Range Rover Just For Rs.100 Only: కారు కొనాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. తక్కువ ధరలో కారు కొనాలన్నా.. కనీసం ఐదు లక్షలైనా ఉండాలి. ఇక లగ్జరీ కార్ల విషయానికి వస్తే కోట్లు ఖర్చుపెట్టాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు కేవలం రూ. 100 పెడితే లక్షల రూపాయల విలువైన కారు గెలుచుకోవచ్చు. అది ఎలానో.. ఈ కథనంలో తెలుసుకుందాం.
Raas Festival in Assam: అసోంలోని బార్ పేట జిల్లాలోని హౌలీలో నిర్వహించనున్న రాస్ ఫెస్టివెల్ (Raas Festival) లో ఖరీదైన కార్లు కేవలం రూ.100 లకే ఏర్పాటు చేయటం దేశవ్యాప్తంగా ఎంతో ఆసక్తి రేపుతోంది. అసోంలోని హౌలీలో ఏటా రాస్ వేడుకలు నిర్వహిస్తారు. ఎన్నో ఏళ్లుగా వస్తున్న ఈ సంప్రదాయంలో భాగంగా పండుగ ముందు ఈ లాటరీ ఈవెంట్‌ని నిర్వాహకులు ఏర్పాటు చేస్తారు. లాటరీలో గెలుపొందిన విజేతకు ఖరీదైన కార్లను బహుమతిగా అందిస్తుంటారు. ప్రతీ సంవత్సరం లాగానే ఈ ఏడాది కూడా ఖరీదైన కార్లను ఏర్పాటు చేశారు.
Assam Howly Raas Lottery Details: రూ.100 పెట్టి టికెట్ కొంటే మొదటి బహుమతిగా రూ.76 లక్షల రేంజ్ రోవర్, రెండో బహుమతిగా రూ. 50 లక్షల విలువైన టయోటా ఫార్చ్యూనర్, ఆ తరువాతవిజేతలకు స్కార్పియో, స్కోడా కుచక్, నెక్సాన్ వంటి ఖరీదైన కార్లను అందజేస్తారు. కాగా ఈ ఈవెంట్‌లో గెలుపొందిన లాటరీ విజేతలను డిసెంబర్ 10న ప్రకటించనున్నారు. ఈ ఈవెంట్‌లో టికెట్ల విక్రయం ద్వారా సేకరించిన మొత్తాన్ని బహుళ ప్రాజెక్టులలో ఉపయోగిస్తారు. ఈ లాటరీ విషయం తెలియగానే కొనుగోలు చేసేందుకు హౌలీలోని గిఫ్ట్ కూపన్ కార్యాలయాలకు జనం బారులు తీరుతున్నారు.
Howly Raas Festival 2023 Full Details: హౌలీ రాస్ వేడుకలు అనేవి శ్రీకృష్ణుడు, రాధల ప్రేమలకు ప్రతిరూపంగా నిర్వహించే పండుగ. బార్‌పేట జిల్లాలోని హౌలీలో రాస్ మహోత్సవ్ అనేది భారతీయ సంప్రదాయ క్యాలెండర్ ప్రకారం తెలుగు మాసం అయిన కార్తీక పూర్ణిమ తిథిలో జరుపుకుంటారు. దీంట్లో భాగంగా ఈ ఏడాది నవంబర్ 24 నుంచి డిసెంబర్ 10 వరకు రాస్ వేడుకలు జరగనున్నాయి. ఈ పండుగను అసోం వాసులు చాలా శుభప్రదంగా భావిస్తారు. ఈ వేడుకలు తమ సంస్కృతి అని మురిసిపోతారు. ఈ వేడుకలు జరగకపోతే తమకు ఏదో వెలితిగా ఉంటుందని విశ్వసిస్తారు. ఈ వేడుకల్లో ఎక్కడ చూసిని శ్రీకృష్ణుని గాధలే కనిపిస్తాయి.. వినిపిస్తాయి. కృష్ణుడి జీవితాన్ని నృత్య, నాటక, సంగీత ప్రదర్శనల ద్వారా జరుపుతారు. కృష్ణుని జీవితంలోని వివిధ దశలను చూపరులను ఆకట్టుకునేలా నిర్వహిస్తారు. కృష్ణుడి బాల్యం నుంచి గోపికలతో ఆటపాటలు, రాసలీలు వంటి ఎన్నో మహత్తర ఘట్టాలను ఆవిష్కరిస్తారు.
Upcoming Cars In 2024 : అదిరిపోయే ఫీచర్స్.. సూపర్ మైలేజ్‌తో.. కొత్త ఏడాదిలో 24 నయా కార్స్ లాంఛ్!
Raas Mahotsav 2023 in Assam: కాగా, గత సంవత్సరం నిర్వహించిన నిర్వహించిన ఈవెంట్‌లో గెలుపొందిన విజేతలకు మొదటి బహుమతి కింద ఆడి కారును ఇచ్చారు. ఉత్తర గౌహతికి చెందిన అసోం పోలీసు అధికారి జనార్దన్ బోరో దీనిని గెలుచుకున్నారు. కాగా 2022లో లాటరీ కమిటీ 3.2 లక్షల టిక్కెట్లను విక్రయించారు. అంతే కాకుండా ఈ లాటరీలకు ప్రజాదరణ లభిస్తుండటంతో.. ఈ ఏడాది 4 లక్షల టిక్కెట్లను విక్రయించాలని నిర్ణయించింది.
Hyundai i10 Car For Only Rs 1 Lakh at Carwale : షాకింగ్ రేటు.. హ్యుందాయ్ ఐ10 కారు.. లక్ష రూపాయలకే!