SBI WeCare Vs SBI Amrit Kalash : భారతదేశపు అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ ఎస్బీఐ ఫిక్స్డ్ డిపాజిట్లపై మంచి వడ్డీ రేట్లను అందిస్తోంది. దీనితో పాటు ఎఫ్డీలపై వివిధ రకాల ఆకర్షణీయమైన ఫీచర్లు, ప్రయోజనాలను కల్పిస్తోంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఫిక్స్డ్ టెర్మ్ డిపాజిట్లపై 3 శాతం నుంచి 7.10 శాతం వరకు వార్షిక వడ్డీని అందిస్తోంది. సీనియర్ సిటిజన్ ఎఫ్డీలపై 3.50 శాతం నుంచి 7.60 శాతం వరకు వార్షిక వడ్డీ రేట్లు ఇస్తోంది.
ఎస్బీఐ స్పెషల్ ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్స్
SBI Special Term Fixed Deposit Schemes : ఎస్బీఐ సాధారణ డిపాజిటర్ల కోసం, అలాగే సీనియర్ సిటిజన్స్ కోసం రెండు అద్భుతమైన లిమిటెడ్ డ్యూరేషన్ స్కీమ్‌లను అందిస్తోంది. అవి:
- ఎస్బీఐ అమృత్ కలశ్ పథకం
- ఎస్బీఐ వీకేర్ పథకం
SBI WeCare Senior Citizen FD Scheme :
ఎస్బీఐ సీనియర్ సిటిజెన్స్ కోసం ఈ ప్రత్యేకమైన ఫిక్స్డ్ డిపాజిట్ పథకాన్ని రూపొందించింది. 5 సంవత్సరాల కనీస కాలవ్యవధితో ఈ పథకాన్ని అందిస్తోంది. ఈ ఎస్బీఐ వీకేర్ స్కీమ్‌లో మదుపు చేసిన సీనియర్ సిటిజన్లకు 50 బేసిస్ పాయింట్స్ (bps) ప్రీమియం లభిస్తుంది. దీనితో పాటు మరో 50 బేసిస్ పాయింట్స్ కూడా అదనంగా లభిస్తాయి. అంటే ఎస్బీఐ వీకేర్ పథకంలో చేసిన సీనియర్ సిటిజన్స్ ఏకంగా 100 బేసిస్ పాయింట్లు మేర అధిక వడ్డీ రేటును పొందుతారు. ఇది ఇతర సాధారణ ఎఫ్డీ పథకాలకు ఇచ్చే వడ్డీ రేటు కన్నా చాలా అధికం కావడం గమనార్హం.
ఆఖరు తేదీ!
SBI WeCare FD Scheme Last Date : ఎస్బీఐ వీకేర్ పథకంలో చేరేందుకు ఆఖరు తేదీ 2023 సెప్టెంబర్ 30. ప్రస్తుతం ఎస్బీఐ ఈ పథకంలో చేరిన వారికి 7.50 శాతం వడ్డీ రేటు అందిస్తోంది. మొబైల్ బ్యాంకింగ్, ఆన్లైన్ బ్యాంకింగ్ యాప్స్ ద్వారా కూడా ఈ పథకంలో సులభంగా చేరవచ్చు. లేదా నేరుగా ఎస్బీఐ బ్రాంచ్‌కు వెళ్లి కూడా వీకేర్ పథకాన్ని సబ్‌స్క్రైబ్ చేయవచ్చు. ఈ పథకం కింద కొత్త డిపాజిట్ ఖాతాలు తెరవడమే కాదు. ఇప్పటికే మెచ్యూర్ అయిన డిపాజిట్లను కూడా రెన్యూవల్ చేసుకోవచ్చు.
లోన్ సౌకర్యం కూడా!
SBI WeCare Benefits : ఎస్బీఐ వీకేర్ పథకంలో మదుపు చేసినవారికి లోన్ సౌకర్యం కూడా కల్పిస్తారు. మీరు ఎంచుకున్న టెర్మ్ ప్లాన్‌ను అనుసరించి, ప్రతీ నెలా లేదా ప్రతీ మూడు నెలలకు ఒకసారి వడ్డీని చెల్లిస్తారు. అదే మీరు ఎస్బీఐ వీకేర్ స్పెషల్ టెర్మ్ డిపాజిట్ స్కీమ్‌లో ఇన్వెస్ట్ చేస్తే, మెచ్యూరిటీ పీరియడ్ అయిపోయిన తరువాత ఒకేసారి అసలు, వడ్డీ, మెచ్యూరిటీ మొత్తం సొమ్మును అందజేస్తారు.
ఎస్బీఐ అమృత్ కలశ్ పథకం
SBI Amrit Kalash Scheme : ఎస్బీఐ ఈ స్పెషల్ టెర్మ్ డిపాజిట్ స్కీమ్‌ను భారతదేశంలో ఉంటున్న ప్రజలకు, అలాగే ఎన్ఆర్ఐలకు కూడా ఈ అందిస్తోంది. ఈ పాలసీ టెర్మ్ కేవలం 400 రోజులు. ఈ స్పెషల్ ఎఫ్డీ పథకం కింద సాధారణ డిపాజిటర్లకు 7.1 శాతం వడ్డీ రేటు, సీనియర్ సిటిజన్లకు 7.6 శాతం చొప్పున వడ్డీ రేట్లు అందిస్తోంది.
ఎలా అప్లై చేయాలి!
SBI Amrit Kalash Apply Online : నేరుగా ఎస్బీఐ బ్యాంకుకు వెళ్లి ఈ అమృత్ కలశ్ స్కీమ్‌లో చేరవచ్చు. లేదా ఆన్లైన్ బ్యాంకింగ్ లేదా ఎస్బీఐ యోనో యాప్ ద్వారా కూడా ఈ పథకాన్ని సబ్‌స్క్రైబ్ చేసుకోవచ్చు. ఈ స్కీమ్‌లో చేరడానికి ఆఖరు తేదీ 2023 డిసెంబర్ 31.
లోన్ సౌకర్యం కూడా!
SBI Amrit Kalash Scheme Benefits : ఎస్బీఐ అమృత్ కలశ్ స్కీమ్‌లో చేరిన వారికి రుణ సౌకర్యం కూడా కల్పిస్తారు. మీరు ఎంచుకున్న ఆప్షన్‌ను అనుసరించి ప్రతి నెలా లేదా ప్రతి మూడు నెలలకు ఒకసారి వడ్డీ అందిస్తారు. అమృత్ కలశ్ స్పెషల్ టెర్మ్ డిపాజిట్ స్కీమ్‌లో చేరిన వారికి మెచ్యూరిటీ పీరియడ్ పూర్తి అయిన తరువాత అసలు, వడ్డీ, మెచ్యూరిటీ మొత్తం కలిపి ఒకేసారి అందిస్తారు.