ETV Bharat / business

SBIకి భారీ లాభాలు.. రూ.16వేల కోట్లు ప్రాఫిట్​.. Q4లో 83 శాతం జంప్​..

SBI Q4 Results : ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) భారీ లాభాలను ప్రకటించింది. 2022-23 నాలుగో త్రైమాసికంలో రూ.16,694.51 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది.

sbi results
sbi results
author img

By

Published : May 18, 2023, 3:27 PM IST

Updated : May 18, 2023, 3:47 PM IST

SBI Q4 Results 2023 : ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. 2022-23 జనవరి- మార్చి త్రైమాసికంలో నికర లాభం 83 శాతం వృద్ధి నమోదు చేసింది. అధిక వడ్డీ ఆదాయం, తక్కువ కేటాయింపుల కారణంగా జనవరి - మార్చి త్రైమాసికంలో రూ.16,694.51 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. 2020-21 ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో బ్యాంకు నికర లాభం రూ. 9,113.53 కోట్లుగా ఉంది.

2022-23 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో బ్యాంక్ వడ్డీ ఆదాయం 31 శాతం పెరిగి రూ. 92,951 కోట్లకు చేరుకుందని ఎస్‌బీఐ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. 2021-22 జనవరి-మార్చి కాలంలో ఉన్న రూ.7,237.45 కోట్ల మొండి బకాయిలు, ఆకస్మిక కేటాయింపులు ఈ త్రైమాసికంలో దాదాపు సగానికి తగ్గి రూ. 3,315.71 కోట్లకు చేరుకున్నాయి.

2022-23 ఆర్థిక సంవత్సరానికి గాను ఎస్​బీఐ నికర లాభం 59 శాతం పెరిగి రూ.50,232.45 కోట్లకు చేరుకుంది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో లాభం రూ.31,675.98 కోట్లుగా ఉంది. 2023 మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి గాను.. ఎస్​బీఐ ప్రతి ఈక్విటీ షేర్​కు రూ.11.30 డివిడెండ్​ ప్రకటించింది. డివిడెండ్ చెల్లించే తేదీ జూన్ 14గా నిర్ణయించింది.

ఐటీసీకి కూడా మంచి లాభాలు
ఎఫ్‌ఎంసీజీ దిగ్గజం ఐటీసీ లిమిటెడ్‌.. నాలుగో త్రైమాసికంలో మంచి లాభాల్ని సంపాదించింది. మార్చితో ముగిసిన త్రైమాసికంలో నికర లాభంలో 22.66 శాతం వృద్ధిని నమోదు చేసుకుంది. గతేడాది ఇదే సమయంలో కంపెనీ నికర లాభం రూ.4,259.68 కోట్లు కాగా.. ఈ ఏడాదిలో కంపెనీ రూ.5,225.02 కోట్లు అర్జించింది. గత త్రైమాసికంలో రూ. 65,204.96 కోట్లుగా ఉన్న ఆదాయం రూ. 76,518.21 కోట్లకు చేరింది. ఏకీకృత నికర లాభం రూ. 19,427.68 కోట్లు ఆర్జించింది. మొత్తం ఖర్చులు కూడా రూ.12,632.29 కోట్ల నుంచి రూ.12,907.84 కోట్లకు పెరిగాయి.

అదరగొట్టిన రిలయన్స్​..
ముకేశ్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ నాలుగో త్రైమాసిక ఫలితాల్లో అదరగొట్టింది. మార్చితో ముగిసిన త్రైమాసికంలో 19 శాతం నికర లాభాన్ని అర్జించింది. గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.16,203 కోట్ల నికర లాభాన్ని నమోదు చేయగా.. ఈ ఏడాదిలో రూ.19,299 కోట్లకు పెరిగింది. ఇదే ఇప్పటివరకు అత్యధికంగా అర్జించిన నికర లాభం అని కంపెనీ తన ఫైలింగ్‌లో తెలిపింది. గత ఆర్థిక సంవత్సరం మార్చి ముగిసే సమయానికి రూ. 2.11 లక్షల కోట్లు ఉన్న కంపెనీ ఆదాయం 2023 మార్చి ముగిసే సమయానికి రూ. 2.16 లక్షలకు పెరిగింది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి మెత్తం రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ రూ.66,702 కోట్ల నికర లాభాన్ని సొంతం చేసుకుంది. రూ.9 లక్షల కోట్ల ఆదాయం వచ్చింది.

జియో అదుర్స్​
రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌కి చెందిన రిలయన్స్‌ జియో సైతం నాలుగో త్రైమాసికంలో మంచి లాభాల్ని అర్జించింది. మార్చితో ముగిసిన త్రైమాసికంలో నికర లాభంలో 16 శాతం వృద్ధిని నమోదు చేసుకుంది. గతేడాది ఇదే సమయంలో కంపెనీ నికర లాభం రూ.4,173 కోట్లు కాగా.. ఈ ఏడాదిలో కంపెనీ రూ.4,716 కోట్లు అర్జించింది. గతేడాదితో పోలిస్తే కంపెనీ నికర లాభం 23 శాతం పెరగటం గమనార్హం. గత త్రైమాసికంలో రూ. 20,945 కోట్లుగా ఉన్న ఆదాయం 12 శాతం పెరిగి రూ. 23,394 కోట్లకు చేరింది. గతేడాదితో పోలిస్తే కంపెనీ ఆదాయం 18 శాతం పెరిగింది.

Last Updated : May 18, 2023, 3:47 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.