ETV Bharat / business

రూ.88వేల కోట్లు విలువైన రూ.500 నోట్లు ఏమయ్యాయి?.. RBI వద్ద సమాచారం లేదా? - rbi 500 note news

RBI 500 Note Missing : సమాచారం హక్కు చట్టం ప్రకారం ఓ సామాజిక కార్యకర్త.. రిజర్వ్​ బ్యాంక్​ ఇండియాకు దాఖలు చేసిన దరఖాస్తు ద్వారా కీలక విషయాలు బయటపడ్డాయి. దాదాపు రూ.88వేల కోట్ల విలువైన రూ.500 నోట్లకు సంబంధించిన సమాచారం ఆర్‌బీఐ వద్ద లేనట్లు తెలుస్తోంది.

mh_mum_500_notes_currency_disappered_issue_7210546
http://10.10.50.80:6060//finalout3/odisha-nle/thumbnail/17-June-2023/18780124_497_18780124_1687015180082.png
author img

By

Published : Jun 18, 2023, 7:21 AM IST

Updated : Jun 18, 2023, 9:05 AM IST

RBI 500 Note Missing : రిజర్వ్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా వద్ద దాదాపు రూ.88,032.5 కోట్ల విలువైన రూ.500 నోట్లకు సంబంధించిన సమాచారం లేదని తెలుస్తోంది. సమాచార హక్కు చట్టం ప్రకారం మనోరంజన్‌రాయ్‌ అనే సామాజిక కార్యకర్త దరఖాస్తు చేయగా ఈ విషయం బయటపడింది! పాతనోట్లను రద్దు చేసి, కొత్త రూ.500 నోట్లను తీసుకొచ్చిన సమయంలో దేశంలోని 3 ముద్రణాలయాల నుంచి 8,810.65 మిలియన్ల రూ.500 నోట్లను ముద్రించారు. కానీ, అందులో కేవలం 7,260 మిలియన్ల నోట్లు మాత్రమే ఆర్‌బీఐకి చేరినట్లు ఆర్‌టీఐ నివేదిక తెలిపింది. మిగతా 1,550.65 మిలియన్ల నోట్లకు సంబంధించి ఎలాంటి సమాచారం ఆర్‌బీఐ దగ్గర లేదు.

అయితే మన దేశంలో మూడుచోట్ల మాత్రమే కరెన్సీనోట్లను ముద్రిస్తారు. బెంగళూరులోని భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ నోట్‌ ముద్రణ్‌ లిమిటెడ్‌, నాశిక్‌లోని కరెన్సీ నోట్‌ ప్రెస్‌, మధ్యప్రదేశ్‌ దేవస్‌లోని బ్యాంక్‌ నోట్‌ ప్రెస్‌లో అవసరమైన కరెన్సీ నోట్లను ముద్రిస్తారు. 2016-17 మధ్య కాలంలో 1,662 మిలియన్ల రూ.500ల నోట్లను ముద్రించినట్లు నాశిక్‌ మింట్‌ వెల్లడించింది. ఇదే సమయంలో బెంగళూరులో 5,195.65 మిలియన్లు, దేవస్‌లో 1,953 మిలియన్ల నోట్లను ముద్రించినట్లు ఆర్‌టీఐ ద్వారా వెల్లడైంది. అయితే ఆర్‌బీఐ మాత్రం కేవలం 7260 మిలియన్ల నోట్లే అందినట్లు తెలిపింది.

RBI 500 Note News : మరో ఆర్‌టీఐ దరఖాస్తు ద్వారా పొందిన వివరాల ప్రకారం.. ఏప్రిల్‌ 2015-డిసెంబరు 2016 మధ్య కాలంలో నాశిక్‌ ముద్రణాలయంలో 375.450 మిలియన్ల కొత్త రూ.500 నోట్లను ముద్రించారు. కానీ, ఆర్‌బీఐ మాత్రం కేవలం 345 మిలియన్ల నోట్లు మాత్రమే వచ్చినట్లు చెబుతోంది. కనిపించకుండా పోయిన మొత్తం 1550.65 మిలియన్ల నోట్లలో 210 మిలియన్ల నోట్లు ఏప్రిల్‌ 2015 నుంచి మార్చి 2016 మధ్య కాలంలో ముద్రించినట్లు తేలింది. అయితే, నవంబరు 2016లో కేంద్రం నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఆ తర్వాతే కొత్త నోట్లను తీసుకొచ్చారు. కానీ, ఆర్‌టీఐ వివరాల ప్రకారం..2015లోనే ముద్రణాలయాల్లో కొత్త నోట్లను ముద్రించినట్లు తెలుస్తోంది. ఒక వేళ రూ.88,032.5 కోట్ల విలువైన నోట్లు కనిపించకుండా పోయిన విషయం వాస్తవమే అయినా.. దీనిపై మాత్రం స్పష్టత రావాల్సి ఉంది.

మరోవైపు గతంతో పోలిస్తే 2022-23 ఆర్థిక సంవత్సరంలో గుర్తించిన రూ.500 నకిలీ నోట్ల సంఖ్య 14.4శాతం మేర పెరిగినట్లు ఇటీవల విడుదల చేసిన వార్షిక నివేదికలో ఆర్‌బీఐ వెల్లడించింది. మొత్తం 91,110 నోట్లను గుర్తించినట్లు చెప్పింది. కాగా, రూ.2000 నకిలీ నోట్ల సంఖ్య 9,806కి చేరినట్లు పేర్కొంది.
2000 Note Withdrawal : రూ.2000 నోట్లను కూడా చలామణీని కూడా నిలిపివేస్తున్నట్లు మే 19న ఆర్‌బీఐ వెల్లడించింది. సెప్టెంబరు 30 లోగా ప్రజలు తమ వద్దనున్న రూ.2000 నోట్లను బ్యాంకుల్లో మార్చుకోవాలని కోరింది.

Last Updated : Jun 18, 2023, 9:05 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.