ETV Bharat / business

పేటీఎం నయా ఫీచర్​తో ట్రైన్​ టికెట్స్ కన్ఫార్మ్​ కావడం గ్యారెంటీ! - paytm diwali offers 2023

Paytm New Train Booking Feature In Telugu : రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్​. ప్రముఖ పేమెంట్ ప్లాట్​ఫాం పేటీఎం 'గ్యారెంటీడ్​ సీట్ అసిస్టెన్స్​​' అనే ఫీచర్​ను అందుబాటులోకి తెచ్చింది. దీనితో ఇకపై మీ ట్రైన్​ టికెట్స్​ కచ్చితంగా కన్ఫార్మ్ అవుతాయి. పూర్తి వివరాలు మీ కోసం.

paytm confirm train ticket feature
Paytm New Train Booking Feature
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 2, 2023, 1:16 PM IST

Paytm New Train Booking Feature : రైలు ప్రయాణికులను వేధించే సమస్య టికెట్స్ కన్ఫార్మ్ అవుతాయా? లేదా? అని. చాలా సార్లు వెయిటింగ్ లిస్ట్​లోనే ఉండి, చివరికి కన్ఫార్మ్ కాకుండా పోతాయి. పండుగల సీజన్​లో అయితే.. మరీ దారుణంగా ఉంటుంది. అందుకే ఈ సమస్యను నివారించేందుకు.. ప్రముఖ పేమెంట్ యాప్​ పేటీఎం 'గ్యారెంటీడ్​ సీట్ అసిస్టెన్స్' ఫీచర్​ను అందుబాటులోకి తెచ్చింది. దీనితో మీ ట్రైన్ టికెట్స్​ కన్ఫార్మ్ కావడం గ్యారెంటీ అని​ పేటీఎం చెబుతోంది. మరి అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందామా?

మల్టిపుల్ ఆప్షన్స్​!
పేటీఎం గ్యారెంటీడ్​ సీట్ అసిస్టెన్స్ ఫీచర్​ ద్వారా మీరు బహుళ రైలు ఎంపికల (మల్టిపుల్​ ట్రైన్​ ఆప్షన్స్​)ను ఎంచుకోవచ్చు. దీని వల్ల టికెట్ కన్ఫార్మ్ అవుతుందా? లేదా? అనే సమస్యకు చెక్​ పడుతుంది. పెద్ద వెయిటింగ్​ లిస్ట్ ఉంటుందనే ఆందోళన కూడా తగ్గుతుంది.

పేటీఎం ప్రకారం, ఈ నయా ఫీచర్​ ఉపయోగించి మీరు వివిధ బోర్డింగ్ స్టేషన్ల నుంచి ప్రత్యామ్నాయ (ఆల్టర్నేటివ్​) రైలు టికెట్స్ బుకింగ్ చేసుకోవచ్చు. దీని వల్ల మీకు టికెట్ కన్ఫార్మ్ అయ్యే అవకాశం బాగా పెరుగుతుంది.

పేటీఎంలో కన్ఫార్మ్​డ్​ ట్రైన్ టికెట్ బుక్​ చేయండిలా!
How To Book Confirm Train Ticket In Paytm :

  • ముందుగా మీరు Paytm యాప్​ ఓపెన్ చేయండి.
  • మీ గమ్యస్థానానికి వెళ్లే ట్రైన్స్​ గురించి సెర్చ్ చేయండి.
  • మీరు ఎంచుకున్న ట్రైన్​ టికెట్​.. వెయిటింగ్ లిస్ట్​లో ఉంటే.. ఆల్టర్నేటివ్ స్టేషన్​ నుంచి ట్రైన్ టికెట్ బుక్ చేసే ప్రయత్నం చేయవచ్చు.
  • ఇందుకోసం.. మీకు సమీపంలో ఉన్న ప్రత్యామ్నాయ స్టేషన్లలో ట్రైన్ టికెట్స్ అందుబాటులో ఉన్నాయో? లేదో? చెక్​ చేయండి.
  • ఒక వేళ టికెట్స్ అందుబాటులో ఉంటే.. సదరు బోర్డింగ్ స్టేషన్​ నుంచి టికెట్స్​ బుక్​ చేసుకోండి. దీనితో మీ టికెట్​ కన్ఫార్మ్ అవుతుంది.

యూపీఐ పేమెంట్స్​!
Paytm UPI Payment Facility : రైలు ప్రయాణికులు ఎలాంటి గేట్​వే రుసుములు చెల్లించకుండా.. యూపీఐ పేమెంట్స్ చేయవచ్చని పేటీఎం పేర్కొంది. అంతేకాదు. పేటీఎం యాప్​లో లైవ్ ట్రైన్​ ట్రాకింగ్​, పీఎన్​ఆర్​ స్టేటస్ కూడా తెలుసుకోవచ్చని వివరించింది.

పేటీఎం ట్రావెల్ కార్నివాల్ డిస్కౌంట్స్​!
Paytm Travel Carnival Discount Offer : పేటీఎం అక్టోబర్ 27 నుంచి నవంబర్​ 5 వరకు ట్రావెల్ కార్నివాల్​ సేల్​ కింద ఫ్లైట్​ బుకింగ్స్​పై మంచి డిస్కౌంట్స్ అందిస్తోంది. దేశీయ ప్రయాణాలు చేసేవారికి ఫ్లైట్​ టికెట్​పై 15 శాతం, విదేశీ ప్రయాణం చేసేవారికి ఫ్లైట్ టికెట్​పై 10 శాతం వరకు డిస్కౌంట్ ఇస్తోంది. ఇండిగో, విస్తారా, ఎయిర్​ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్​ప్రెస్​, స్పైస్​జెట్​, స్టార్​ ఎయిర్​ ఫ్లైట్​ టికెట్స్ బుక్ చేసుకున్నవారికి ఈ డిస్కౌంట్స్ లభిస్తాయి.

బ్యాంక్ ఆఫర్స్!
పేటీఎం ద్వారా ట్రావెల్ బుకింగ్స్ చేసేవారికి.. ఐసీఐసీఐ బ్యాంక్​, ఇండస్​ఇండ్​ బ్యాంక్​, ఆర్​బీఎల్​ బ్యాంక్​, హెచ్​ఎస్​బీసీ బ్యాంక్​ ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. విద్యార్థులకు, సీనియర్ సిటిజన్స్​కు, సాయుధ దళాల్లో పనిచేసేవారికి స్పెషల్ డిస్కౌంట్స్​ ఇస్తోంది పేటీఎం.

ట్రైన్ టికెట్ కన్ఫార్మ్ కాకుంటే.. 3 రెట్లు డబ్బులు వాపస్​!
How To Book Confirm Train Ticket In MakeMyTrip : 'మేక్​ మై ట్రిప్' వెబ్​సైట్​ కూడా రైలు ప్రయాణికులకు బంపర్ ఆఫర్స్​ అందిస్తోంది. ఈ వెబ్​సైట్​లో మీకు 100% ట్రైన్ టికెట్ కన్ఫార్మడ్​ ఆప్షన్ ఉంటుంది. ఒక వేళ మీకు టికెట్ కన్ఫార్మ్ కాకపోతే.. 3 రెట్లు వరకు డబ్బులు వాపస్ ఇస్తారు. మరి అదెలాగో ఇప్పుడు చూద్దామా?

  • ముందుగా మీరు MakeMyTrip యాప్ ఓపెన్ చేయండి.
  • మీరు వెళ్లాలని అనుకుంటున్న ట్రైన్​ను సెలెక్ట్ చేసుకోవాలి.
  • 'బుక్ ట్రైన్​ టికెట్స్'​ ఆప్షన్​ను క్లిక్ చేయాలి.
  • మీ బోర్డింగ్ పాయింట్ స్టేషన్​​ - వెళ్లాల్సిన స్టేషన్​ వివరాలు సహా ప్రయాణించాల్సిన తేదీని నమోదు చేయాలి.
  • వెంటనే అందుబాటులో ఉన్న ట్రైన్స్ అన్నీ కనిపిస్తాయి.
  • ఆ ట్రైన్స్​లో కొన్నింటికి ట్రిప్ గ్యారెంటీ అనే ట్యాగ్​ కనిపిస్తూ ఉంటుంది.
  • అలా గ్యారెంటీ ఉన్న టికెట్స్​ను బుక్​ చేసుకోవాలి. అది ఆర్​ఏసీలో ఉన్నా, వెయిటింగ్ లిస్ట్​లో ఉన్నా.. ఛార్ట్ ప్రిపేర్ అయ్యే సమయానికి కన్ఫార్మ్ అవుతుంది.
  • ఒక వేళ టికెట్​ కన్ఫార్మ్ అవ్వకపోతే.. మీరు టికెట్ కోసం ఎంతైతే డబ్బులు చెల్లించారో.. ఆ సొమ్ముపై మూడు రెట్లు వరకు డబ్బులు వాపస్ ఇస్తారు.

దీపావళి ఆఫర్ - హీరో బైక్‌, స్కూటీలపై భారీ తగ్గింపు!

కారు కొనడానికి లోన్‌ కావాలా? తక్కువ వడ్డీకే ఎస్‌బీఐ రుణం! ఈజీ ఈఎంఐ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.