ETV Bharat / business

వడ్డీ రేట్లపై RBI కీలక నిర్ణయం.. EMI భారం యథాతథం!

author img

By ETV Bharat Telugu Team

Published : Dec 8, 2023, 10:13 AM IST

Updated : Dec 8, 2023, 12:02 PM IST

RBI MPC 2023 LIVE Updates In Telugu : ఆర్​బీఐ కీలక వడ్డీ రేట్లను మరోసారి యథాతథంగా ఉంచుతూ నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా రెపోరేటును 6.5 శాతం వద్దనే కొనసాగిస్తున్నట్లు స్పష్టం చేసింది. పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకే ఆర్​బీఐ ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టమవుతోంది.

RBI REPO RATE 2023
RBI MPC 2023 LIVE Updates

RBI MPC 2023 LIVE Updates : రిజర్వ్​ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) వరుసగా ఐదో సారి కూడా రెపోరేటును 6.5 శాతం వద్దనే యథాతథంగా ఉంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. దేశీయంగా పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది.

ఆర్​బీఐ గవర్నర్​ శక్తికాంత దాస్​ ద్వైమాసిక ద్రవ్య విధానాన్ని ప్రకటిస్తూ, రెపోరేటును 6.5 శాతం వద్ద యథాతథంగా కొనసాగించాలని 'ద్రవ్య పరపతి విధాన కమిటి' (MPC) ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకుందని తెలిపారు.

ఆర్​బీఐ జీడీపీ వృద్ధి అంచనాలు 7 శాతానికి పెంపు
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి జీడీపీ వృద్ధి అంచనాలను 6.5 శాతం నుంచి 7 శాతానికి పెంచింది. ఉత్పాదక రంగం వృద్ధి చెందడం సహా, దేశీయంగా డిమాండ్​ పెరుగుతుండడమే ఇందుకు కారణమని పేర్కొంది.

  • ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రిటైల్ ద్రవ్యోల్బణం 5.4 శాతం ఉంటుందని ఆర్​బీఐ అంచనా వేసింది.
  • అక్టోబర్​లో దేశీయ ద్రవ్యోల్బణం 4.87 శాతానికి తగ్గింది. నవంబర్​ నెల ద్రవ్యోల్బణం వివరాలను మరో వారంలో వెల్లడయ్యే అవకాశం ఉంది.
  • వినియోగదారు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం (CPI)ను ఇరువైపులా 2 శాతం మార్జిన్​తో 4% వద్ద ఉంచాలని ఆర్​బీఐని ప్రభుత్వం ఆదేశించింది.
  • భారతదేశంలో 2023 డిసెంబర్ 1నాటికి 604 బిలియన్ల మేరకు ఫారెక్స్ నిల్వలు ఉన్నాయని ఆర్​బీఐ గవర్నర్ వెల్లడించారు.

యూపీఐ పేమెంట్స్​ పరిమితి పెంపు!

  • ఆసుపత్రులు, విద్యాలయాల్లో పేమెంట్స్​ చేయడానికి ఇప్పుడున్న యూపీఐ పేమెంట్స్​ పరిమితిని.. ఒక్కో లావాదేవీకి రూ.1 లక్ష నుంచి రూ.5 లక్షలకు ఆర్​బీఐ పెంచింది.
  • రికరింగ్ చెల్లింపుల ఇ-మ్యాండేట్​ పరిమితి రూ.15 వేలు నుంచి రూ.1 లక్షకు పెంచాలని ఆర్​బీఐ నిర్ణయించింది.

ఆర్థిక వృద్ధి నెమ్మదించవచ్చు!

  • 2023 ఏడాది ముగింపునకు వచ్చిన వేళ అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ నెమ్మదిస్తున్న సంకేతాలు కనిపిస్తున్నాయని ఆర్​బీఐ గవర్నర్ శక్తికాంత పేర్కొన్నారు. అయితే భారత ఆర్థిక వ్యవస్థ మాత్రం బలంగా పుంజుకుంటోందని ఆయన పేర్కొన్నారు.
  • దేశంలో ద్రవ్యోల్బణం తగ్గుముఖం పడుతోందని.. కానీ ఆహార ద్రవ్యోల్బణంలో మాత్రం రిస్క్‌ ఇంకా కొనసాగుతోందని ఆర్​బీఐ గవర్నర్​ చెప్పారు.

ఆన్​లైన్​ మోసాలకు అడ్డుకట్ట!
ఆన్​లైన్​లో రుణాలు మంజూరు చేసే, వెబ్​ అగ్రిగేటర్లకు సరికొత్త మార్గదర్శకాలు నిర్దేశిస్తున్నట్లు ఆర్​బీఐ గవర్నర్​ శక్తికాంత దాస్​ పేర్కొన్నారు. ఆన్​లైన్ మోసాలను నివారించడానికి, డిజిటల్ లెండింగ్​లో మరింత పారదర్శకత తెచ్చేందుకు.. ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు ఆయన స్పష్టం చేశారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు - ఏపీ, తెలంగాణల్లో ఎంతంటే?

ATM బిజినెస్​తో నెలకు రూ.60వేలు ఆదాయం - ఎలా ఏర్పాటు చేయాలో తెలుసా?

Last Updated : Dec 8, 2023, 12:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.