ETV Bharat / business

No Ban on Laptop Imports : ల్యాప్​టాప్​ దిగుమతులపై నో బ్యాన్.. కానీ​ ఇంపోర్ట్​ లైసెన్స్​ మస్ట్​!

author img

By

Published : Aug 5, 2023, 12:04 PM IST

No ban on laptop imports : కేంద్ర ప్రభుత్వం ల్యాప్​టాప్స్​, ట్యాబ్లెట్స్, ఐటీ హార్డ్​వేర్​ పరికరాలపై ఎలాంటి బ్యాన్​ విధించలేదని ఐటీ మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి తెలిపారు. అయితే ఈ దిగుమతులకు సంబంధించిన అనుమతుల (లైసెన్స్) కోసం DGFT పోర్టల్​లో అప్లై చేసుకోవాలని స్పష్టం చేసింది. పూర్తి వివరాలు మీ కోసం..

Ban On Laptop Imports
No ban on laptop imports

Laptop Ban In India Issue : ల్యాప్​టాప్స్​, ట్యాబ్లెట్స్​, ఐటీ హార్డ్​వేర్ మొదలైన​ దిగుమతులపై కేంద్ర ప్రభుత్వం ఎలాంటి బ్యాన్ విధించలేదని ఐటీ మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి తెలిపారు. కనుక కంపెనీలు, వ్యాపారస్తులు ఈ ఐటీ హార్డ్​వేర్​ పరికరాలను, వస్తువులను ఎలాంటి ఆటంకం లేకుండా దిగుమతి చేసుకోవచ్చని ఆయన స్పష్టం చేశారు.

దిగుమతులపై ఆంక్షలు
Laptop and tablet import ban : కేంద్ర ప్రభుత్వం HSN 8741 కేటగిరీ కిందకు వచ్చే ల్యాప్​టాప్స్​, ట్యాబ్లెట్స్​, పర్సనల్​ కంప్యూటర్స్​ దిగుమతులపై తక్షణ ఆంక్షలు విధిస్తూ గురువారం నోటిఫికేషన్​ విడుదల చేసింది. కానీ తరువాత ఈ విషయంలో కొన్ని సడలింపులు చేస్తూ నిర్ణయం తీసుకుంది.

లైసెన్స్​ తీసుకోవాలి!
DGFT Website India : వాస్తవానికి విదేశాల నుంచి ల్యాప్​టాప్స్​, ట్యాబ్లెడ్స్​ లాంటి ఎలక్ట్రానిక్​ వస్తువులను దిగుమతి చేసుకోవాలంటే.. కచ్చితంగా అందుకు తగిన లైసెన్స్​ తీసుకోవాలి. ఈ లైసెన్స్​ కోసం డైరెక్టరేట్​ జనరల్​ ఆఫ్​ ఫారిన్ ట్రేడ్​ (DGFT)కు సంబంధించిన లైసెన్స్ పోర్టల్​లో అప్లై చేసుకుంటే.. కేవలం 5 నిమిషాల్లోనే లైసెన్స్​ మంజూరు అవుతుందని ఐటీ మంత్రిత్వశాఖ కార్యదర్శి తెలిపారు. ఈ లైసెన్స్​ ఒక సంవత్సరం పాటు చెల్లుబాటులో ఉంటుందని కూడా ఆయన స్పష్టం చేశారు.

'ఇప్పటికే రెండు కంపెనీలు ల్యాప్​టాప్​, పీసీ, ట్యాబ్లెట్​ దిగుమతుల లైసెన్స్​ కోసం దరఖాస్తు చేశాయి. అందులో ఒక కంపెనీ మల్టిపుల్​ లైసెన్స్​ కోసం కూడా అప్లై చేసింది' అని ఐటీ మంత్రిత్వశాఖ కార్యదర్శి తెలిపారు.

రెండు రోజుల్లో లైసెన్స్​
DGFT License For Imports : ప్రస్తుతం DGFT కు చెందిన పోర్టల్​లో ఐటీ హార్డ్​వేర్​ దిగుమతుల లైసెన్స్​ కోసం అప్లై చేసుకోవచ్చు. వాస్తవానికి దీనిలో కేవలం 5 నిమిషాల్లోనే లైసెన్స్​ మంజూరు అవుతుందని మినిస్ట్రీ ఆఫ్​ ఎలక్ట్రానిక్స్​ అండ్​ ఐటీ శాఖ తెలిపింది. కానీ ఈ పోర్టల్​లో అప్లై చేసిన వారికి 1 లేదా 2 రోజుల్లో లైసెన్సులు మంజూరు చేస్తామని DGFT పేర్కొంది.​

ధరలు పెరిగే అవకాశం ఉందా?
Laptop Cost in India : ల్యాప్​టాప్​, పీసీ, ట్యాబ్లెట్లపై బ్యాన్ విధించినట్లు వార్తలు రాగానే.. మార్కెట్లో వీటి ధరలకు రెక్కలు వస్తాయని అందరూ భావించారు. కానీ ఈ ఎలక్ట్రానిక్​ వస్తువులు ధరలు పెరగవని, వీటి దిగుమతుల్లోనూ ఎలాంటి అంతరాయం ఏర్పడదని ఐటీ శాఖ అధికార ప్రతినిధి స్పష్టం చేశారు. ఇప్పటికే HP సహా 44 కంపెనీలు PLI 2.0 స్కీమ్ కింద నమోదు చేసుకున్నాయని, అందువల్ల వీటి దిగుమతులకు కూడా ఎలాంటి ఆటంకం ఉండదని ఆయన తెలిపారు.

దేశీయంగా ఐటీ హార్డ్​వేర్​ తయారీ
IT Hardware Production in India : 'భారతదేశానికి ఐటీ హార్డ్​వేర్​ పరికారల తయారీకి తగిన శక్తి, సామర్థ్యాలు ఉన్నాయి. PLI 2.0 స్కీమ్​ ద్వారా రూ.3,29,000 కోట్ల విలువైన ఉత్పత్తులు తయారుచేసే అవకాశం ఉంది. అలాగే రూ.2,740 కోట్ల అదనపు పెట్టుబడులు వచ్చే అవకాశం కూడా పుష్కలంగా ఉంది. ఇదే సాకారం అయితే దేశంలో 75,000 వరకు అదనపు ఉద్యోగాలను సృష్టించవచ్చు. దీని వల్ల దేశీయంగా ఐటీ హార్డ్​వేర్ పరికరాల ఉత్పత్తి పెరుగుతుంది. ఫలితంగా వాటి ధరలు బాగా తగ్గి, వినియోగదారులకు చౌకగా లభిస్తాయి' అని ఐటీ మంత్రిత్వశాఖ స్పష్టం చేసింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.