేదంటే ఆ బైక్ మెయింటెనెన్స్‌ సరిగ్గా లేదని గ్రహించాలి. దీని వల్ల భవిష్యత్తులో రిపేర్ ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుందని అర్థం చేసుకోవాలి. బైక్ పెర్ఫార్మెన్స్​లో చైన్, గేర్ల పాత్ర కూడా కీలకం. వీటిని సరిగ్గా మెయింటైన్​ చేయాలి. కనుక అవి సరిగ్గా పనిచేస్తున్నాయో లేదో చెక్ చేయాలి.

ఇవి చెక్ చేయాల్సిందే..
Second Hand Bikes Purchase : బైక్ నడిపేటప్పుడు హెవీగా అనిపించినా లేదా స్లోగా వెళ్తున్న భావన కలిగినా బైక్ పెర్ఫార్మెన్స్ బాగోలేదని, రిపేర్లు అవసరం అని అర్థం చేసుకోవాలి. ఇంజిన్​తో పాటు సస్పెన్షన్​లో నుంచి ఆయిల్ లీకేజీ అవుతుందా, లేదా అనేది చూడాలి. ఇంజిన్​లో లీకేజీ ఉంటే మాత్రం అది పెద్ద సమస్యే. ఇంజిన్ రిపేర్​కు భారీగా ఖర్చవుతుంది. కనుక బండి కొనేముందు ఒకటికి రెండుసార్లు ఇలాంటివి జాగ్రత్తగా చూసుకోవాలి.

ధరను ఎలా నిర్ణయించాలి?
Second Hand Bike Sale Price : సెకండ్ హ్యాండ్ బైక్​లకు ఎంత ధర పెట్టాలనేది కొన్ని విషయాలపై ఆధారపడి ఉంటుంది. బైక్ మోడల్ ఏంటి? దాన్ని కొని ఎన్నేళ్లు అయింది? ప్రస్తుత కండిషన్ ఎలా ఉంది? దాన్ని ఏ లొకేషన్​లో ఎక్కువగా వాడుతున్నారు.. లాంటి వాటి ఆధారంగా బండి ధరను నిర్ణయించాలి. సాధారణంగా బైక్ పాతగా అవుతున్న కొద్దీ దాని ధర కూడా తగ్గుతూ పోతుంది. అయితే మెయింటెనెన్స్‌ బాగుండి, మంచి కండిషన్​లో ఉంటే మాత్రం ధర ఎక్కువగా పలికే అవకాశం ఉంది.

సెకండ్ హ్యాండ్ బైక్స్​ను పెద్ద నగరాల్లో గనుక అమ్మకానికి పెడితే వాటి ధర కూడా పెరిగే ఛాన్స్ ఉంది. అయితే మనం కొనాలనుకునే బైక్​లకు ఆ ఏరియాలో ఎంత ధర పలుకుతుందో తెలుసుకుని దానికి తగ్గట్లు ప్లాన్ చేసుకోవాలి. బైక్స్​కు ఏమైనా రిపేర్లు ఉంటే వాటిని హైలైట్ చేస్తూ ధర (Two Wheeler Second Hand Price) ను తగ్గించాల్సిందిగా డిమాండ్ చేస్తే కాస్త తక్కువలో బండిని దక్కించుకోవచ్చు. అయితే ఆ తర్వాత రిపేర్లకు డబ్బులు ఎలాగూ ఖర్చవుతాయనేది గుర్తుంచుకోవాలి.

How To Fix Second Hand Bike Price : కొత్త బైక్ కోసం ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టలేని వారు, తక్కువ ధరలోనే బైక్ కొంటే చాలనుకునే వారికి సెకండ్ హ్యాండ్ బైక్స్ మంచి ఆప్షన్​. అయితే బైక్​ను కొనేముందు ఒకటికి రెండుసార్లు దాని పెర్ఫార్మెన్స్, రిపేర్స్, కండిషన్​ లాంటి వాటిని నిశితంగా పరిశీలించాలి. ఫ్రేమ్, టైర్లు, బ్రేక్స్, చైన్, గేర్స్, ఇంజిన్​లను చెక్ చేసుకోవాలి. కుదిరితే ఒకసారి దాన్ని టెస్ట్ రైడ్​కు తీసుకెళ్లాలి. దీనితో బండి పెర్ఫార్మెన్స్ ఎలా ఉందో ఒక అవగాహన వస్తుంది. అప్పుడు బండిని కొనాలా.. వద్దా అనేది మీరే సొంతంగా నిర్ణయించుకోగలుగుతారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.