ETV Bharat / business

Mukesh Ambani Children Salary : జీతం తీసుకోకుండా పనిచేస్తున్న అంబానీ పిల్లలు.. మరి వీరికి ఆదాయం ఎలా వస్తుందో తెలుసా? - nita ambani salary

Mukesh Ambani Children Salary In Telugu : ముకేశ్ అంబానీ ముగ్గురు పిల్లలను కంపెనీ బోర్డ్​లో చేర్చుకునేందుకు వాటాదారుల అనుమతి కోరుతూ రిలయన్స్ ఇండస్ట్రీస్​ లిమిటెడ్​ ఒక తీర్మానం చేసింది. ఇందులో ఆకాశ్​, ఇషా, అనంత్​ ముగ్గురూ కంపెనీలో ఎలాంటి జీతం తీసుకోకుండా పనిచేస్తారని పేర్కొంది. మరి వీరికి ఆదాయం ఎలా వస్తుందో తెలుసా?

Ambani children will get no salary
Mukesh Ambani Children Salary
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 26, 2023, 5:24 PM IST

Updated : Sep 26, 2023, 6:18 PM IST

Mukesh Ambani Children Salary : దిగ్గజ వ్యాపారవేత్త, అపర కుబేరుడు ముకేశ్ అంబానీ ముగ్గురు పిల్లలు కూడా ఎలాంటి జీతం తీసుకోకుండా కంపెనీలో పనిచేస్తారని రిలయన్స్ ఇండస్ట్రీస్​ తెలిపింది. అయితే బోర్డ్ మీటింగ్స్, కమిటీ మీటింగ్స్​లో పాల్గొన్నప్పుడు ఫీజు మాత్రం తీసుకుంటారని స్పష్టం చేసింది.

ముచ్చటగా ముగ్గురు
ముకేశ్ అంబానీకి ఆకాశ్​, ఇషా, అనంత్ అనే ముగ్గురు పిల్లలు ఉన్నారు. వీరిలో ఆకాశ్, ఇషా ఇద్దరూ కవలలు వారి వయస్సు 31 సంవత్సరాలు. అనంత్ అంబానీ వయస్సు 28 సంవత్సరాలు. ఇప్పుడు ఈ ముగ్గురు కూడా రిలయన్స్ ఇండస్ట్రీస్​ కంపెనీ బోర్డ్​లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లుగా ఉన్నారు. వీరు బోర్డ్​లో చేరినప్పుడే.. తాము ఎలాంటి జీతం తీసుకోకుండా పనిచేస్తామని తీర్మానించుకున్నట్లు రిలయన్స్​ కంపెనీ తాజాగా తెలిపింది.

జీతం తీసుకోని అంబానీలు
Nita Ambani Children Salaries : రిలయన్స్ ఇండస్ట్రీస్​ అధినేత ముకేశ్ అంబానీ 2020-21 ఆర్థిక సంవత్సరం నుంచి జీతం లేకుండా కంపెనీలో పనిచేస్తున్నారు. కానీ కంపెనీలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లుగా పనిచేస్తున్న అతని సమీప బంధువులు నికిల్​, హితల్​ మాత్రం జీతంతో పాటు, అలవెన్సులు, కమీషన్లు సహా ఇతర బెనిఫిట్స్ పొందుతున్నారు.

ఆదాయం వస్తుంది ఇలా!
ఆకాశ్​, ఇషా, అనంత్​ అంబానీలు ముగ్గురూ కంపెనీలో జీతం తీసుకోవడం లేదు. అయితే వారికి బోర్డ్ మీటింగ్​లు, కమిటీ మీటింగ్​ల్లో పాల్గొన్నందుకు ఫీజు లభిస్తుంది. అలాగే కంపెనీ లాభాల్లో వాటా లభిస్తుంది. ఎందుకంటే వీరి ముగ్గురికి కంపెనీలో భారీ ఎత్తున వాటాలు ఉన్నాయి.

మరో ఐదేళ్లు అయనే!
Reliance Industries CEO : రిలయన్స్ కంపెనీ ఇటీవలే ముకేశ్ అంబానీని మరో 5 ఏళ్లపాటు కంపెనీ ఛైర్మన్​, సీఈఓగా కొనసాగిస్తూ నిర్ణయం తీసుకుంది. అలాగే ముకేశ్ అంబానీ ముగ్గురు పిల్లలను బోర్డ్​లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లుగా నియమించింది. అయితే తాజాగా ఈ నియామకానికి షేర్​హాల్డర్ల ఆమోదం కోసం పోస్టల్​ బ్యాలెట్​లను పంపించింది.

శాశ్వత ఆహ్వానితురాలు
ఇటీవల ముకేశ్ అంబానీ భార్య నీతా అంబానీ కంపెనీ బోర్డ్​ నుంచి తప్పుకున్నారు. కానీ ఆమె కంపెనీ బోర్డ్ మీటింగ్​లకు ఆమె శాశ్వత ఆహ్వానితురాలిగా ఉంటారు. ఈ ప్రత్యేకమైన వెసులుబాటు ముకేశ్ అంబానీ సహా కంపెనీలోని మరెవ్వరికీ లేకపోవడం విశేషం.

నీతా అంబానీ లాగానే!
Nita Ambani Salary : ముకేశ్ అంబానీ భార్య నీతా అంబానీ 2014లో రిలయన్స్ ఇండస్ట్రీస్​ కంపెనీ బోర్డ్​లో చేరారు. ఆమె 2022-23 ఆర్థిక సంవత్సరంలో సిట్టింగ్ ఫీజుగా రూ.6 లక్షలు, కమీషన్​గా రూ.2 కోట్లు తీసుకున్నారు. ఇదే విధంగా ఆకాశ్​, ఇషా, అనంత్​లకు కూడా సిట్టింగ్​ ఫీజు, కమీషన్​ లభిస్తాయి.

5 భిన్నమైన వ్యాపారాలు!
Reliance Industries Businesses : రిలయన్స్ కంపెనీ ఐదు భిన్నమైన వ్యాపారాలను నిర్వహిస్తోంది. ముఖ్యంగా చమురు వ్యాపారం చేస్తోంది. ప్రపంచంలోనే అతిపెద్ద సింగిల్-లొకేషన్​ రిఫైనింగ్ కాంప్లెక్స్​, పెట్రో కెమికల్​ ప్లాంట్స్​ రిలయన్స్ కంపెనీ చేతిలో ఉన్నాయి. అలాగే టెలికాం అండ్​ డిజిటల్ బిజినెస్, రిటైల్​ బిజినెస్​ (ఆన్​లైన్​ & ఆఫ్​లైన్​), న్యూ ఎనర్జీ వ్యాపారం ఉన్నాయి. ఇటీవలే ఫైనాన్సియల్​ సర్వీసులు కూడా ప్రారంభించడం జరిగింది.

ప్రతి ఒక్కరికీ బాధ్యతలు అప్పగించారు!
ముకేశ్ అంబానీ తన వారసత్వాన్ని కొనసాగించేందుకు తగిన వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. అందులో భాగంగా తన పెద్దకుమారుడైన ఆకాశ్​కు టెలికాం బిజినెస్​ను, కుమార్తె ఇషాకు రిటైల్​ వ్యాపారాన్ని, చిన్న కుమారుడు అనంత్​కు న్యూ ఎనర్జీ వ్యాపార బాధ్యతలను అప్పగించారు. అయితే రిలయన్స్ ప్రధాన వ్యాపారమైన 'ఆయిల్-టు-కెమికల్​' వ్యాపార బాధ్యతలను మాత్రం ఇంకా ఎవరికీ అప్పగించలేదు.

ఇషా అంబానీ : ఇషా అంబానీ యేల్ యూనివర్సిటీలో సైకాలజీ, సౌత్​ ఏసియా స్టడీస్​ చేశారు. స్టాన్​ఫోర్డ్ యూనివర్సిటీలో ఎంబీఏ చదివారు. 'ఇండిపెండెన్స్' అనే బ్రాండ్​ను లాంఛ్ చేయడంలో కీలకమైన పాత్ర పోషించారు. వాస్తవానికి రిలయన్స్ ఇండస్ట్రీస్​ కంపెనీలో అంబానీ కుటుంబానికి 41.46 శాతం వాటా ఉంది. ఇవి కాకుండా రిలయన్స్ ఇండస్ట్రీస్​ కంపెనీలో ఇషాకు నేరుగా 0.12 శాతం మేర ఈక్విటీ షేర్లు ఉన్నాయి.​

ఆకాశ్ అంబానీ : అమెరికాలోని బ్రౌన్​ యూనివర్సిటీలో ఆకాశ్ అంబానీ ఎకనామిక్స్​ డిగ్రీ చదివారు. ఇప్పుడు భారతదేశంలోని అతిపెద్ద టెలికాం కంపెనీ జియోకు హెడ్​గా ఉన్నారు. ముఖ్యంగా భారత్​లో 5జీ ఇంటర్నెట్​, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్​, బ్లాక్​చైన్​, ఇంటర్నెట్ ఆఫ్​ థింగ్స్​ను లాంటి డిజిటల్ టెక్నాలజీలను మరింత విస్తృతం చేయడంలో కీలకపాత్ర పోషిస్తున్నారు.

అనంత్ అంబానీ : ఈయన కూడా బ్రౌన్ యూనివర్సిటీలోనే గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ప్రస్తుతం రెనీవబుల్, గ్రీన్ ఎనర్జీ బిజినెస్​ను చూసుకుంటున్నారు.

How to Change Name in LIC Policy : మీకు ఎల్​ఐసీలో పాలసీ ఉందా?.. అయితే మీరు ఈ విషయం తెలుసుకోవాల్సిందే.!

Cheapest Gold Market In The World : చౌకగా బంగారం కొనాలా?.. ఆ 7 దేశాల్లో డెడ్​ చీప్​గా పసిడి నగలు దొరుకుతాయ్!

Last Updated : Sep 26, 2023, 6:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.