ట్విట్టర్ ఉద్యోగులు తమ భవిష్యత్‌ను నిర్ణయించుకోవడానికి ఓ అవకాశం ఇచ్చారు అధినేత ఎలాన్ మస్క్. ఉద్యోగులు సంస్థలో భాగం కావాలంటే.. గురువారం సాయంత్రంలోగా తాను పంపిన మొయిల్కి రిప్లై ఇవ్వాలని కోరారు. మస్క్ పంపిన మొయిల్ ప్రకారం.. ట్విట్టర్ 2.0ని అభివృద్ధి చేయడానికి ఉద్యోగులు అధిక సమయం పాటు తీవ్రంగా కష్టపడి పని చేసి సంస్థ విజయంలో భాగం కావాలని కోరారు. అక్టోబర్‌లో ట్విట్టర్ సంస్థను ఎలాన్ మస్క్ 44 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేశారు. దీంతో తనదైన శైలిలో తిరిగి లాభాల్లో పెట్టేందుకు మస్క్ తన ప్రయత్నాలు చేస్తున్నారు.
'అధిక పని ఒత్తిడి, ఎక్కువ సమయం పని ఉంటుంది. చెమటోడ్చి పని చేయడానికి సిద్ధంగా ఉండాలి' అని మస్క్ పేర్కొన్నారు. దీనికి అంగీకరిస్తూ పత్రంపై ప్రతి ఉద్యోగి తప్పనిసరిగా సంతకం చేయాల్సి ఉంటుందని మస్క్ సూచించారు. ఒకవేళ ఈ ఒప్పందంపై సంతకం చేయకపోతే ఉద్యోగాన్ని వదిలేసుకోవాల్సిందేనని స్పష్టం చేశారు. అయితే అలా ఉద్యోగాన్ని వదులుకునే వారికి మూడు నెలల వేతనాన్ని ఇవ్వనున్నట్లు మస్క్ ప్రకటించారు. 'మీరు ఏ నిర్ణయం తీసుకున్నా, ట్విట్టర్‌ను విజయవంతం చేసేందుకు మీరు చేస్తున్న కృషికి ధన్యవాదాలు' అని మొయిల్ చేశారు.