ETV Bharat / business

బీమా పాలసీలో నిజాలు దాస్తే మొదటికే మోసం.. ఈ జాగ్రత్తలు మస్ట్! - Precautions to be taken taking insurance policy

బీమా పాలసీ తీసుకునే సందర్భంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? పాలసీదారుడిపై ఎలాంటి బాధ్యతలు ఉంటాయి? పాలసీ తీసుకున్నాక అనారోగ్యం ఏర్పడితే ఏం చేయాలన్న దానిపై నిపుణులు వివిధ సూచనలు చేస్తున్నారు. అవేంటో తెలుసుకుందాం.

precautions-to-be-taken-taking-insurance-policy
బీమా పాలసీ తీసుకునేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు
author img

By

Published : Jan 15, 2023, 2:43 PM IST

జీవిత బీమా పాలసీ అంటే దీర్ఘకాలిక నేస్తం. బీమా కంపెనీపై మనకూ, మనపై బీమా కంపెనీకీ నమ్మకం ఉండాలి. అప్పుడే పాలసీ కొనసాగించడంలోనూ, కష్టకాలంలో ఆదుకునేందుకు ఎలాంటి ఇబ్బందులూ రావు. అందుకే మనకు సంబంధించిన అన్ని వివరాలను, ముఖ్యంగా ఆరోగ్య విషయాలు బీమా కంపెనీకి తెలియజేయడం పాలసీదారుడి బాధ్యత.

కుమార్ నాలుగేళ్లుగా కాన్సర్ వ్యాధికి చికిత్స తీసుకుంటున్నాడు. అతడికి భార్య, ఇద్దరు పిల్లలు (10, 8 ఏళ్లు) ఉన్నారు. గతేడాది అతడు ఒక టర్మ్ పాలసీ తీసుకున్నాడు. అయితే, పాలసీ ప్రతిపాదిత పత్రంలో తనకు కాన్సర్ ఉన్న విషయాన్ని కుమార్ తెలియజేయలేదు. ఇటీవలే కుమార్ చనిపోయాడు. అతడి కుటుంబం పాలసీ డబ్బుల కోసం ఎదురుచూస్తోంది. కానీ, దురదృష్టవశాత్తు క్లెయిమ్‌ను కంపెనీ తిరస్కరించింది. కారణం ఏంటంటే పాలసీలో కాన్సర్ ఉన్న విషయం ముందే చెప్పకపోవడం. ఈ క్లెయిమ్ మొత్తం కుటుంబానికి అంది ఉండుంటే వారు ఆర్థికంగా కాస్త నిలదొక్కుకునే అవకాశం ఉండేది.

జీవిత బీమా పాలసీ తీసుకునేటప్పుడు పాలసీదారుడు ఒక దరఖాస్తు పత్రాన్ని పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇందులో ఎంత విలువైన పాలసీను తీసుకుంటున్నారు? ప్రాథమిక పాలసీ విలువ ఎంత? యాక్సిడెంట్ డెత్ బెనిఫిట్, క్రిటికల్ ఇల్నెస్, అంగవైకల్యం లాంటి రైడర్లు ఎంత మొత్తానికి కావాలి? అనేది పూర్తి చేయాల్సి ఉంటుంది. అదే సమయంలో బీమా కంపెనీ వ్యక్తిగత సమాచారాన్ని కూడా కోరుతుంది. ఇందులో మీరు పేర్కొనే విషయాలను 'పూర్తిగా నమ్మదగినవి' అని తెలపాల్సి ఉంటుంది. దీని ఆధారంగానే బీమా కంపెనీ మీతో ఒప్పందం కుదుర్చుకుంటుందన్నమాట. భవిష్యత్‌లో ఎప్పుడైనా క్లెయిమ్ చేయాల్సి వస్తే ఈ విషయాలు కీలకంగా మారతాయి.

కొంతమందికి చిన్న వయసులోనే తీవ్ర అనారోగ్యం ఉంటుంది. కానీ, మామూలుగానే కనిపిస్తారు. వయసు దృష్ట్యా బీమా కంపెనీ ఆరోగ్య పరీక్షలు చేసుకోమని కోరకపోవచ్చు. ఇలాంటప్పుడు సరైన సమాచారాన్ని అందించే బాధ్యత పాలసీదారుడిదే. ఏదైనా అనారోగ్యం ఉందని తెలియజేస్తే.. దాన్ని బట్టే బీమా కంపెనీ పాలసీ ఇవ్వాలా? వద్దా? ఇస్తే ఎంత ప్రీమియం వసూలు చేయాలనే నిర్ణయానికి వస్తుంది. ఒకవేళ పాలసీదారుడు సరైన సమాచారాన్ని తెలియజేయలేదనుకుందాం. అప్పుడు ఒకవేళ క్లెయిమ్ సమయంలో తప్పుడు సమాచారం ఇచ్చినట్టు తేలితే.. బీమా ఒప్పందం రద్దయ్యే అవకాశం ఉంటుంది. అదే జరిగితే నష్టపరిహారం ఇవ్వడానికి కూడా నిరాకరించవచ్చు.

మీ పైనే ఆ బాధ్యతంతా..
ఇందాక చెప్పినట్టుగా కొన్ని పరిమితులకు లోబడి జీవిత బీమా పాలసీలు ఎలాంటి వైద్య పరీక్షలు కొరకపోవచ్చు. ఇలాంటప్పుడు పాలసీదారుడి సమాచారం మేరకే బీమా కంపెనీ నిర్ణయాలు ఆధారపడి ఉంటాయి. కాబట్టి దరఖాస్తు పత్రంలో ఉన్న ప్రశ్నలకు జాగ్రత్తగా సమాధానం ఇవ్వడం మంచిది. సాధారణంగా 45 ఏళ్లు దాటిన వారు రూ.30 లక్షల పైన బీమా హామీ ఉన్న పాలసీలు తీసుకుంటే.. వారికి వైద్య పరీక్షలు తప్పనిసరి కావచ్చు. ఈ విషయం కంపెనీని బట్టి మారుతుంది. ఏదేమైనా ఉన్న నిజాలు చెప్పడం మంచిది. బీమా కంపెనీలు ప్రీమియం నిర్ణయించేప్పుడు అనేక విషయాలను పరిగణనలోకి తీసుకుంటాయి. ఆరోగ్య పరిస్థితులు ఇందులో ముఖ్యమైన అంశం. ఒకవేళ వైద్య పరీక్షలు ఉంటే దాని రిపోర్టులను బట్టి ప్రీమియం మారుతుంది.

పాలసీ తీసుకున్నాక అనారోగ్యం ఏర్పడితే?
పాలసీ తీసుకున్నాక తరువాత పాలసీదారుడు ఏదైనా అనారోగ్యం బారిన పడితే అప్పుడు ఏం చేయాలి? చాలా మందికి ఈ సందేహం ఉంటుంది. ఇది తప్పనిసరి అయితే కాదు. కాకపోతే కంపెనీకి తెలియజేయడం మంచిదే. ఇలా తెలపడం వల్ల మీకు రెన్యువల్ ప్రీమియంలో పెరుగుదల ఉండదు.

ఫలితం ఉండదు..
బీమా పాలసీ అంటేనే కష్టకాలంలో కుటుంబానికి ఆర్థికంగా అండగా ఉండేందుకు తీసుకునేది. ఒకవేళ సరైన వివరాలు ఇవ్వకుండా పాలసీ తీసుకుంటే పైన తెలిపినట్టుగా కుమార్ కుటుంబానికి వచ్చిన పరిస్థితి ఎవరికైనా రావచ్చు. ఇలాంటప్పుడు మీ ప్రాథమిక ఉద్దేశం నెరవేరదు. అందుకే, పాలసీ తీసుకునే సమయంలో అన్ని వివరాలను సరిగ్గా ఇవ్వండి. కాస్త ప్రీమియం ఎక్కువ అయినా ఫర్వాలేదు. కష్టకాలంలో బీమా తోడుగా నిలుస్తుంది.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.