ETV Bharat / business

NPS New Rule : ఎన్​పీఎస్​ ఖాతాదారులకు అలర్ట్​.. ఇకపై పెన్నీ డ్రాప్ వెరిఫికేషన్​ తప్పనిసరి.. - పెన్నీ డ్రాప్​ వెరిఫికేషన్ అంటే ఏమిటి

NPS New Rule In Telugu : ఎన్​పీఎస్​ చందాదారులకు అలర్ట్​. పీఎఫ్​ఆర్​డీఏ 'పెన్నీ డ్రాప్​ వెరిఫికేషన్​'ను తప్పనిసరి చేసింది. ఎన్​పీఎస్​ నిధుల ఉపసంహరణలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండడం కోసమే ఈ విధానాన్ని తీసుకువచ్చింది. పూర్తి వివరాలు మీ కోసం.

what is penny drop verification
NPS New Rule
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 30, 2023, 7:25 PM IST

NPS New Rule : ఎన్​పీఎస్​, అటల్ పెన్షన్​ యోజన, ఎన్​పీఎస్​ లైట్​ చందాదారులకు అలర్ట్​. పెన్షన్‌ ఫండ్‌ రెగ్యులేటరీ అండ్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (PFRDA).. పెన్నీ డ్రాప్​ వెరిఫికేషన్​ను తప్పనిసరి చేసింది. నేషనల్‌ పెన్షన్‌ సిస్టమ్‌ (NPS) చందాదారులకు సరైన సమయంలో, ఎలాంటి అవాంతరాలు లేకుండా నిధులు జమయ్యేలా చేయడం కోసమే ఈ కీలక నిర్ణయం తీసుకుంది. దీనితో ఇకపై బ్యాంకు ఖాతా వివరాల తక్షణ తనిఖీ తప్పనిసరి అయ్యింది.

పెన్నీ డ్రాప్‌ వెరిఫికేషన్​ అంటే ఏమిటి?
What Is Penny Drop Verification : ఎన్‌పీఎస్‌ చందాదారుల పొదుపు ఖాతా స్థితి, వివరాలను తనిఖీ చేయడానికి ‘సెంట్రల్‌ రికార్డ్‌ కీపింగ్‌ ఏజెన్సీలు ఉపయోగించే పద్ధతినే ‘పెన్నీ డ్రాప్‌’ వెరిఫికేషన్‌ అంటారు. మీరు సమర్పించిన ‘పర్మనెంట్ రిటైర్‌మెంట్‌ అకౌంట్‌ నెంబర్‌ (PRAN)’ సహా ఇతర పత్రాల్లో ఉన్న వివరాలు.. బ్యాంకు ఖాతాలో ఉన్న వివరాలు ఓకేలా ఉన్నాయా? లేదా? అనేది ఈ విధానంలో పరిశీలిస్తారు. ఎన్‌పీఎస్‌, అటల్‌ పెన్షన్‌ యోజన, ఎన్‌పీఎస్‌ లైట్‌ చందాదారులకు ఈ కొత్త నిబంధన వర్తిస్తుంది. ఎన్‌పీఎస్‌ నుంచి పాక్షిక నిధుల ఉపసంహరణ, ఎన్‌పీఎస్‌ నుంచి మధ్యలో వైదొలగడం, బ్యాంకు ఖాతా వివరాల్లో మార్పు లాంటి వాటి కోసం దరఖాస్తు చేసుకున్న సమయంలో ఈ పెన్నీ డ్రాప్‌ పద్ధతి ద్వారా వివరాలను ధ్రువీకరించుకుంటారు.

టెస్ట్ ట్రాన్సాక్షన్​
పెన్నీ డ్రాప్‌ వెరిఫికేషన్​లో భాగంగా మీ బ్యాంకు ఖాతా యాక్టివ్‌గా ఉందో? లేదో? తెలుసుకోవడానికి తొలుత టెస్ట్‌ ట్రాన్సాక్షన్‌ చేస్తారు. అంటే చిన్న మొత్తంలో డబ్బును ఖాతాదారుని బ్యాంకు అకౌంట్​లో జమ చేస్తారు. అదే సమయంలో ఖాతాదారుని పేరు సహా ఇతర వివరాలు సరిపోలాయో? లేదో? చెక్​ చేస్తారు. సరళంగా చెప్పాలంటే, ఎన్‌పీఎస్‌ నిధులు జమ కావాలంటే.. పెన్నీ డ్రాప్‌ విధానంలో బ్యాంకు ఖాతాను కచ్చితంగా వెరిఫై చేసుకోవాలి.

విఫలమైతే పరిస్థితి ఏంటి?
పెన్నీ డ్రాప్‌ వెరిఫికేషన్‌లో విఫలమైతే.. నిధుల ఉపసంహరణ, బ్యాంకు ఖాతా వివరాల మార్పు లాంటి వాటి కోసం చేసుకున్న దరఖాస్తును పీఎఫ్‌ఆర్‌డీఏ మధ్యలోనే నిలిపివేస్తుంది. అలాంటప్పుడు సీఆర్‌ఏలు సంబంధిత కార్యాలయాలను సంప్రదించి పొరపాట్లను సరిదిద్దుకునేలా చందాదారులను అప్రమత్తం చేస్తాయి. అలాగే బ్యాంక్‌ ఖాతా పెన్నీ డ్రాప్‌ వెరిఫికేషన్‌ విఫలమైనట్లు ఎస్‌ఎంఎస్‌లు, ఈమెయిల్స్‌ ద్వారానూ పీఎఫ్‌ఆర్‌డీఏ తెలియజేస్తుంది. కొన్ని సందర్భాల్లో ఎన్‌పీఎస్‌ వద్ద సమర్పించిన పత్రాల్లోని వివరాలు, బ్యాంకు ఖాతా వివరాలతో సరిపోలకపోవడంతో చందాదారులకు నిధులు జమ కావడం లేదు. దీన్ని నివారించడం కోసమే పీఎఫ్‌ఆర్‌డీఏ పెన్నీ డ్రాప్‌ పద్ధతి అమలు చేయాలని నిర్ణయించింది.

TCS vs TDS : టీడీఎస్​, టీసీఎస్ మధ్య తేడా ఏమిటి?​.. టాక్స్​ రిఫండ్​ను ఎలా​ క్లెయిమ్ చేసుకోవాలి?

IT Layoffs In India 2023 : 6 నెలల్లోనే 52వేల ఉద్యోగాలు లాస్.. భారతీయ ఐటీ కంపెనీల్లో ఏం జరుగుతోంది?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.