ETV Bharat / business

కొత్త ఏడాదిలో క్రెడిట్ కార్డ్ రూల్స్ ఛేంజ్​ - ఇకపై లాంజ్ యాక్సెస్​ కష్టమే!

New Credit Card Rules In Telugu : నూతన సంవత్సరంలో పలు బ్యాంకులు క్రెడిట్ కార్డు నియమనిబంధనలు మార్చాయి. క్రెడిట్ కార్డ్ యూజర్లకు ఇచ్చే కాంప్లిమెంటరీ లాంజ్ యాక్సెస్​, రివార్డ్ పాయింట్స్, వోచర్స్​ సహా అన్ని బెనిఫిట్స్​పైనా పరిమితులు విధించాయి. వాటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

New credit card rules 2024
New credit card rules in India
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 9, 2024, 3:27 PM IST

New Credit Card Rules : దేశంలోని పలు బ్యాంకులు ఈ 2024 సంవత్సర ప్రారంభంలోనే తమ క్రెడిట్​ కార్డు నియమనిబంధనల్లో అనేక మార్పులు చేశాయి. క్రెడిట్ కార్డ్ హోల్డర్లకు ఇచ్చే రివార్డ్​ పాయింట్స్​, వోచర్స్​, కాంప్లిమెంటరీ లాంజ్ యాక్సెస్​ సహా పలు బెనిఫిట్స్​పై పరిమితులు విధించాయి. ముఖ్యంగా ఎస్​బీఐ, హెచ్​డీఎఫ్​సీ, ఐసీఐసీఐ, యాక్సిస్ బ్యాంకులు తమ క్రెడిట్ కార్డులపై ఇచ్చే బెనిఫిట్స్​ను గణనీయంగా తగ్గించాయి. వాటి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

SBI Credit Card Rules :

  • ఎస్​బీఐ కార్డ్ వెబ్​సైట్ ప్రకారం, 2024 జనవరి 1 నుంచి 'పేటీఎం ఎస్​బీఐ క్రెడిట్ కార్డు'లతో చేసే అద్దె చెల్లింపులపై ఎలాంటి క్యాష్​బ్యాక్స్​ అందించరు.
  • ఎస్​బీఐ సింప్లీకిక్​, సింప్లీక్లిక్ అడ్వాంటేజ్​ క్రెడిట్​ కార్డులపై ఇచ్చే రివార్డు పాయింట్లపై కూడా పరిమితిలు విధించారు. ఈ క్రెడిట్ కార్డులు ఉపయోగించి ఈజీడిన్నర్​ యాప్​లో ఆర్డర్​ చేస్తే, ఇందకు ముందు 10X రివార్డ్ పాయింట్లు ఇచ్చేవారు. కానీ ఇప్పుడు వాటిని సగానికి (5X రివార్డ్ పాయింట్లకు) తగ్గించారు.
  • అయితే అపోలో 24x7, బుక్ ​మై షో, క్లియర్​ట్రిప్​, డోమినోస్​, మింత్రా, నెట్​మెడ్స్​, యాత్రా యాప్​ల్లో చేసే ఆన్​లైన్ కొనుగోళ్లపై 10X రివార్డ్ పాయింట్లనే కొనసాగిస్తున్నారు.

HDFC Credit Card Rules : హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​ తమ Regalia, Millenia క్రెడిట్ కార్డ్ బెనిఫెట్స్​పై అనేక పరిమితులు విధించింది. వాస్తవానికి ఇవి 2023 డిసెంబర్ 1 నుంచే అమలులోకి వచ్చాయి.

  • HDFC Regalia Credit Card Benefits : హెచ్​డీఎఫ్​సీ రెగాలియా క్రెడిట్​పై ఇచ్చే కాంప్లిమెంటరీ లాంజ్ యాక్సెస్​ విషయంలో చాలా మార్పులు చేశారు. ఈ కార్డు యూజర్లు మూడు నెలల వ్యవధిలో ఒక లక్ష రూపాయలు లేదా అంత కంటే ఎక్కువ మొత్తం ఖర్చు చేస్తే, వారికి 2 కాంప్లిమెంటరీ లాంజ్​ యాక్సెస్​ వోచర్స్ లభిస్తాయి. అది కూడా క్యాలెండర్ క్వార్టర్స్​లో అంటే జనవరి-మార్చి/ ఏప్రిల్​-జూన్/ జులై-సెప్టెంబర్​/అక్టోబర్​-డిసెంబర్ వ్యవధుల్లోనే ఈ ఎలిజిబిలిటీని సాధించాల్సి ఉంటుంది.
  • HDFC Millennia Credit Card Benefits : హెచ్​డీఎఫ్​సీ మిలీనియా క్రెడిట్​ కార్డుతో మీరు చేసే ఖర్చుల ఆధారంగా బెనిఫిట్స్ లభిస్తాయి. క్యాలెండర్ క్వార్టర్స్​లో అంటే జనవరి-మార్చి/ ఏప్రిల్​-జూన్/ జులై-సెప్టెంబర్​/అక్టోబర్​-డిసెంబర్ వ్యవధుల్లోనే మీరు రూ.1 లక్ష లేదా అంతకంటే ఎక్కువ మొత్తం ఖర్చు చేస్తే, మీకు ఒక కాంప్లిమెంటరీ లాంజ్ యాక్సెస్ ఓచర్ లభిస్తుంది.

Axis Bank Credit Card Benefits : యాక్సిస్ బ్యాంక్ ఇటీవలే​ మాగ్నస్ క్రెడిట్ కార్డు రూల్స్ మార్చింది. ముఖ్యంగా జాయినింగ్ ఫీజు, జాయినింగ్ గిఫ్ట్స్​ విషయంలో పలు మార్పులు చేసింది.

ICICI Bank Credit Card Benefits : ఐసీఐసీఐ బ్యాంక్‌ ఏకంగా 21 క్రెడిట్​కార్డ్​ల రూల్స్ మార్చింది. ముఖ్యంగా డొమెస్టిక్‌ ఎయిర్‌పోర్ట్‌ లాంజ్‌ యాక్సెస్‌, రివార్డ్ పాయింట్స్ నిబంధనల్లో పలు మార్పులు తీసుకువచ్చింది. వాటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

లాంజ్ యాక్సెస్ పొందాలంటే?
ఐసీఐసీఐ క్రెడిట్‌ కార్డ్ యూజర్లు ఇకపై దేశీయ విమానాశ్రయాల్లో లాంజ్‌ యాక్సెస్‌ పొందాలంటే, త్రైమాసికానికి కనీసం రూ.35,000 వరకు ఖర్చు చేయాల్సి ఉంటుంది. 2024 ఏప్రిల్‌ 1 నుంచి ఈ కొత్త నిబంధన అమల్లోకి రానుంది. ఉదాహరణకు జనవరి - మార్చి నెలల్లో రూ.35,000 ఖర్చు చేస్తే, ఏప్రిల్‌ -జూన్‌ త్రైమాసికంలో లాంజ్‌ యాక్సెస్‌ పొందడానికి అవకాశం కల్పిస్తారు.

ఏయే క్రెడిట్​కార్డుల రూల్స్ మారాయి?

  1. ఐసీఐసీఐ బ్యాంక్‌ కోరల్‌ క్రెడిట్‌ కార్డ్‌
  2. ఐసీఐసీఐ బ్యాంక్‌ ఎన్నారై సెక్యూర్డ్‌ కోరల్‌ క్రెడిట్‌ కార్డ్‌
  3. ఐసీఐసీఐ కోరల్‌ అమెరికన్‌ ఎక్స్‌ప్రెస్‌ క్రెడిట్‌ కార్డ్‌
  4. ఐసీఐసీఐ బ్యాంక్‌ సెక్యూర్డ్‌ కోరల్‌ క్రెడిట్‌ కార్డ్‌
  5. ఐసీఐసీఐ బ్యాంక్‌ కోరల్‌ కాంటాక్ట్‌ లెస్‌ క్రెడిట్‌ కార్డ్‌
  6. ఐసీఐసీఐ బ్యాంక్‌ ఎన్నారై కోరల్‌ క్రెడిట్‌ కార్డ్‌
  7. ఐసీఐసీఐ బ్యాంక్‌ లీడ్‌ ద న్యూ కోరల్‌ క్రెడిట్ కార్డ్‌
  8. ఐసీఐసీఐ కోరల్‌ రూపే క్రెడిట్‌ కార్డ్‌
  9. ఐసీఐసీఐ బ్యాంక్‌ మాస్టర్‌కార్డ్‌- కోరల్‌ క్రెడిట్‌ కార్డ్
  10. ఐసీఐసీఐ బ్యాంక్‌ ఎక్స్‌ప్రెషన్‌ క్రెడిట్‌ కార్డ్‌
  11. మైన్‌ క్రెడిట్‌ కార్డ్‌ బై ఐసీఐసీఐ బ్యాంక్‌ వీసా కార్డ్‌
  12. మైన్‌ క్రెడిట్‌ కార్డ్‌ బై ఐసీఐసీఐ బ్యాంక్‌ మాస్టర్‌ కార్డ్‌
  13. ఐసీఐసీఐ బ్యాంక్‌ హెచ్‌పీసీఎల్‌ సూపర్‌ సేవర్‌ వీసా క్రెడిట్‌ కార్డ్‌
  14. ఐసీఐసీఐ బ్యాంక్‌ హెచ్‌పీసీఎల్‌ సూపర్‌ సేవర్‌ మాస్టర్‌ క్రెడిట్‌ కార్డ్‌
  15. మేక్‌ మై ట్రిప్‌ ఐసీఐసీఐ బ్యాంక్‌ ప్లాటినమ్‌ క్రెడిట్‌ కార్డ్‌
  16. ఐసీఐసీఐ బ్యాంక్‌ మాంచెస్టర్‌ యునైటెడ్‌ ప్లాటినమ్‌ క్రెడిట్‌ కార్డ్‌
  17. చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఐసీఐసీఐ బ్యాంక్‌ క్రెడిట్ కార్డ్‌
  18. స్పీడ్జ్‌ ఐసీఐసీఐ బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డ్‌
  19. ఐసీఐసీఐ బ్యాంక్‌ పరాక్రమ్‌ సెలక్ట్‌ క్రెడిట్ కార్డ్‌
  20. ఐసీఐసీఐ బ్యాంక్‌ బిజినెస్‌ బ్లూ అడ్వాంటేజ్‌ కార్డ్‌
  21. ఐసీఐసీఐ బ్యాంక్‌ మేక్‌ మై ట్రిప్‌ మాస్టర్‌ బిజినెస్‌ ప్లాటినమ్‌ క్రెడిట్‌ కార్డ్‌

ఛార్జీలు, మినహాయింపులు

  • ఐసీఐసీఐ బ్యాంకు ఫిబ్రవరి 1వ తేదీ నుంచి 1% డైనమిక్‌ కరెన్సీ కన్వర్షన్‌ ఫీజు+ ట్యాక్స్‌ను వసూలు చేయనుంది. విదేశాల్లో భారతీయ రూపాయల్లో జరిపే ఆర్థిక లావాదేవీలపై ఈ ఛార్జీలు విధిస్తారు.
  • ఐసీఐసీఐ బ్యాంక్‌ రెంట్‌ పేమెంట్‌, ఈ-వ్యాలెట్‌ లోడింగ్‌లపై ఫిబ్రవరి 1 నుంచి రివార్డు పాయింట్లను నిలిపివేయనుంది. అయితే ఐసీఐసీఐ అమెజాన్‌ క్రెడిట్ కార్డులకు మాత్రం దీని నుంచి మినహాయింపు ఇచ్చారు.
  • ఐసీఐసీఐ బ్యాంక్‌ ఫిబ్రవరి 1 నుంచి యుటిలిటీ చెల్లింపుల విషయంలోనూ కొత్త రూల్స్‌ తీసుకొస్తోంది. యుటిలిటీ బిల్లుల చెల్లింపులపై మునుపటిలానే రివార్డు పాయింట్లు ఇస్తారు. కానీ స్టాంప్‌ డ్యూటీ, ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ పే లాంటి ప్రభుత్వ చెల్లింపులపై రివార్డ్ పాయింట్లు అందించరు.

ముందుగా అప్పు తీర్చలా? పెట్టుబడులు పెట్టాలా? - ఏది బెస్ట్ ఛాయిస్​!

మెడిక్లెయిమ్ Vs హెల్త్ ఇన్సూరెన్సు - వీటిలో ఏది బెస్ట్ ఆప్షన్​?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.