Most Affordable Cars With 6 Airbags : భారతదేశంలో ట్రాఫిక్ సహా, రోడ్డు ప్రమాదాల సంఖ్య కూడా విపరీతంగా పెరుగుతోంది. అందుకే ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలు అన్నీ తమ బ్రాండెడ్ కార్లలో అత్యాధునిక సేఫ్టీ ఫీచర్లను పొందుపరుస్తున్నాయి.
భద్రతకే తొలి ప్రాధాన్యం!
హ్యుందాయ్, టాటా కంపెనీలు ప్రయాణికులకు భద్రత కల్పించేందుకు.. మీడియం బడ్జెట్లో 6 ఎయిర్‌బ్యాగ్స్ ఉన్న కార్లను అందిస్తున్నాయి. దీని వల్ల అనుకోకుండా ప్రమాదం జరిగినా.. పెద్దగా గాయాలపాలు కాకుండా ప్రయాణికులు తప్పించుకోవడానికి వీలవుతుంది. అందుకే హ్యుందాయ్, టాటా ఆటోమొబైల్ కంపెనీలు అందిస్తున్న 6 ఎయిర్‌బ్యాగ్‌లు ఉన్న టాప్-9 కార్లపై ఓ లుక్కేద్దాం రండి.
1. Hyundai Grand i10 Nios Features : బడ్జెట్లో మంచి సేఫ్టీ ఫీచర్లు ఉన్న కారు ఇది. ముఖ్యంగా ఈ కారులో 6 ఎయిర్‌బ్యాగ్స్ ఉంటాయి. ఈ హ్యాచ్‌బ్యాక్ కారులో 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ అమర్చారు. ఇది 5-స్పీడ్ మాన్యువల్ లేదా AMT అనుసంధానం కలిగి ఉంటుంది. అలాగే ఈ కారులో 1.2 లీటర్ పెట్రోల్/ సీఎన్జీ ఇంజిన్ ఆప్షన్ కూడా ఉంది.
![Hyundai Grand i10 Nios](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/18-11-2023/20053998_hyundai-grand-i10-nios.jpg)
Hyundai Grand i10 Nios Price : మార్కెట్లో హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ కారు ధర రూ.5.84 లక్షలు - రూ.8.51 లక్షలు వరకు ఉంటుంది.
![Hyundai Grand i10 Nios](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/18-11-2023/20053998_hyundai-grand-i10-nios-1.jpg)
2. Hyundai Exter Features : హ్యుందాయ్ ఎక్స్టర్ కారు మంచి లుక్‌తో.. పట్టణాల్లో ప్రయాణించడానికి చాలా అనువుగా ఉంటుంది. బడ్జెట్లో మంచి సేఫ్టీ ఫీచర్లు ఉన్న మైక్రో-ఎస్యూవీ కారు ఇది. దీనిలోనూ 6 ఎయిర్‌బ్యాగ్స్ ఉన్నాయి. ఈ హ్యుందాయ్ ఎక్స్టర్ కారులో 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఉంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ లేదా AMT అనుసంధానం కలిగి ఉంటుంది.
![Hyundai Exter](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/18-11-2023/20053998_hyundai-exter.jpg)
Hyundai Exter Price : మార్కెట్లో హ్యుందాయ్ ఎక్స్టర్ కారు ధర రూ.6 లక్షలు - రూ.10.15 లక్షలు ఉంటుంది.
![Hyundai Exter](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/18-11-2023/20053998_hyundai-exter-1.jpg)
3. Hyundai Aura Features : హ్యుందాయ్ కంపెనీ ఇటీవలే తమ కార్లు అన్నింటిలోనీ కచ్చితంగా 6 ఎయిర్‌బ్యాగ్స్ అందిస్తామని స్పష్టం చేసింది. అందులో భాగంగా హ్యుందాయ్ Aura సెడాన్‌లోనూ 6 ఎయిర్‌బ్యాగ్స్ పొందుపరిచింది. అయితే ప్రస్తుతానికి టాప్ ట్రిమ్ కారులోనే ఈ సేఫ్టీ ఫీచర్ అందుబాటులో ఉంది.
హ్యుందాయ్ Auro కారులో కూడా Hyundai Grand i10 Nios కారులోని ఇంజినే ఉంటుంది. అంటే ఈ కారు 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్; 1.2 లీటర్ పెట్రోల్/ సీఎన్జీ ఇంజిన్ ఆప్షన్లతో లభిస్తుంది.
![Hyundai Aura](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/18-11-2023/20053998_hyundai-aura.jpg)
Hyundai Aura Price : మార్కెట్లో ఈ హ్యుందాయ్ Aura కారు ధర రూ.6.44 లక్షలు - రూ.9 లక్షలు వరకు ఉంటుంది.
![Hyundai Aura](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/18-11-2023/20053998_hyundai-aura-1.jpg)
4. Hyundai i20 Features : హ్యుందాయ్ ఐ20 ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ 1.2 లీటర్ పెట్రోల్, 1.0 లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్లలో లభిస్తుంది. పైగా ఇది 5-స్పీడ్ MT, CVT, 6-స్పీడ్ MT, 7-స్పీడ్ DCT లాంటి మల్టిపుల్ గేర్ బాక్స్ ఛాయిస్‌లలో లభిస్తుంది.
![Hyundai i20](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/18-11-2023/20053998_hyundai-i20.jpg)
Hyundai i20 Price : మార్కెట్లో హ్యుందాయ్ ఐ20 కారు ధర రూ.6.99 లక్షలు - రూ.11.16 లక్షలు వరకు ఉంటుంది.
![Hyundai i20](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/18-11-2023/20053998_hyundai-i20-1.jpg)
5. Hyundai i20 N Line Features : బడ్జెట్లో మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చే కారు హ్యుందాయ్ ఐ20 ఎన్ లైన్. ఇందులో 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ఉంది. ఇది 6-స్పీడ్ MT లేదా 7-స్పీడ్ DCT అనుసంధానం కలిగి ఉంటుంది.
![Hyundai i20 N Line](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/18-11-2023/20053998_hyundai-i20-n-line.jpg)
Hyundai i20 N Line Price : మార్కెట్లో ఈ హ్యుందాయ్ ఐ20 ఎన్ లైన్ ధర రూ.9.99 లక్షలు - రూ.12.47 లక్షలు వరకు ఉంటుంది.
![Hyundai i20 N Line](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/18-11-2023/20053998_hyundai-i20-n-line-1.jpg)
6. Hyundai Venue Features : సబ్‌కాంపాక్ట్ ఎస్యూవీ సెగ్మెంట్లో బెస్ట్ కారు ఏదంటే.. అది కచ్చితంగా హ్యుందాయ్ వెన్యూ అని చెప్పవచ్చు. ఇది 1.2 లీటర్ పెట్రోల్, 1.5 లీటర్ డీజిల్, 1.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్లలో లభిస్తుంది. దీనిలో 6-ఎయిర్‌బ్యాగ్‌లు ఉంటాయి. కనుక ప్రయాణికుల సేఫ్టీకి ఎలాంటి ఢోకా ఉండదు.
![Hyundai Venue](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/18-11-2023/20053998_hyundai-venue.jpg)
Hyundai Venue Price : హ్యుందాయ్ వెన్యూ కారు ధర రూ. 7.89 లక్షలు - రూ.13.48 లక్షలు వరకు ఉంటుంది.
![Hyundai Venue](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/18-11-2023/20053998_hyundai-venue-1.png)
7. Hyundai Venue N Line Features : ఈ హ్యుందాయ్ వెన్యూ ఎన్ లైన్ కారులో 1.0 లీటర్ టర్బో ఛార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఇది 6-స్పీడ్ మాన్యువల్ లేదా 7-స్పీడ్ DCT గేర్ బాక్స్ అనుసంధానం కలిగి ఉంటుంది.
![Hyundai Venue N Line](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/18-11-2023/20053998_hyundai-venue-n-line.jpg)
Hyundai Venue N Line Price : మార్కెట్లో హ్యుందాయ్ వెన్యూ ఎన్ లైన్ కారు ధర రూ.12.08 లక్షలు - రూ.13.90 లక్షలు వరకు ఉంటుంది.
![Hyundai Venue N Line](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/18-11-2023/20053998_hyundai-venue-n-line-1.png)
8. Tata Nexon Features : టాటా నెక్సాన్ సిరీస్ కారుల్లో ఇంటర్నల్ కంబష్చన్ ఇంజిన్ (ICE) ఉంటుంది. బడ్జెట్లో మంచి ప్రీమియం లుక్‌తో, హై-సేఫ్టీ, కంఫర్ట్ ఫీచర్లు ఉన్న కారు ఇది. టాటా నెక్సాన్ ICE వెర్షన్ కార్ 1.2 లీటర్ టర్బో-పెట్రోల్ మోటార్, 1.5 లీటర్ టర్బో-డీజిల్ మోటార్ ఆప్షన్లలో లభిస్తుంది.
![Tata Nexon](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/18-11-2023/20053998_tata-nexon.jpg)
Tata Nexon Price : టాటా నెక్సాన్ కారు ధర రూ.8.10 లక్షలు - రూ.15.50 లక్షలు వరకు ఉంటుంది.
![Tata Nexon](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/18-11-2023/20053998_tata-nexon-1.jpg)
9. Tata Nexon EV Features : టాటా నెక్సాన్ ఈవీ కారు 30 కిలోవాట్, 40.5 కిలోవాట్ బ్యాటరీ ఆప్షన్లలో లభిస్తుంది. 30 కిలోవాట్ బ్యాటరీని ఫుల్ రీఛార్జ్ చేస్తే 325 కి.మీ వరకు ప్రయాణించవచ్చు. 40.5 కిలోవాట్ బ్యాటరీని ఫుల్ రీఛార్జ్ చేస్తే ఏకంగా 465కి.మీ వరకు ప్రయాణం చేయవచ్చు అని కంపెనీ చెబుతోంది.
![Tata Nexon EV](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/18-11-2023/20053998_tata-nexon-ev-1-2.jpg)
Tata Nexon EV Price : మార్కెట్లో టాటా నెక్సాన్ ఈవీ కారు ధర రూ.14.74 లక్షలు - రూ.19.94 లక్షలు ఉంటుంది.
![Tata Nexon EV](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/18-11-2023/20053998_tata-nexon-ev-1-1.jpg)
ఇకపై ప్రతి కారులోనూ ADAS మస్ట్ - కేంద్రం కొత్త రూల్ - మరి ధరలు పెరుగుతాయా?
2024లో లాంఛ్ కానున్న టాప్-7 కార్స్ ఇవే! లుక్స్, మైలేజ్, ఫీచర్స్ వివరాలు ఇలా!