ETV Bharat / business

ట్విట్టర్​లో డిజిటల్ చెల్లింపులు.. డెబిట్ కార్డుల జారీ.. మస్క్ నయా ప్లాన్ - ట్విట్టర్‌ అఫీషియల్‌ ట్యాగ్‌ లేటెస్ట్ న్యూస్

ట్విట్టర్​లో ఇకపై డిజిటల్​ చెల్లింపులు చేసుకునే అవకాశం లభించనుంది. ప్రకటనదారులతో జరిగిన సమావేశంలో ట్విట్టర్ సీఈఓ ఎలాన్ మస్క్ ఈ మేరకు తన నిర్ణయాన్ని తెలిపారు.

Twitter CEO musk
ట్విట్టర్ సీఈఓ మస్క్
author img

By

Published : Nov 10, 2022, 5:44 PM IST

గూగుల్​ పే, ఫోన్​ పే తరహాలో.. ఇకపై ట్విట్టర్​లోనూ నగదు బదిలీ చేయొచ్చు. డిజిటల్ చెల్లింపుల కోసం ట్విట్టర్​లో సరికొత్త ఫీచర్​ను అందుబాటులోకి తెస్తున్నట్లు ఆ సంస్థను ఇటీవలే కొనుగోలు చేసిన వ్యాపార దిగ్గజం ఎలాన్ మస్క్​ స్వయంగా వెల్లడించారు. బుధవారం రాత్రి అడ్వర్టైజర్లతో జరిగిన సమావేశంలో ఈ విషయం చెప్పారు మస్క్.

బ్లూటిక్​ సబ్​స్క్రిప్షన్​ విధానమే.. ట్విట్టర్​లో డిజిటల్​ చెల్లింపులకు బాటలు వేస్తుందని అడ్వర్టైజర్లకు వివరించారు మస్క్. బ్లూటిక్​ సబ్​స్క్రైబర్లు క్రిడెట్ కార్డ్ లేదా డెబిట్​ కార్డ్​తోనే సైన్​అప్​ చేయాల్సి ఉంటుందని గుర్తు చేశారు. దానినే ఇతరులకు నగదు పంపేందుకూ విస్తరించనున్నట్లు తెలిపారు. ఇప్పటికే ఉన్న బ్యాంకు ఖాతా నుంచి ట్విట్టర్​ ద్వారా యూజర్లు ఇతరులకు డిజిటల్ పేమెంట్స్ చేయొచ్చని వివరించారు మస్క్. బ్యాంకు ఖాతాకు బదులు... ట్విట్టర్​ అకౌంట్​లోనూ నగదు డిపాజిట్ చేసుకునే వెసులుబాటు కల్పిస్తామని, అలా జమ చేసే యూజర్లకు అధిక వడ్డీ కూడా చెల్లిస్తామని తెలిపారు. అలా క్రమంగా డెబిట్ కార్డ్​లు, చెక్​లు జారీ చేసి.. ఈ వ్యవస్థను సాధ్యమైనంతగా విస్తరిస్తామని వివరించారు ఎలాన్ మస్క్.

అనుమతుల కోసం దరఖాస్తు
ట్విట్టర్​ ద్వారా డిజిటల్ చెల్లింపులకు వీలు కల్పించేలా అనుమతులు ఇవ్వాలని అమెరికాలోని సంబంధిత ప్రభుత్వ సంస్థలకు ఆ కంపెనీ గత వారమే దరఖాస్తు చేసినట్లు తెలిసింది.

ట్విట్టర్ అఫీషియల్‌ ట్యాగ్‌..
ట్విట్టర్‌లో బుధవారం కొన్ని ఖాతాలకు అఫీషియల్‌ అనే ట్యాగ్‌ను జత చేసిన ట్విట్టర్‌ ఈ ఫీచర్‌తో గందరగోళం తలెత్తడంతో కొద్ది గంటల్లోనే దాన్ని వెనక్కి తీసుకుంది. ట్విట్టర్​ను కొనుగోలు చేసిన ఎలాన్‌ మస్క్‌.. ఇప్పటికే ఈ మాధ్యమంలో అనేక మార్పులకు శ్రీకారం చుట్టారు. ట్విట్టర్‌ ఖాతాల బ్లూ టిక్‌ కోసం నెలకు 8 డాలర్లు వసూలు చేస్తామని వెల్లడించారు. దీని వల్ల నకిలీ ఖాతాలు కూడా బ్లూ టిక్‌ను పొందే ప్రమాదముందని ఆందోళనలు వ్యక్తమయ్యాయి. దీంతో ట్విట్టర్‌ అఫీషియల్‌ ట్యాగ్‌ అనే ఫీచర్‌ను తీసుకొచ్చింది.

ప్రభుత్వ అధికారిక ఖాతాలు, ప్రముఖ వ్యాపార ప్రొఫైళ్లకు ఈ ట్యాగ్‌ను జత చేయనున్నట్లు సంస్థ ప్రకటించింది. బుధవారం సాయంత్రం నుంచి కొన్ని ఖాతాలకు ఈ అధికారిక ట్యాగ్‌ను జత చేశారు. భారత్‌లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ సహా పలువురు కేంద్ర మంత్రులు, రాజకీయ, క్రీడా ప్రముఖులు, పలు మీడియా సంస్థల ఖాతాలకు ఈ ట్యాగ్‌ కన్పించింది. వీరితో పాటు కొందరు ప్రభుత్వేతర వ్యక్తుల ఖాతాలకు కూడా ఈ బ్యాడ్జ్‌ జత చేయడం గందర గోళానికి దారితీసింది. దీంతో గంటల వ్యవధిలోనే ఈ ఫీచర్‌ను ట్విటర్‌ తొలగించింది.

ఇవీ చదవండి:క్రెడిట్‌ కార్డ్ క్యాన్సిల్‌ చేయాలా? ఈ తప్పులు చేయొద్దు!

బిజినెస్​లోనూ ధోనీ నెం.1.. బిగ్గెస్ట్​ ట్యాక్స్​ పేయర్​గా ఘనత!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.