ETV Bharat / business

FD VS T Bills : ఫిక్స్​డ్​ డిపాజిట్స్ Vs ట్రెజరీ బిల్స్​.. ఏది బెస్ట్​ ఛాయిస్​! - ఆర్​బీఐ టీ బిల్స్

Fixed Deposits VS Treasury Bills In Telugu : డబ్బులు ఆదా చేసుకోవడం కోసం చాలా మంది ఫిక్స్​డ్​ డిపాజిట్​ల వైపే మొగ్గు చూపుతారు. అయితే రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వ‌ర్యంలో నడిచే ట్రెజరీ బిల్స్​ కూడా మంచి పెట్టుబడి సాధనమే. అయితే ఫిక్స్​డ్​ డిపాజిట్స్​ వర్సెస్​ ట్రెజరీ బిల్స్​ అనుకుంటే.. ఈ రెండింటీలో ఏది బెటర్​ ఆప్షన్​ అవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

Fixed Deposits VS Treasury Bills In Telugu
Fixed Deposits VS Treasury Bills
author img

By

Published : Aug 7, 2023, 4:11 PM IST

Fixed Deposits VS Treasury Bills : మీ పెట్టుబ‌డి సురక్షితంగా ఉంటూనే.. స్థిరమైన ఆదాయం పొందాల‌ని అనుకుంటున్నారా? అయితే దీనికి ఫిక్స్​డ్ డిపాజిట్ (ఎఫ్​డీ) ప‌థ‌కం బెస్ట్ ఛాయిస్‌. డ‌బ్బును ఫిక్స్​డ్​ డిపాజిట్ చేయ‌డం ద్వారా అది మెచ్యూర్ అయ్యే స‌మ‌యానికి అస‌లుతో పాటు వ‌డ్డీ సైతం పొంద‌వ‌చ్చు. ప‌లు నివేదిక‌ల ప్రకారం.. ప్ర‌జ‌లు ఏటా సుమారు రూ.60 ట్రిలియ‌న్లు (రూ.60 ల‌క్ష‌ల కోట్లు) పెట్టుబ‌డిగా పెడ‌తున్నారట. ఇందులో 15 శాతం ఫిక్స్​డ్​ డిపాజిట్, బంగారం రూపంలోనే ఉన్నాయని ఆ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.

Treasury Bills Maturity Period : సుర‌క్షిత‌మైన పెట్టుబ‌డి కోసం కేవలం ఈ ఫిక్స్​డ్​ డిపాజిట్స్​ మాత్రమే కాకుండా, రిజర్వ్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా నిర్వహించే ట్రెజ‌రీ బిల్స్​ లాంటి మంచి స్కీమ్స్​ కూడా ఉన్నాయి. తమ పెట్టుబడులు సురక్షితంగా ఉంటూనే.. అధిక రాబడి రావాలని కోరుకునే వారి కోస‌మే కేంద్ర ప్ర‌భుత్వం ఈ టీ-బిల్స్​ ప‌థ‌కాన్ని తీసుకువచ్చింది. ఈ టీ-బిల్స్​ను కేంద్ర ప్రభుత్వం జారీ చేస్తుంది. ఇది ఒక మనీ మార్కెట్​ సాధనంగా ఉపయోగపడుతుంది. దీని స్కీమ్​లో పెట్టే పెట్టుబడులను భ‌విష్య‌త్తులో మనకి తిరిగి చెల్లించ‌డానికి ప్రామిస‌రీ నోట్​ను జారీ చేస్తారు. వీటిని జీరో కూప‌న్ సెక్యూరిటీస్ అని కూడా అంటారు.

అధిక వడ్డీని పొందొచ్చు..
Treasury Bills Interest Rates : ఈ టీ-బిల్స్​ను రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్​బీఐ) ప్ర‌తి వారం జారీ చేస్తుంది. ఇవి 91 రోజులు, 182 రోజులు, 364 రోజుల మెచ్యూరిటీ పీరియ‌డ్​తో ఉంటాయి. 3 నెల‌లు, 12 నెలల కాల పరిమితి గల ఈ టీ-బిల్స్​పై 6.7 శాతం వ‌డ్డీని పొందొచ్చు. ఇవి కేంద్ర ప్ర‌భుత్వం ఆధ్వ‌ర్యంలోనే జారీ చేస్తారు కనుక ఎటువంటి రిస్క్​ ఉండ‌దు. పైగా వీటిని డిస్కౌంట్ రేటుతో అందిస్తారు. ఒక్క‌సారి మెచ్యూరిటీ టైమ్ అయిపోయిన త‌ర్వాత ఈ టీ-బిల్స్ మీ డీమ్యాట్ ఖాతా నుంచి ఆటోమేటిక్​గా డెబిట్ అవుతాయి. ఫేస్ వ్యాల్యూ మీ బ్యాంకు ఖాతాలో క్రెడిట్ అవుతుంది.

రెండింటి మ‌ధ్య తేడా ఇది..
Treasury Bills Vs Fixed Deposit : ఎఫ్​డీలో పెట్టుబ‌డి పెట్టేందుకు క‌నీస పెట్టుబ‌డి పారామితులు ఉండాలి. ఈ ఖాతాను కేవలం రూ.1000తో ఓపెన్ చేసుకోవ‌చ్చు. కానీ, అదే టీ-బిల్స్ కోసం అయితే క‌నీసం రూ.25 వేలు కావాలి. వీటిని రూ.25 వేల గుణిజాల్లో మాత్ర‌మే జారీ చేస్తారు. ఎఫ్​డీలో వ‌డ్డీ రేట్లు మార్కెట్ స్థితి, స‌ద‌రు సంస్థ‌పై ఆధార‌ప‌డి ఉంటుంది. కానీ టీ-బిల్స్ విష‌యంలో.. వ‌డ్డీ రేట్లు స్థిరంగా ఉంటాయి. వీటి నుంచి పొందిన లాభం స్వ‌ల్పకాలిక మూలధ‌న లాభం (షార్ట్​ టర్మ్​ క్యాపిటల్​ గెయిన్స్​​)గా​ ప‌రిగణిస్తారు. అంతే కాకుండా స్లాబ్​ ప్ర‌కారం ఆదాయ‌పు ప‌న్ను కూడా వ‌ర్తిస్తుంది.

T bills RBI Retail : ట్రెజ‌రీ బిల్లుల‌ను సుల‌భంగా న‌గ‌దుగా మార్చుకోవ‌చ్చు. అలాగే వీటిని మెచ్యూరిటీకి ముందే సెకండ‌రీ మార్కెట్లో విక్ర‌యించవ‌చ్చు. అదే ఫిక్స్​డ్​ డిపాజిట్ విష‌యంలో ఇలా ఉండదు. వీటికి నిర్ణీత వ్య‌వ‌ధి ఉంటుంది. మెచ్యూరిటీ కంటే ముందు డ‌బ్బు విత్​డ్రా చేస్తే ఛార్జీలు చెల్లించాలి. మొద‌ట్లో టీ-బిల్స్​లో పెట్టుబ‌డి పెట్టేందుకు బ్యాంకులు, ఆర్థిక సంస్థ‌ల‌కు మాత్ర‌మే అనుమ‌తి ఉండేది. కానీ ఇప్పుడు రిటైల్ పెట్టుబ‌డిదారులకు కూడా ఇవి అందుబాటులో ఉన్నాయి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.