ETV Bharat / business

మారుతి నుంచి అదిరిపోయే హైబ్రిడ్ కార్లు.. మైలేజీ, డిజైన్, ఫీచర్లలో ఇవే బెస్ట్!

Maruti Suzuki Upcoming Cars : భారత ఆటో మొబైల్ రంగంలో ఇప్పుడు మారుతి సుజుకీదే హవా. మిగతా కంపెనీల కంటే సరసమైన ధరకు మంచి మైలేజీ, అద్భుతమైన ఫీచర్లతో కార్లను అందుబాటులోకి తీసుకురావడమే మారుతి విజయ సూత్రంగా చెప్పొచ్చు. అలాంటి ఈ కంపెనీ నుంచి వస్తున్న కొత్త మోడల్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

Maruti Suzuki Upcoming Cars
మార్కెట్లోకి రానున్న మారుతీ సుజుకీ కొత్త కార్లు
author img

By

Published : Jul 6, 2023, 12:58 PM IST

Maruti Suzuki Upcoming Cars : కస్టమర్ల అభిరుచులు, మారుతున్న టెక్నాలజీని అందిపుచ్చుకొని ఎప్పటికప్పుడు కొత్త మోడల్ కార్లను ప్రవేశపెడుతోంది మారుతి సుజుకీ. అయితే ఇప్పుడు ఆటో మొబైల్ సంస్థలన్నీ విద్యుత్ వాహనాల(ఈవీ) వైపు దృష్టి సారిస్తున్నాయి. భవిష్యత్తు మొత్తం ఈవీలదే అని ఇండస్ట్రీ నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మారుతి సుజుకీ కూడా ఆ దిశగా ప్రయత్నాలు ఆరంభించింది. ఈ క్రమంలో పలు కొత్త మోడల్ కార్లను తీసుకొస్తోంది. వాటిల్లో ఒక ఈవీ కూడా ఉండటం విశేషం. ఆ కంపెనీ నుంచి వస్తున్న నయా మోడల్ కార్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

మారుతి సుజుకీ.. ఈ బ్రాండ్ గురించి తెలియని ఆటో మొబైల్ ప్రేమికులు ఉండరని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. భారత ఆటో మొబైల్ ఇండస్ట్రీలో గత కొన్నేళ్లుగా చక్రం తిప్పుతోందీ కంపెనీ. దేశంలో అత్యధికంగా కార్లను విక్రయిస్తున్న సంస్థగా మారుతి సుజుకీ ముందంజలో ఉంది. ఇండియాలో మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా ఉంటారు. అందుకే వారి అవసరాలకు తగ్గట్లు వాహనాలను తయారు చేయడమే గాక మిగతా బ్రాండ్లతో పోలిస్తే తక్కువ ధరకు అందుబాటులోకి తీసుకురావడం మారుతి సక్సెస్ సీక్రెట్​గా చెప్పాలి. మంచి మైలేజీ, మెయింటెనెన్స్ కాస్ట్ కూడా ఎక్కువగా ఉండకపోవడంతో మిడిల్ క్లాస్ వినియోగదారులు ఈ కార్లను కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అందుకే సేల్స్ పరంగా మిగతా కంపెనీలకు అందనంత ఎత్తులో ఉంది మారుతి. అలాంటి ఈ కంపెనీ నుంచి రాబోతున్న కొత్త హైబ్రిడ్ వెహికిల్స్​కు సంబంధించిన వివరాలు ఇప్పుడు మీ కోసం..

1. మారుతి ఇన్​విక్టో..
Maruti Suzuki Invicto : మైలేజీని పెంచడం సహా డ్రైవింగ్ పెర్ఫార్మెన్స్​ను మెరుగుపరిచే స్మార్ట్ హైబ్రిడ్ అనే అధునానత సాంకేతికతతో కొత్త కార్లను తయారు చేస్తోంది మారుతి సుజుకీ. ఈ క్రమంలో తీసుకొస్తున్న వాహనాల్లో మారుతి ఇన్​విక్టో కూడా ఒకటి. జులై 5వ తేదీన భారతీయ మార్కెట్​లో ఈ కారు అందుబాటులోకి రానుంది. గ్రాండ్ విటారా మాదిరిగానే సరికొత్త డిజైన్​తో రానున్న ఇన్​విక్టోలో దాదాపుగా ఫీచర్స్, లుక్స్ అన్నీ ఇన్నోవా హైక్రాస్ మాదిరిగానే ఉండటం గమనార్హం.

Maruti Suzuki Invicto
మారుతి సుజుకీ ఇన్​ విక్టో

2. న్యూ జనరేషన్ మారుతి స్విఫ్ట్..
Maruti Suzuki New Swift : మారుతి సుజుకీ సంస్థకు ఇండియాలో ఇంత క్రేజ్ పెరగడానికి ఒక మోడల్ కూడా కారణం. అదే మారుతి సుజుకీ స్విఫ్ట్. భారత్​లో అత్యంత పాపులారిటీ కలిగిన ఈ మోడల్ సేల్స్ ఒక రేంజ్​లో సాగాయి. మైలేజీ, ధర, ఫీచర్లు.. ఇలా ఏ రకంగా చూసినా ఈ కారు బెస్ట్ ఆప్షన్ అనే చెప్పాలి. అలాంటి స్విఫ్ట్​లో కొత్త మోడల్​ను తీసుకొస్తోంది మారుతి. కొత్త జనరేషన్ మారుతి స్విఫ్ట్​ను వచ్చే ఏడాది ప్రథమార్థంలో మార్కెట్లో అందుబాటులోకి తీసుకురావాలని మారుతి భావిస్తోంది. ఈ కారులో డిజైన్ పరంగా పెద్దగా మార్పులు చేయనప్పటికీ, అనేక కొత్త ఫీచర్లను అందిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే బిల్డ్ క్వాలిటీని పెంచడమే గాక హైబ్రిడ్ టెక్నాలజీతో కొత్త 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ ను తయారు చేసినట్లు సమాచారం. బెస్ట్ మైలేజీ ఇచ్చేలా దీన్ని రూపొందిస్తున్నారట.

3. న్యూ జనరేషన్ మారుతి డిజైర్..
Maruti Suzuki Dzire : మారుతి కార్లలో స్విఫ్ట్ తర్వాత ఎక్కువగా సేల్ అయిన మోడల్స్​లో డిజైర్ కూడా ఒకటి. మధ్యతరగతి ప్రజలు ఈ కారును కొనేందుకు అధికంగా ఆసక్తి చూపించారు. అలాంటి డిజైర్ కొత్త మోడల్​ను తయారు చేస్తోంది మారుతి. కొత్త జనరేషన్ డిజైర్​లో సేఫ్టీ ఫీచర్లను పెంచడంతో పాటు డిజైన్ పరంగానూ మార్పులు చేసినట్లు తెలుస్తోంది. మంచి స్టైలింగ్, అప్​గ్రేడ్ చేసిన ఇంటీరియర్స్, మంచి ఎక్విప్​మెంట్​తో సిద్ధమవుతున్న న్యూ జనరేషన్ డిజైర్ కారు ఈ ఏడాది ద్వితీయార్థంలో లేదా వచ్చే ఏడాది మొదట్లో మార్కెట్​లో అందుబాటులోకి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.

4. మారుతి సుజుకీ ఈవీఎక్స్..
Maruti Suzuki eVX EV : ఎలక్ట్రిక్ వెహికిల్ సెగ్నెంట్​లోకి ఎంట్రీ ఇచ్చేందుకు మారుతి సుజుకీ రెడీ అవుతోంది. ఆ సంస్థ నుంచి వస్తున్న తొలి ఎలక్ట్రిక్ వెహికిల్​గా ఈవీఎక్స్ ఎలక్ట్రిక్ ఎస్​యూవీని చెప్పొచ్చు. ఆటో ఎక్స్​పో-2023లో ఈ కారును పరిచయం చేసింది మారుతి. టాటా నెక్సాన్, మహింద్రా ఎక్స్​యూవీ 400తో పాటు ఎంజీ జెడ్ఎస్ ఈవీలకు పోటీగా ఈవీఎక్స్​ను తీసుకొస్తోంది మారుతి. ఈ కారును ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే 550 కిలోమీటర్లు నాన్ స్టాప్​గా దూసుకెళ్తుంది. ఈ కారు మార్కెట్​లోకి వస్తే ఎన్ని సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.

Maruti Suzuki eVX EV
మారుతి సుజుకీ ఈవీఎక్స్ ఈవీ

ఇవీ చదవండి :

మారుతీ సుజుకీ బ్రెజా CNG బుకింగ్స్ షురూ​​.. కేవలం రూ.25,000కే కారు!

Maruti Jimny launch : మారుతి జిమ్నీ వచ్చేసింది... ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.