వాణిజ్య సిలిండర్ల వినియోగదారులకు ఉపశమనం కలిగింది. 19 కేజీల ఎల్పీజీ సిలిండర్ ధరను చమురు సంస్థలు తగ్గించాయి. రూ.115.50 మేర తగ్గిస్తున్నట్లు ప్రకటించాయి. దీంతో దేశ రాజధాని దిల్లీలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ.1,744కి, ముంబయిలో రూ.1,696కు చేరాయి. తగ్గించిన ధరలు మంగళవారం నుంచి అమల్లోకి వస్తాయని చమురు సంస్థలు వెల్లడించాయి. అయితే 14.2 కేజీల గృహ వినియోగ సిలిండర్ ధరలో మాత్రం ఎలాంటి మార్పూ లేదు. జూలై నుంచి 14.2 కేజీల గ్యాస్ సిలిండర్ రేటు నిలకడగానే ఉంది. అయితే కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర మాత్రం తగ్గుతూ వస్తోంది.
LPG cylinder: తగ్గిన వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర.. ఎంతంటే? - గ్యాస్ ధరలు
వాణిజ్య సిలిండర్ల వినియోగదారులకు ఉపశమనం కలిగింది. 19 కేజీల ఎల్పీజీ సిలిండర్ ధర రూ.115 మేర తగ్గించాయి చమురు సంస్థలు.
![LPG cylinder: తగ్గిన వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర.. ఎంతంటే? lpg commercial cylinder price update](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-16799049-thumbnail-3x2-lsdjljkf.jpg?imwidth=3840)