New Launch Electric Scooters : ప్రముఖ వాహన కంపెనీలతో పాటు స్టార్టప్ సంస్థలు త్వరలోనే సరికొత్త ఈవీ బైక్‌లను మార్కెట్లో లాంఛ్ చేయబోతున్నాయి. వినియోగదారులను దృష్టిలో ఉంచుకొని దిగ్గజ కంపెనీలు.. లేటెస్ట్ ఫీచర్స్‌తో ఈవీలను అందుబాటులోకి తీసుకురానున్నాయి. వీటికి సంబంధించి ఫొటోలను ఆయా కంపెనీలు ఇప్పటికే విడుదల చేశాయి. మరి త్వరలోనే ఈవీ ప్రియులను పలకరించనున్న కొత్త మోడల్ బైక్‌ల గురించి ఇప్పుడు తెలుసుకుందామా!
1. హీరో విదా ఎలక్ట్రిక్ స్కూటర్..
Hero Electric Vida V1 : హీరో మోటార్ కార్ప్ కంపెనీ ఇప్పటికే ఈవీ రంగంలో కొత్త ఒరవడి సృష్టించింది. వివిధ రకాల మోడల్స్‌ను పరిచయం చేయడానికి హీరో ఈవీ ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగించుకుంటోంది. ఇప్పుడు సరికొత్త 'విదా' మోడల్‌ను 2024లో మార్కెట్లోకి అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ప్రస్తుతం ఉన్న V1 మోడల్‌కి ఈ విదా స్కూటర్ కొత్త వేరియంట్. బ్యాటరీ కెపాసిటీ, ధర, ఫీచర్స్ల ఆధారంగా వినియోగదారులు ఎంపిక చేసుకునే విధంగా.. కంపెనీ ఈ స్కూటర్‌ను రూపొందిస్తోంది.
2. బజాజ్ చేతక్..
Bajaj Chetak : ఈవీ రంగంలో బజాజ్ ఇప్పటి వరకు ఒకే స్కూటర్‌ను విడుదల చేసింది. కొన్ని నెలల కింద ఈ చేతక్‌కు మరిన్ని హంగులు జోడించి.. చేతక్ ప్రీమియం పేరుతో లాంఛ్ చేసింది. కాగా బజాజ్ ఈవీ రంగంలో మరిన్ని సరికొత్త ఆవిష్కరణలతో దూసుకుపోవాలని భావిస్తూ.. ఆ దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడున్న చేతక్‌కు భిన్నంగా బ్యాటరీ, డిజైన్, ఫీచర్స్‌తో మార్కెట్లోకి నయా ఈవీని విడుదల చేయాలని ప్లాన్ చేస్తోంది.
3. ఓలా ఎలక్ట్రిక్..
Ola S1 Air : 2023 జులైలో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను లాంఛ్ చేసేందుకు ఓలా సన్నాహాలు చేస్తోంది. ఎస్1 ఎయిర్ అనే పేరుతో మార్కెట్లోకి లాంఛ్ చేయనుంది. ఇప్పుడున్న ఉన్న S1, S1 ప్రో మోడల్ స్కూటర్లు ఐదు రంగుల్లో పది వేరియంట్లలో అందుబాటులో ఉన్నాయి. కాగా వీటికి అదనంగా మరో రెండు కొత్త రంగుల్లో ఈ వాహనాన్ని అందుబాటులోకి తీసుకురానుంది. 4.5kW బ్యాటరీ సామర్థ్యంతో ఈ స్కూటర్‌ను రూపొందించారు.
-
Ready for all roads. Even no roads.
— Ola Electric (@OlaElectric) June 22, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
S1 Air with twin fork suspension. Coming this July.#EndICEage pic.twitter.com/CGXobgJRSI
">Ready for all roads. Even no roads.
— Ola Electric (@OlaElectric) June 22, 2023
S1 Air with twin fork suspension. Coming this July.#EndICEage pic.twitter.com/CGXobgJRSIReady for all roads. Even no roads.
— Ola Electric (@OlaElectric) June 22, 2023
S1 Air with twin fork suspension. Coming this July.#EndICEage pic.twitter.com/CGXobgJRSI
4. సింపుల్ ఎనర్జీ..
Simple Energy One : బెంగళూరుకు చెందిన స్టార్టప్ కంపెనీ 'సింపుల్ వన్'.. దేశంలో మరో రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లను విడుదల చేయనుంది. నూతన ఫీచర్స్‌తో ఈ స్కూటర్లు విడుదల కానున్నాయి. కాగా ఈ సింపుల్ వన్ స్కూటర్ ధరను రూ.1.45 లక్షలు (ఎక్స్ షోరూం) గా నిర్ణయించారు. ఒక్కసారి ఫుల్ బ్యాటరీ ఛార్జ్‌తో ఈ స్కూటర్ 212 కిలో మీటర్లు ప్రయాణిస్తుంది.
5. హోండా యాక్టివా ఈ వెహికిల్..
Honda EV : 2024 ఆర్థిక సంవత్సరంలో హోండా నుంచి రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లు మార్కెట్లోకి రానున్నాయి. ఈ రెండు ఈవీలను పూర్తిగా భారత్‌లోనే తయారుచేయనున్నట్లు సంస్థ తెలిపింది. ఒకటి 'యాక్టివా ఎలక్ట్రిక్' పేరుతో విడుదల కానుంది. కాగా రెండో స్కూటర్‌ను బ్యాటరీ మార్చుకోగలిగే విధంగా రూపొందిస్తున్నట్లు సమాచారం.