ETV Bharat / business

Ratan Tata Legacy Maya Tata : మాయా టాటా ఎవరు?.. రతన్ టాటా వారసురాలు ఆమేనా? - రతన్​ టాటా వారసులు ఎవరు

Ratan Tata Legacy Maya Tata : టాటా గ్రూప్​ అంటే మొదటిగా గుర్తు వచ్చేది రతన్ టాటా. ఇప్పుడు ఆయన టాటా గ్రూప్​ బాధ్యతలను తదుపరి తరం టాటా వారసులకు అప్పగించే యోచనలో ఉన్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. బహుశా రతన్ టాటా తరువాత టాటా గ్రూప్​ బాధ్యతలు మాయా టాటా చేపట్టే అవకాశం ఉందని మార్కెట్ వర్గాల టాక్​.

Maya Tata
Ratan Tata Legacy Maya Tata
author img

By ETV Bharat Telugu Team

Published : Aug 22, 2023, 5:06 PM IST

Ratan Tata Legacy Maya Tata : రతన్​ టాటా.. ఈ దిగ్గజ వ్యాపారవేత్త​ గురించి తెలియనివారు లేరు అంటే అది ఏమాత్రం అతిశయోక్తి కాదు. రతన్​ టాటా నీతి, నిజాయితీ, నిబద్ధతకు నిలువుటద్దంగా నిలుస్తూ.. భావి తరాలకు ఆదర్శప్రాయంగా నిలుస్తున్నారు. అయితే ఆయన ఇప్పుడు టాటా గ్రూప్​ బాధ్యతలను తన వారసులకు అప్పగించే యోచనలో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే టాటా గ్రూప్ కూడా​ తదుపరి తరం టాటాలకు బాధ్యతలను అప్పగించే ప్రక్రియ చేపట్టింది. అందులో ప్రముఖంగా వినిపిస్తున్న పేరు మాయా టాటా.

మాయా టాటా
Who Is Maya Tata : రూ.20,71,467 కోట్ల విలువైన టాటా గ్రూప్​ సంస్థల బాధ్యతలను త్వరలో మాయా టాటా స్వీకరించనున్నట్లు సమాచారం. 34 ఏళ్ల మాయా ఇటీవలే టాటా మెడికల్ సెంటర్​ ట్రస్ట్ బోర్డు సభ్యురాలిగా బాధ్యతలు స్వీకరించారు. మాయాతో పాటు ఆమె సోదరి లేహ్​, సోదరుడు నెవిల్లే కూడా టాటా గ్రూప్​లోని కీలక స్థానాల్లో పనిచేస్తున్నారు. వీరందరూ వాస్తవానికి రతన్​టాటా ఆధ్వర్యంలోనే వ్యాపార పాఠాలు నేర్చుకున్నారు.

Tata Family Tree : రతన్​ టాటా సవతి సోదరుడు నోయెల్​ టాటా. దివంగత పల్లోంజీ మిస్త్రీ కుమార్తె, టాటా గ్రూప్​ మాజీ ఛైర్మన్​ సైరస్​ మిస్త్రీ సోదరి ఆలూ మిస్త్రీ. వీరిద్దరికీ ముగ్గురు పిల్లలు ఉన్నారు. వారిలో అందరి కంటే చిన్నది మాయా మిస్త్రీ.

విద్య - వ్యాపార అనుభవం
Maya Tata Education : మాయా టాటా యూకేలోని బేయర్స్ బిజినెస్​ స్కూల్​, ది యూనివర్సిటీ ఆఫ్​ వార్విక్​లో విద్యాభ్యాసం చేశారు. తరువాత టాటా గ్రూప్​లో వివిధ హోదాల్లో పనిచేశారు. మొదటిగా ఆమె టాటా ఆపర్చూనిటీస్​ ఫండ్​లో పనిచేశారు. ఇది టాటా గ్రూప్​కు సంబంధించిన టాటా క్యాపిటల్​ అనే ప్రైవేట్ ఈక్విటీ ఫండ్​ సంస్థ.​ అయితే ప్రస్తుతం దీనిని మూసేశారు.

మాయా టాటా తరువాత ఎన్​ చంద్రశేఖరన్​ ఆధ్వర్యంలో నడిచే రూ.1000 కోట్ల విలువైన టాటా డిజిటల్ కంపెనీలో పనిచేశారు. ప్రస్తుతం ఆమె టాటా మెడికల్ సెంటర్ ట్రస్ట్​ బోర్డ్​ మెంబర్​గా ఉన్నారు. ఈ సంస్థ కలకత్తాలోని క్యాన్సర్​ హాస్పిటల్ బాధ్యతలు చూస్తుంది. వాస్తవానికి ఈ క్యాన్సర్ ఆసుపత్రిని 2011లో రతన్ టాటా ప్రారంభించారు.

21 లక్షల కోట్ల విలువైన కంపెనీ!
Tata Group Net Worth : టాటా గ్రూప్​ మొత్తం మార్కెట్​ విలువ రూ.20,71,467 కోట్లు. 2023 మార్చి 31న వెలువరించిన వార్షిక నివేదిక ప్రకారం, వీటిలో టాటా సన్స్​ కంపెనీ మాత్రమే రూ.11,20,575.24 కోట్ల విలువైన పెట్టుబడులను కలిగి ఉంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.