ETV Bharat / business

ఇన్​కం ట్యాక్స్​ రీఫండ్ రాలేదా? ఇవి తెలుసుకోండి..

Income Tax Refund: గత ఆర్థిక సంవత్సరం ఇన్​కం ట్యాక్స్ రిటర్నులు దాఖలు చేసిన వారికి రీఫండ్ ఇప్పటికే వచ్చింది. అయితే చాలా మందికి పలు కారణాల వల్ల ఇది నిలిచిపోయి ఉండవచ్చు. అలాంటి వారు ఓసారి ఈ విషయాలను పరిశీలించి ఐటీ శాఖను సంప్రదించండి.

No Income Tax Refund?
ఇన్​కం ట్యాక్స్​ రిఫండ్​
author img

By

Published : Mar 29, 2022, 2:35 PM IST

Tax Refund Delay Reasons: చెల్లించాల్సిన ఆదాయపు పన్నుకు మించి జమ చేసినప్పుడు రిటర్నులు దాఖలు చేసి, రీఫండు కోరాల్సి ఉంటుంది. గత ఆర్థిక సంవత్సరం అంటే.. 2020-21కి గాను (2021-22 అసెస్‌మెంట్‌ ఇయర్‌) రిటర్నులు దాఖలు చేసిన వారికి ఎంతో మందికి రీఫండు ఇప్పటికే వచ్చింది. కొంత మందికి సాంకేతిక కారణాల వల్ల అందలేదు. ఈ జాబితాలో మీరూ ఉంటే ఈ అంశాలను పరిశీలించండి.

  • పన్ను బాకీ ఉంటే: క్రితం ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి చెల్లించాల్సిన పన్ను బాకీ ఉంటే.. ఆదాయపు పన్ను విభాగం రీఫండును నిరాకరిస్తుంది. దీనికి సంబంధించి పన్ను చెల్లింపుదారులకు నోటీసులూ జారీ చేస్తుంది. మీకు ఇలాంటి నోటీసులేమైనా వచ్చాయా చూసుకోండి. వీటికి వ్యవధి లోపు సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత ఉంటుంది. మీరిచ్చిన జవాబు ఆధారంగా పన్ను బాకీ పోను, మిగతా మొత్తం రీఫండునిస్తుంది.
  • బ్యాంకు ఖాతాలో పొరపాటు: రిటర్నులు దాఖలు చేసేటప్పుడు బ్యాంకు ఖాతా వివరాల్లో తప్పులు దొర్లినా రీఫండు జమ కాకపోవచ్చు. ఈ వివరాలనూ ఒకసారి తనిఖీ చేసుకోండి.
  • ఈ-వెరిఫై చేయకుండా: రిటర్నులు దాఖలు చేసినప్పటికీ.. దానిని ఈ-వెరిఫై చేయకుంటే రీఫండు రాదు. రిటర్నులు దాఖలు చేసిన 120 రోజుల్లోగా ఈ ప్రక్రియ పూర్తి చేయకపోతే.. అది చెల్లదు. కాబట్టి, వెంటనే ఈ-వెరిఫై చేయండి.
  • అదనపు వివరాలు: మీ రీఫండుకు సంబంధించి ఆదాయపు పన్ను విభాగానికి కొన్ని సందేహాలు రావొచ్చు. వాటిని నివృత్తి చేసుకునేందుకు అదనంగా కొన్ని వివరాలు కోరొచ్చు. ఇన్‌కంట్యాక్స్‌ వెబ్‌సైటులోకి లాగిన్‌ అయినప్పుడు ఈ వివరాలు తెలుస్తాయి. వీటికి తగిన సమాధానాలు ఇవ్వాలి.
  • అర్హత లేకపోయినా: కొన్నిసార్లు మీరు చేసిన లెక్కలకూ, ఆదాయపు పన్ను విభాగం దగ్గర ఉన్న లెక్కలకూ మధ్య వ్యత్యాసం ఉండొచ్చు. ఇలాంటి సందర్భాల్లో రిఫండును నిరాకరించే అవకాశం ఉంది. ఆదాయపు పన్ను వెబ్‌సైటులోకి లాగిన్‌ అయి.. ‘పెండింగ్‌ యాక్షన్‌’లో ఏమైనా అదనపు వివరాలు అడిగారా అన్నది చూసి, దానికి తగ్గట్టుగా స్పందించండి.

ఇదీ చదవండి: మరో దిగ్గజ సంస్థకు సీఈఓగా భారత సంతతి వ్యక్తి ​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.