ETV Bharat / business

LIC Jeevan Kiran : ఎల్​ఐసీ న్యూ పాలసీ.. ప్రీమియం డబ్బులు వెనక్కి వచ్చేస్తాయ్​​! మరెన్నో బెనిఫిట్స్​ కూడా! - గర్భిణీలు ఎల్​ఐసీ జీవన్​ కిరణ్ ప్లాన్​ తీసుకోవచ్చా

LIC Jeevan Kiran Policy : లైఫ్​ ఇన్సూరెన్స్​ కార్పొరేషన్​ ఆఫ్​ ఇండియా (ఎల్​ఐసీ) మరో సరికొత్త టర్మ్​ ఇన్సూరెన్స్​ ప్లాన్​ను తీసుకొచ్చింది. 'జీవన్​ కిరణ్​' పేరుతో తీసుకొచ్చిన ఈ ప్లాన్​లో ప్రత్యేకత ఏమిటంటే.. పాలసీదారు కట్టిన ప్రీమియం మొత్తాన్ని మెచ్యూరిటీ అనంతరం పూర్తిగా తిరిగి చెల్లిస్తారు. ఈ నయా ఎల్​ఐసీ పాలసీ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం రండి.

LIC Jeevan Kiran plan 870
LIC Jeevan Kiran policy
author img

By

Published : Jul 28, 2023, 2:50 PM IST

LIC Jeevan Kiran Plan : ప్రభుత్వ రంగ జీవిత బీమా సంస్థ (ఎల్​ఐసీ) మరో సరికొత్త టర్మ్​ ఇన్సూరెన్స్​ పాలసీని లాంఛ్​ చేసింది. 'జీవన్​ కిరణ్'​ (ప్లాన్​ 870) పేరుతో తీసుకొచ్చిన ఈ ఎల్​ఐసీ పాలసీ.. నాన్​ లింక్డ్​, నాన్​-పార్టిసిపేటింగ్​ ఇండివిడ్యువల్​ సేవింగ్స్​ అండ్​ లైఫ్​ ఇన్సూరెన్స్​ ప్లాన్​. ఈ పాలసీలోని ప్రత్యేకత ఏమిటంటే.. మెచ్యూరిటీ పూర్తి అయ్యాక అప్పటి వరకు కట్టిన ప్రీమియం మొత్తాన్ని తిరిగి పాలసీదారునికి చెల్లిస్తారు.

ప్రీమియం వెనక్కి ఇచ్చేస్తారు!
Premium return LIC Policy : సాధారణంగా టర్మ్ ఇన్సూరెన్స్​ పాలసీల్లో ప్రీమియం మొత్తాన్ని వెన్కక్కు ఇవ్వరు. కానీ ఈ జీవన్​ కిరణ్​ పాలసీలో బీమా హామీ ఇవ్వడం సహా.. మెచ్యూరిటీ సమయంలో ప్రీమియం మొత్తాన్ని వాపసు​ ఇస్తారు. ​వాస్తవానికి జీవన్​ కిరణ్​ పాలసీ తీసుకున్న వ్యక్తి​ టర్మ్​ పూర్తి అయ్యాక కూడా జీవించి ఉన్నట్లయితే.. అప్పటి వరకు అతను కట్టిన ప్రీమియం మొత్తాన్ని, తిరిగి అతనికే ఇచ్చేస్తారు. కానీ అతను చెల్లించిన ఎక్స్​ట్రా ప్రీమియంగానీ, రైడర్​ ప్రీమియంగానీ లేదా అప్పటి వరకు కట్టిన పన్నులు గానీ వెనక్కు ఇవ్వడం జరగదు. రెగ్యులర్​ ప్రీమియంతో పాటు, సింగిల్​ ప్రీమియంకు కూడా ఇదే నియమం వర్తిస్తుంది.

పాలసీ టెన్యూర్​ మధ్యలోనే మరణిస్తే!
LIC Jeevan Kiran Maturity : జీవన్ కిరణ్ పాలసీ తీసుకున్న వ్యక్తి ఒక వేళ టెన్యూర్​ మధ్యలోనే దురదృష్టవశాత్తు మరణిస్తే.. అతని కుటుంబానికి (నామినీకి) బేసిక్ సమ్​ అస్యూర్డ్ మొత్తాన్ని ఇచ్చేస్తారు. అలాగే వార్షిక ప్రీమియంనకు 7 రెట్లు లేదా అప్పటి వరకు చెల్లించిన మొత్తం ప్రీమియంలో 105 శాతం వెనక్కు ఇస్తారు. వాస్తవానికి ఈ రెండింటిలో ఏది ఎక్కువైతే, దానిని పాలసీదారుని కుటుంబానికి లేదా నామినీకి అందిస్తారు. ఒక వేళ సింగిల్​ ప్రీమియం ప్లాన్ తీసుకొని ఉంటే.. నామినీకి బేసిక్​ సమ్​ అస్యూర్డ్​ (ప్రాథమిక మొత్తం) లేదా సింగిల్​ ప్రీమియంలో 125 శాతం, ఏది ఎక్కువైతే అది అందిస్తారు.

ఎల్​ఐసీ జీవన్​ కిరణ్​ పాలసీదారుడు.. తన మరణానంతరం నామినీకి ఏక మొత్తంగా బీమా సొమ్ము అందేలా ఆప్షన్​ ఎంచుకోవచ్చు. లేదా ఐదేళ్ల పాటు విడతల వారీగా బీమా సొమ్ము అందేలా కూడా ఆప్షన్​ను సెలెక్ట్ చేసుకోవచ్చు.

జీవన్​ కిరణ్​ పాలసీ అర్హతలు
LIC Jeevan Kiran Plan Eligibility : ఎల్​ఐసీ జీవన్​ కిరణ్​ పాలసీ కొనుగోలు చేయాలంటే కనీస వయస్సు 18 సంవత్సరాలు నిండి ఉండాలి. గరిష్ఠ వయస్సు 65 ఏళ్లు ఉండొచ్చు. పాలసీ మెచ్యూరిటీకి కనీస వయస్సు 28 ఏళ్లు కాగా.. గరిష్ఠ వయస్సు 80 సంవత్సరాలు.

జీవన్​ కిరణ్​ పాలసీ 10 ఏళ్లు నుంచి 40 ఏళ్ల పాలసీ టర్మ్​తో అందుబాటులో ఉంటుంది. కనీసం రూ.15 లక్షల బీమా హామీతో ఈ పాలసీని కొనుగోలు చేయవచ్చు. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ పాలసీ గరిష్ఠ మొత్తంపై ఎలాంటి పరిమితీ లేదు. జీవన్​ కిరణ్​ పాలసీ కనీస ప్రీమియం రూ.3,000. సింగిల్​ ప్రీమియం అయితే రూ.30,000గా నిర్ణయించారు. పాలసీదారులు ఏడాదికి ఒకసారి లేదా ఆరు నెలలకు ఒకసారి ప్రీమియం మొత్తాన్ని చెల్లించేందుకు అవకాశం ఉంది.

పొగ పీల్చేవారికి అధిక ప్రీమియం
LIC Jeevan Kiran Premium For Smokers : పొగ పీల్చేవారు ఎల్​ఐసీ జీవన్​ కిరణ్​ పాలసీ తీసుకోవాలంటే.. కచ్చితంగా వారు అధిక ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. అలాగే ఎవరైతే వైద్య పరీక్షలు చేసుకోవడానికి నిరాకరిస్తారో.. వారు కూడా అధిక ప్రీమియం చెల్లించాల్సి వస్తుంది.

జీవన్​ కిరణ్​ పాలసీ + రైడర్స్​
LIC Jeevan Kiran Riders List : జీవన్​ కిరణ్​ పాలసీతో పాటు యాక్సిడెంటల్​ డెత్​ &​ డిజేబిలిటీ బెనిఫిట్​ రైడర్​, యాక్సిడెంట్ బెనిఫిట్​ రైడర్​లను కూడా తీసుకోవచ్చు. కానీ ఈ పాలసీపై ఎలాంటి లోన్​ సదుపాయం లభించదు.

మినహాయింపులు
LIC Jeevan Kiran not eligible list : ఎల్​ఐసీ తీసుకొచ్చిన ఈ జీవన్​ కిరణ్​ పాలసీ తీసుకోవడానికి గర్భిణులు అనర్హులు. డెలివరీ అయిన ఆరు నెలల తరువాత మాత్రమే స్త్రీలు ఈ జీవన్​ కిరణ్​ ప్లాన్​ను తీసుకోవడానికి వీలవుతుంది.

ఎల్​ఐసీ తీసుకొచ్చిన జీవన్​ కిరణ్​ పాలసీని ఎల్​ఐసీ వెబ్​సైట్​ ద్వారా నేరుగా కొనుగోలు చేయవచ్చు. లేదా ఎల్​ఐసీ ఏజెంట్ల ద్వారా కూడా పొందవచ్చు. పూర్తి వివరాలు ఎల్​ఐసీ వెబ్​సైట్​లో లభిస్తాయి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.