ETV Bharat / business

వారి లోన్​కు మీరు ష్యూరిటీ ఇస్తున్నారా? ఈ రిస్క్​లు ఉండొచ్చు! - loan guarantor explained

ఒకవేళ లోన్‌ తీసుకున్న వ్యక్తి లేదా వ్యక్తులు సకాలంలో వాయిదా చెల్లించలేకపోతే.. ఆ బాధ్యత హామీదారుపై కూడా ఉంటుంది. అందుకే చెల్లింపుల్లో ఏమాత్రం ఆలస్యమైనా ఆ ప్రభావం హామీ సంతకం చేసే వ్యక్తి క్రెడిట్‌ స్కోరుపై కూడా ఉంటుంది. ఒకవేళ భవిష్యత్తులో ఎప్పుడైనా మీరు రుణం తీసుకోవాలంటే ఇబ్బంది తలెత్తొచ్చు. అందుకే మీరు ఎవరికైతే.. హామీ ఇస్తున్నారో వారు తిరిగి చెల్లిస్తున్నారా? లేదా? తరచూ చెక్‌ చేసుకోండి. అలాగే మీ క్రెడిట్‌ స్కోరును కూడా పరిశీలించుకుంటూ ఉండండి.

loan guarantor risks
వారి లోన్​కు మీరు ష్యూరిటీ ఇస్తున్నారా? ఈ రిస్క్​లు ఉండొచ్చు!
author img

By

Published : Aug 10, 2022, 6:14 PM IST

Loan guarantor explained : లోన్‌ తీసుకుంటున్నాను.. కాస్త హామీ సంతకం చేస్తారా? అని ఏ మిత్రుడో.. బంధువో.. అడిగితే మొహమాటానికో లేక వారిపై మీకున్న నమ్మకంతోనో వెంటనే అంగీకరిస్తుంటారు! దాని వెనకున్న రిస్క్‌ గురించి ఏమాత్రం ఆలోచించరు. నిజంగా మీ హామీ సంతకం తీసుకుంటున్న వ్యక్తి నమ్మకస్థుడైతే ఫరవాలేదు. కానీ, ఏవైనా ఆర్థిక ఇబ్బందుల్లో ఉండి హామీ కోసం మిమ్మల్ని ఆశ్రయిస్తున్నారంటే మాత్రం కాస్త ఆలోచించాల్సిందే. లేదంటే ఆ భారం మీరు మోయాల్సి రావొచ్చు!

హామీ ఎప్పుడు అడుగుతారంటే..
సాధారణంగా చాలా మంది ఇతరుల లోన్‌కి హామీ ఉండడం బ్యాంకులు తప్పనిసరి చేస్తాయని భావిస్తుంటారు. కానీ, అది నిజం కాదు. రుణం తీసుకుంటున్న వ్యక్తి ఆర్థిక చరిత్ర సక్రమంగా లేకపోతే లేదా క్రెడిట్‌ స్కోర్‌ చాలినంత లేని సమయంలోనే బ్యాంకులు హామీ అడుగుతుంటాయి. ఒక్కోసారి వ్యక్తి చేస్తున్న ఉద్యోగం రిస్క్‌తో కూడుకున్నదైనా ఆర్థిక సంస్థలు ఇతరుల హామీని తప్పనిసరి చేస్తాయి. అలాగే సదరు వ్యక్తికి రుణం కట్టే సామర్థ్యం లేదని బ్యాంకులు భావించినా ఎవరినైనా హామీగా తీసుకురావాలని కోరతాయి. హమీదారును బ్యాంకులు ఎప్పుడు అడగాలి అనే విషయంపై స్పష్టమైన నియమ, నిబంధనలేమీ లేవు. అందుకే ఎందుకు హామీదారుడి సంతకాన్ని తీసుకోవాల్సి వస్తుందో ముందే అడిగి తెలుసుకుంటే మంచిది.

ఉండే రిస్కులు ఇవే:
మీరే చెల్లించాల్సి రావొచ్చు..
Loan guarantor risks : హామీ సంతకం చేసే వ్యక్తి ఆదాయ, ఉద్యోగ వివరాలతో పాటు క్రెడిట్‌ స్కోర్‌, రుణం తిరిగి చెల్లించే సామర్థ్యం వంటి అంశాలను కూడా బ్యాంకులు పరిగణనలోకి తీసుకుంటాయి. తగిన వ్యక్తి అనుకుంటేనే బ్యాంకులు సంతకం చేయడానికి అనుమతిస్తాయి. ఎందుకంటే రుణం తీసుకున్నవారు ఒకవేళ సకాలంలో వాయిదాలు చెల్లించలేకపోతే.. ఆ మొత్తాన్ని హామీదారు నుంచి వసూలు చేసే హక్కు బ్యాంకులకు ఉంటుంది. జరిమానా, ఇతర అపరాధ రుసుములు కూడా చెల్లించాల్సిందే. అందుకే సంతకం చేసే వ్యక్తి ఆర్థిక స్తోమతను బ్యాంకులు ముందే అంచనా వేస్తాయి. ఈ నేపథ్యంలో హామీదారుగా ఉండేవారు.. లోన్‌ తీసుకుంటున్నవారు వారి రుణానికి రక్షణగా ఇన్సూరెన్స్‌ తీసుకోవాలని సూచించాలి. ఒకవేళ ఏదైనా అనుకోని పరిస్థితిలో రుణం చెల్లించలేకపోయినా.. భద్రత ఉంటుంది.

క్రెడిట్‌ స్కోర్‌పై ప్రభావం..
Loan guarantor credit score : ఒకవేళ లోన్‌ తీసుకున్న వ్యక్తి/వ్యక్తులు సకాలంలో వాయిదా చెల్లించలేకపోతే.. ఆ బాధ్యత హామీదారుపై కూడా ఉంటుంది. అందుకే చెల్లింపుల్లో ఏమాత్రం ఆలస్యమైనా ఆ ప్రభావం హామీ సంతకం చేసే వ్యక్తి క్రెడిట్‌ స్కోరుపై కూడా ఉంటుంది. ఒకవేళ భవిష్యత్తులో ఎప్పుడైనా మీరు రుణం తీసుకోవాలంటే ఇబ్బంది తలెత్తొచ్చు. అందుకే మీరు ఎవరికైతే.. హామీ ఇస్తున్నారో వారు తిరిగి చెల్లిస్తున్నారా? లేదా? తరచూ చెక్‌ చేసుకోండి. అలాగే మీ క్రెడిట్‌ స్కోరును కూడా పరిశీలించుకుంటూ ఉండండి.

రుణ అర్హత తగ్గొచ్చు..
హామీ సంతకం చేస్తున్నారంటే.. ఆ మొత్తాన్ని చెల్లించడానికి నేనూ సిద్ధమే అని అంగీకరిస్తున్నారని అర్థం. ఈ నేపథ్యంలో ఒకవేళ మీరు రుణం తీసుకోవాలనుకుంటే.. బ్యాంకులు మీరు హామీ ఉన్న మొత్తాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంటాయి. దాని ఆధారంగానే ఎంత లోన్‌ ఇవ్వాలో నిర్ణయిస్తాయి. ఒకవేళ త్వరలో మీకు ఏదైనా లోన్‌ తీసుకోవాల్సిన అవసరం ఉంటే.. హామీ సంతకం చేయడానికి ముందే ఆలోచించుకోవాలి.

తప్పించుకోలేరు..
ఒకసారి ఇతరుల రుణానికి హామీ ఇస్తున్నారంటే.. ఆ బాధ్యతల నుంచి ఎట్టిపరిస్థితుల్లోనూ తప్పించుకోలేరు. రుణం తీసుకున్నవారు తిరిగి దాన్ని చెల్లించే వరకూ ఆ భారం మీపై ఉంటుంది. అత్యవసర పరిస్థితుల్లో పక్కకు తప్పుకోవాలనుకుంటే.. మీ స్థానంలో రుణం తీసుకున్నవారు మరొకరిని బ్యాంకుకు హామీ ఇవ్వాల్సి ఉంటుంది. అప్పటి వరకు మీరు కొనసాగాల్సిందే.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.