ETV Bharat / business

'కాఫ్‌ సిరప్‌'లపై పూర్తి స్థాయి పరిశీలన.. గాంబియా ఘటనతో అప్రమత్తత! - cough syrup manufacturing in telangana

దగ్గును తాత్కాలికంగా నియంత్రించే కాఫ్​ సిరప్​లను తయారు చేసే సంస్థలు నానాటికి పెరుగుతూనే ఉన్నాయి. కానీ వీటి తయారీలో ఆ కంపెనీలు తగు జాగ్రత్తలు తీసుకోకపోతే అది తీసుకున్న వారి ప్రాణాలకు హాని కలిగిస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. దగ్గు మందుల తయారీ కంపెనీలను, ఆ మందుల్లో వినియోగిస్తున్న ఔషధ ముడిపదార్థాలను పూర్తిస్థాయిలో తనిఖీ చేయాలని ఔషధ నియంత్రణ వర్గాలు నిర్ణయించాయి.

cough syrup manufacturing
cough syrup
author img

By

Published : Oct 15, 2022, 6:37 AM IST

దగ్గు తగ్గించే 'కాఫ్‌ సిరప్‌'లను ఔషధ రంగంలోని దిగ్గజ సంస్థల నుంచి చిన్న కంపెనీల వరకు ఉత్పత్తి చేస్తుంటాయి. వీటి తయారీలో ఎంతో జాగ్రత్త తీసుకోవాలి. లేకపోతే ఆ మందు తీసుకున్న వారికి ప్రాణాంతకమవుతుంది. ఆఫ్రికాలోని గాంబియా దేశంలో ఇటువంటిదే జరిగింది. మనదేశంలోని హర్యానాకు చెందిన మేడెన్‌ ఫార్మా కంపెనీ ఎగుమతి చేసిన దగ్గు మందు తాగిన తర్వాత 66 మంది పిల్లలు చనిపోయారు. దీనిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) దర్యాప్తు చేపట్టింది. దగ్గు మందు శాంపుల్స్‌ సేకరించి, పరీక్ష నిమిత్తం కోల్‌కతాలోని ల్యాబ్‌కు పంపింది. కొన్ని ప్రమాదకర రసాయన అవశేషాలు ఆ మందులో ఉన్నట్లు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు.

ఈ ఉదంతం మనదేశంలో ఫార్మా పరిశ్రమ - ప్రభుత్వ వర్గాలను ఆందోళనకు గురి చేసింది. ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో దేశాలకు మందులు, టీకాలు ఎగుమతి చేస్తూ, అత్యంత క్రియాశీలక పాత్ర పోషిస్తున్న నేపథ్యంలో ఇటువంటి ఉదంతాలు ఎదురు కారాదని, సత్వరం దిద్దుబాటు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం సంకల్పించింది. ఫలితంగా కేంద్ర ప్రభుత్వంలోని సెంట్రల్‌ డ్రగ్స్‌ స్టాండర్డ్‌ కంట్రోల్‌ ఆర్గనైజేషన్‌ (సీడీఎస్‌సీఓ), వివిధ రాష్ట్రాల్లోని డ్రగ్స్‌ కంట్రోలర్లు రంగంలోకి దిగారు. దగ్గు మందుల తయారీ కంపెనీలను, ఆ మందుల్లో వినియోగిస్తున్న ఔషధ ముడిపదార్థాలను పూర్తిస్థాయిలో తనిఖీ చేయాలని నిర్ణయించారు.

వీటి మోతాదు ఎంత?
దగ్గు మందులో డైఫెన్‌హైడ్రమైన్‌ హైడ్రోక్లోరైడ్‌, అమ్మోనియమ్‌ క్లోరైడ్‌, సోడియమ్‌ సిట్రేట్‌.. తదితర ముడి ఔషధాలను ఏఏ మోతాదుల్లో వినియోగిస్తున్నదీ నిర్థారించుకుంటున్నారు. ఇందుకోసం తెలంగాణ రాష్ట్ర డ్రగ్‌ కంట్రోలర్‌ కార్యాలయ అధికారులు, రాష్ట్రంలోని ఫార్మా కంపెనీలు, స్టాకిస్టుల వద్ద ఉన్న దగ్గు మందులను, వాటిల్లో వినియోగించిన ముడిపదార్థాల మోతాదును తనిఖీ చేస్తున్నారు. గాంబియాకు సరఫరా చేసిన కాఫ్‌ సిరప్‌ను మనదేశంలో పంపిణీ చేయలేదని మేడెన్‌ ఫార్మా తెలియజేసింది. అయినప్పటికీ దేశీయంగా విక్రయమవుతున్న ఇతర దగ్గు మందుల్లోనూ ప్రాణహాని కలిగించే రసాయనాలు, రసాయన అవశేషాలు లేకుండా జాగ్రత్త వహించాలనేది ప్రభుత్వ అభిప్రాయం.

శుద్ధి అత్యంత కీలకం
దగ్గు మందు తయారీలో రసాయనాల శుద్ధి ప్రక్రియ (ప్యూరిఫికేషన్‌ ప్రాసెస్‌)తో పాటు ఉపకరణాలను శుద్ధి చేయడానికి ప్రొపలిన్‌ గ్లైకాల్‌ అనే సాల్వెంట్‌ వినియోగిస్తారు. ఈ ప్రక్రియలో అజాగ్రత్తగా ఉంటే దగ్గు మందులో డైఎథలిన్‌ గ్లైకాల్‌, ఎథలిన్‌ గ్లైకాల్‌ అనే రసాయన అవశేషాలు మిగిలిపోయే ప్రమాదం ఉంటుంది. ‘ఈ రెండు రసాయన అవశేషాలు ఎంతో ప్రమాదకరం. ఇవి మనిషి శరీరంలోకి ప్రవేశిస్తే మూత్రపిండాలను దెబ్బతీస్తాయి. దానివల్ల ప్రాణాలు కోల్పోవచ్చు’ అని తెలంగాణ ఔషధ నియంత్రణ వర్గాలు వివరించాయి.

ఐపీ గ్రేడ్‌ మాత్రమే వాడాలి
ప్రొపలిన్‌ గ్లైకాల్‌ అనే సాల్వెంట్‌ ఐపీ గ్రేడు (ఇండియన్‌ ఫార్మాకోపియా), కమర్షియల్‌ గ్రేడుల్లో లభిస్తుంది. దగ్గు మందు తయారు చేయడానికి ఐపీ గ్రేడు మాత్రమే వినియోగించాలి. కానీ కొన్ని ఫార్మా కంపెనీలు కమర్షియల్‌ గ్రేడు సాల్వెంట్‌ను వినియోగించి, దగ్గు మందు తయారు చేస్తున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. ఇండియన్‌ ఫార్మాకోపియా ప్రకారం దగ్గు మందులో డైఎథలిన్‌ గ్లైకాల్‌, ఎథలిన్‌ గ్లైకాల్‌ అవశేషాలు ఉండటానికి వీల్లేదు. మనదేశంలో రెండేళ్ల క్రితం జమ్మూ కశ్మీర్‌లో దగ్గు ముందు తాగి ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. అప్పుడు నిర్వహించిన పరీక్షల్లో, ఈ రకమైన రసాయన అవశేషాల జాడ ఆ మందులో ఉన్నట్లు నిర్థారణ అయింది.

నిర్థారిస్తున్న అంశాలు ఇవీ
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ సహా వివిధ రాష్ట్రాల్లోని ఔషధ నియంత్రణ వర్గాలు తమ పరిధిలోని ఫార్మా కంపెనీలు ఉత్పత్తి/ పంపిణీ చేస్తున్న దగ్గు మందుల్లో ప్రమాదకర రసాయన అవశేషాల జాడ ఏమైనా ఉందా? అని నిర్థారించుకునే పనిలో నిమగ్నమయ్యాయి. దీని కోసం పెద్దఎత్తున శాంపుల్స్‌ సేకరిస్తున్నట్లు తెలిసింది. వీటిని ఇండియన్‌ ఫార్మాకోపియా ప్రమాణాల ప్రకారం పరీక్షించాలని ఇప్పటికే సీడీఎస్‌సీఓ డ్రగ్‌ కంట్రోలర్‌ జనరల్‌ రాష్ట్రాల్లోని డ్రగ్‌ కంట్రోలర్లకు సూచించారు. నిర్దేశించిన ఔషధ ముడిపదార్థాలు, సాల్వెంట్లు మాత్రమే మందుల తయారీలో వినియోగించాలని ఔషధ నియంత్రణ వర్గాలు ఫార్మా కంపెనీలకు సూచిస్తున్నట్లు తెలిసింది.

ఇదీ చదవండి: ఆర్థిక మాంద్యానికి దగ్గర్లో ప్రపంచం.. వరల్డ్ బ్యాంక్​ అధ్యక్షుడి హెచ్చరిక

డిజిటల్‌ లోన్​ తీసుకుంటున్నారా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.